notification cancelled
-
నిరుద్యోగులకు షాక్.. జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొంత మంది దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు కొందరు విద్యు త్ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. నోటిఫికేషన్ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి జేఎల్ఎం రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికేషన్ రద్దు చేయడం సరికాదని కొందరు జేఎల్ఎం అభ్యర్థులు పేర్కొంటున్నారు. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జా ప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు! -
రద్దు... లేదంటే రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో విడుదల చేసిన మూడు ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, లేదంటే రీషెడ్యూల్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు గురువారం లేఖ రాశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 6న నోటిఫికేషన్ విడుదల చేసి ఏడో తేదీ నుంచి నామినేషన్ల దాఖలు తేదీ ప్రకటించారని, అసలు ఓటర్ల జాబితా లేకుండా నామినేషన్లు ఎలా దాఖలు చేస్తారని లేఖలో ఆయన ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సదరు అభ్యర్థిని 10 మంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందని, కానీ అసలు ఓటరు జాబితా లేకుండానే నామినేషన్ వేయాలని చెప్పడం అర్థరహితమన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రెండు రోజులు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అఖిల పక్షంతో కలిసి తాము తెలంగాణ సీఈవో రజత్‌కుమార్‌ను కలిసినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారానే అన్ని నిర్ణయాలు జరుగుతాయని చెప్పారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఓటరు జాబితా ప్రకటించలేదన్నది వాస్తవమేనని అంగీకరించారని తెలిపారు. అయినా మే 27తో పదవీకాలం ముగుస్తున్న ఓటర్ల చేత మే 31న ఓట్లు ఎలా వేయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే అధికార టీఆర్ఎస్ ప్రభావంతోనే ఈ నోటిఫికేషన్ వచ్చిందని తమకు అర్థమవుతోందని ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకుగాను ఈనెల 6వ తేదీన ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని లేదంటే కొత్త ఓటర్లు వచ్చే వరకు రీషెడ్యూల్ చేయాలని ఉత్తమ్ లేఖలో కోరారు. -
గురుకుల పోస్టులకు బ్రేక్
⇒ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన ⇒ ఇంకా ఖరారుకాని కొత్త నిబంధనల రూపకల్పన ⇒ జాప్యం కారణంగా నోటిఫికేషన్ రద్దు ⇒ అర్హతలతో కూడిన మార్గదర్శకాలు వచ్చాకే నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ గురువారం రద్దు చేసింది. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత, కొత్త నిబంధనల రూపకల్పన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. నూతన నిబంధనలు వచ్చాక తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇష్టారాజ్యంగా నిబంధనలు గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లోని 7,306 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై తీవ్ర నిరసన వెల్లువెత్తింది. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పీజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన పెట్టారు. మూడేళ్ల బోధన అనుభవం నిబంధన, టీజీటీ పోస్టుల్లో డిగ్రీ–డీఎడ్ కలిగిన వారికి అవకాశమివ్వకపోవడం, పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా ఈ నిబంధనలు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. జాప్యం జరగడంతో.. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నోటిఫికేషన్ నిబంధనలను సవరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాంతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి చేపట్టాల్సిన దరఖాస్తుల స్వీకరణను టీఎస్పీఎస్సీ నిలిపివేసింది. గురుకుల సొసైటీలు, ప్రభుత్వం మార్పులతో కూడిన తాజా మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు ప్రారంభించాయి. కానీ దీనిపై జాప్యం జరుగుతోంది. కొత్త మార్గదర్శకాలు ఇంకా టీఎస్పీఎస్సీకి చేరకపోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కొత్త నిబంధనలు వచ్చాక, వాటి ప్రకారం మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గురుకుల నోటిఫికేషన్ రద్దు
హైదరాబాద్: అనుకున్నదే అయింది. గురుకుల నోటిఫికేషన్ రద్దయింది. త్వరలో కొత్త మార్గదర్శకాలతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్లో గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని, బోధన అనుభవం ఉండాలని తదితర కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను, బోధన అనుభవం నిబంధనను తొలగించాలని.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 50% మార్కులతోనే దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ గురుకుల విద్యాలయాల సంస్థలను ఆదేశించారు. దీంతో సంక్షేమ శాఖలు, గురుకుల విద్యాలయాల సంస్థలు హుటాహుటిన సమావేశమై... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శ కాల ప్రకారం కొత్త నిబంధనల రూప కల్పనపై కసరత్తు చేశాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు చర్చించారు. సీఎం ఆదేశాల ప్రకారం వాటిని సవరించి తిరిగి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు దరఖాస్తుల స్వీకరణను ఆపేసింది. అయితే, ఆ సవరణలు ఇప్పట్లో కావని, కనీసం నెల రోజులు పడుతుందని కొందురు సీనియర్ అధికారులు చెప్పారు. అసలు నోటిఫికేషన్ రద్దయ్యి కొత్త నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా వార్తలు వినిపించాయి. సరిగ్గా ఆ ప్రకారమే కొత్త మార్గదర్శకాలతో త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామంటూ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్స్‌ను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది.