సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య
నాసిక్: సిగరెట్లు తీసుకొనిరావడానికి నిరాకరించాడనే కోపంతో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలుడిని కిరాతంగా చంపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఘటన జరిగింది.
ప్లంబర్ శాలిగ్రామ్ ఫిర్యాదు మేరకు ఆయన కొడుకు గోలు అలియాస్ విశాల్ భలేరావు సిగరెట్లు తీసుకురానందుకు ఇటీవల ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఈ చిన్న కారణంతోనే నిందితులు కక్షకట్టి బాలుడ్ని హత్య చేశారు. అర్ధనగ్నంగా ఉన్న గోలు మృతదేహాన్ని ఆదివారం గుర్తించి పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టమ్ నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు.