rate down
-
దేశంలో 500 కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 8,78,254కు, మరణాలు 23,174కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 5,53,470 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,01,609 మంది చికిత్స పొందుతున్నారు. అంటే 63.01 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో అధిక రికవరీ రేటు దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం63.02 కాగా, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటు కంటే అధికంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కరోనా మరణాల శాతం 2.64 కాగా, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతమని వెల్లడించింది. ఫవిపిరవిర్ ధర 27% తగ్గింపు కోవిడ్ చికిత్సలో వాడే యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫవిపిరవిర్’ మాత్రల ధరను 27 శాతం తగ్గించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఒక్కో మాత్ర ఖరీదు రూ.103 కాగా, ఇకపై రూ.75కు అమ్ముతారు. మాత్రలు ఫాబీఫ్లూ అనే బ్రాండ్ నేమ్‌తో లభ్యమవుతున్నాయి. వీటిని గత నెలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫవిపిరవిర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నామని, అందుకే ఖర్చు తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని కరోనా బాధితులకు బదిలీ చేస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. -
నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ రేట్లు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో రూ. 737.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ. 637కు తగ్గనుంది. ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 494.35గా ఉంది. ఇలా ఉండగా, జూన్ 22న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బీజేపీ మళ్లీ ప్రజలను మోసం చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
మొన్న గలగల.. నేడు విలవిల
- అమాంతం పడిపోయిన రేట్లు - పండ్లలో నాణ్యతా లోపం - కష్టాల్లో దానిమ్మ రైతులు మొన్నటి వరకు సిరులు కురిపించిన దానిమ్మ.. నేడు రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. పండ్లలో నాణ్యత లోపించడం, అమాంతం ధర పడిపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పెట్టుబడులు కూడా తిరిగిరాకపోవడంతో రైతులు డీలా పడిపోయారు. పెద్దపప్పూరు : తాడిపత్రి నియోజకవర్గంలో నెలక్రితం వరకు వీచిన వేడిగాలులు, ఎండలు దానిమ్మ రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వేడిగాలులు, ఎండల కారణంగా దానిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గడం తో పాటు చాలా వరకు నాణ్యత లోపించాయి. దీంతో రైతులు పండ్లను మార్కెట్ చేయలేకపోతున్నారు. ఎండలకు దానిమ్మ పండు లోపల ఎర్రగా ఉండాల్సిన విత్తనాలు నల్లగా మారడంతో రైతులు పండ్లను మార్కెట్లకు తీసుకెళ్లలేని పరిస్థితి. చేసేది లేక నాణ్యతలేని పండ్లను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. వెనక్కిరాని పెట్టుబడులు దానిమ్మ సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదు. మండలంలోని అమ్మలదిన్నె, జె.కొత్తపల్లి, నారాపురం, నామనాంకపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో రైతులు మృదులా, భగవ రకాలను సాగు చేశారు. ఎకరా దానిమ్మ పంటను సాగు చేయడానికి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. దానిమ్మను ఒక్కసారి సాగుచేస్తే దాదాపు 20 సంవత్సరాల వరకు దిగుబడులు అందుతాయి. మొక్కలు నాటిని రెండో సంవత్సరం నుండి దిగుబడులు తీసుకొవచ్చు. ఎకరా తోటలో దాదాపు 15 నుండి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే వేడిగాలుల దెబ్బకు ఈసారి కేవలం 6 నుండి 8 టన్నులకు పడిపోయింది. నాణ్యత లోపించడంతో మార్కెట్ రేట్లు తీవ్ర వ్యత్యాసం ఉంది. గత రెండు మూడు సంవత్సరాలు ఇదే సమయంలో టన్ను దానిమ్మ ధర రూ.50 వేల వరకు పలికింది. అయితే ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి పలుకకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన డిసెంబర్, జనవరి నెలలో టన్ను రూ. 90 వేలు పలకడం విశేషం. ప్రభుత్వమే ఆదుకొవాలి గత వేసవిలో వీచిన వేడిగాలులు, ఎండ వేడికి దానిమ్మ దిగుబడి సగానికి పైగా తగ్గింది. నాణ్యత లోపించింది. దీంతో మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ప్రభుత్వమే మమల్ని ఆదుకొవాలి. - వెంకటనారాయణ, దానిమ్మ రైతు, జె.కొత్తపల్లి బోర్లు వేసినా నీరు పడలేదు నాలుగు ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశాను. గత ఏడాది బోరులో నీరు రాకపోవడంతో వరుసగా నాలుగు బోర్లు వేశాను. చుక్కనీరు రాలేదు. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. నష్టపోతున్నాం. ప్రభుత్వమే రైతులను ఆదుకొవాలి. - నారాయణ, దానిమ్మ రైతు జె.కొత్తపల్లి -
ఉల్లి రైతు కంట కన్నీరు
దిగుబడి గణనీయం.. ధర భారీ పతనం నాడు క్వింటా.. 4వేలు.. నేడు రూ.400 రైతులను పట్టించుకోని ప్రభుత్వం గుమ్మఘట్ట : జిల్లా వ్యాప్తంగా ఉల్లి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది సిరులు కురిపించిన ఈ పంట, ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందినా, ధరలే కొంప ముంచాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గుమ్మఘట్ట మండలంలో 2,200, రాయదుర్గం రూరల్‌లో 400, కణేకల్లులో 200, బొమ్మనహాళ్‌లో 60, డీ హిరేహాళ్ లో 100 ఎకరాల్లో ఉల్లి పంటలు సాగయ్యాయి. జిల్లాలోనే అత్యధికంగా గుమ్మఘట్ట మండలంలో ఉల్లి సాగు ఏటేటా పెరుగుతూనే ఉంది. ధర తారుమారు గత ఏడాది ఈ సమయానికి క్వింటాలు ఉల్లి రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలికింది. అప్పుడు పంట సాగు చేసిన రైతులు మంచి లాభాలు చూశారు. ప్రస్తుతం ఇందులో సగం ధరలు కూడా లేకపోవడంతో కుదేలైపోయారు. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ. 400లోపే ధర పలుకుతోంది. దళారుల ఇష్టారాజ్యం.. రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంట ఆనవాయితీగా సాగవుతున్నా.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిని విక్రయించాలంటే రాజమండ్రి, కర్నూలు, చిత్తూరు, బెంగళూరు లాంటి పట్టణ ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. దీన్నే అదనుగా తీసుకున్న దళారులు కొందరు ధర నిర్ణేతలుగా మారిపోతున్నారు. ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ రైతు నోట్లో మట్టికొడుతున్నారు. కేంద్రం స్పందించాలి గతేడాదితో పోలిస్తే ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ.400 లోపు పలికితే ఎలా గట్టెక్కాలో రైతుకు అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి ఎగుమతికి అనుమతించి, మద్దతు ధరలు పెంచేలా చూడాలి. లేదంటే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. – ఉపేంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం ఉల్లి, టమాట, వేరుశనగ లాంటి ప్రధాన పంటలను కోల్పోయి రైతులు కకావికలమయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలే చేపట్టలేక పోయింది. రూ. లక్షల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. రాయదుర్గంలో మార్కెటింగ్ సౌకర్యంతో పాటు రైతు పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధరలు కల్పించాలి. వేరుశనగ, ఉల్లి, టమాట రైతులను తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలి. – కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం