
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ రేట్లు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో రూ. 737.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ. 637కు తగ్గనుంది. ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 494.35గా ఉంది. ఇలా ఉండగా, జూన్ 22న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బీజేపీ మళ్లీ ప్రజలను మోసం చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది.