NRC
-
జార్ఖండ్‌లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్‌ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్‌లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
ఆధార్‌కార్డుల జారీకి ‘ఎన్ఆర్సీ’ మెలిక
గువహటి: ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి దరఖాస్తు చేసుకున్న నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు. ఇందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. -
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్‌ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిట్టి పాపాయిలకు గట్టి భరోసా
కర్నూలు(హాస్పిటల్): చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు లేని వారిని గుర్తించి ప్రత్యేక చికిత్సతో పాటు ఉచితంగా పోషకా హారాన్ని అందిస్తోంది. ఇందుకు గానూ ఎన్ఆర్సీ కేంద్రాలను సమర్థవంతంగా ఉప యోగించుకుంటోంది. రోజుకు దాదాపు 15 మంది చిన్నారులు న్యూట్రిన్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేరి వైద్యం, పౌష్టికాహారం పొందుతున్నారు. ఇక్కడికి చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులకూ నగదు పారితోషికం ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో పౌష్టికాహార పునరావాస కేంద్రం(ఎన్ఆర్సీ)ను 2012లో ఏర్పాటు చేశారు. ఇందులో 20 పడకలున్నాయి. ఇద్దరు వైద్యులతోపాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక వంటమనిషి, ఇద్దరు న్యూట్రిషియన్ కౌన్సిలర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు చిన్నపిల్లల వార్డుకు వచ్చిన బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు ఇక్కడ కౌన్సిలింగ్‌తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. అవసరం మేరకు చిన్నారులను 14 నుంచి 21 రోజుల పాటు వార్డులో ఉంచుకుని, బరువులో మార్పు వచ్చాక డిశ్చార్జ్ చేయడంతో పాటు ఇంటి వద్ద ఏమి, ఎలా తినిపించాలో తల్లిదండ్రులకు వివరించి పంపిస్తున్నారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా వారం, రెండు వారాలు, నెల, రెండు నెలలు ఇలా నాలుగుసార్లు చిన్నారులకు ఫాలో అప్ చికిత్సను అందిస్తున్నారు. చిన్నారులకు ఇస్తున్న ఆహారం బెల్లంతో చేసిన సగ్గు బియ్యం పాయసం, రవ్వ పాయసం, పెసరబ్యాళ్ల పాయసం, జొన్నపిండి జావ/రాగి జావ/అన్నం జావ, ఉడికించిన గంజిగడ్డ, బంగాళదుంప, మెత్తగా ఉడికించిన అన్నం, అరటిపండు, టమాటా రసం, పాలలో నానబెట్టిన అటుకులు/అటుకుల ఉప్మా, కూరగాయలతో చేసిన ఉప్మా, అరటిపండు కలిపిన పెరుగు అన్నం, పల్చటి మజ్జిగతో మెత్తని అన్నం, టమాటా గుజ్జుతో మెత్తగా అన్నం, పప్పు కట్టు చారుతో అన్నం, పప్పు చారుతో అన్నం/పాలన్నం, రవ్వ ఉప్మా/రవ్వ గంజి, పొంగళి/కిచిడి, ఇడ్లీ, రసం, కోడిగుడ్డు, పండ్లు/పండ్ల రసాలు/టెంకాయనీళ్లు/మజ్జిగ/నిమ్మ, చెరకు రసం/ఉడికించిన కూరగాయల రసం అందిస్తారు. తల్లులకు ఉచితంగా భోజనం, పారితోషికం ఆస్పత్రిలోని ఎన్ఆర్సీలో చికిత్స పొందుతు న్న పిల్లల తల్లులకు ఉచితంగా భోజనంతో పాటు రోజుకు రూ.150 చొప్పున పారితోషి కం అందిస్తున్నారు. ఇది బరువు తక్కువగా జన్మించిన పిల్లలకు వైద్యం చేయిస్తూ పనులు మానుకుని ఆస్పత్రిలో ఉంటున్నందుకు ఆసరాగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అలాగే బరువు తక్కువ ఉన్న బిడ్డలను గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేసే ఆశా వర్కర్లకు సైతం కొంత పారితోషికం ఇస్తున్నారు. అవగాహన లేకే బరువు తక్కువ ఏమి తినిపించాలి, ఎలా తినిపించాలనే అవగాహన తల్లిదండ్రులకు లేకపోవడంతోనే చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. ఇలాంటి చిన్నారులు ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి ఓపీ చికిత్స, నెలకు 20 నుంచి 30 మందికి అడ్మిషన్ చేసుకుని వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నాం. దీనివల్ల భవిష్యత్‌లో పిల్లలకు భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో చౌకగా లభించే ఆహార పదార్థాలతోనే పిల్లలకు మంచిగా ఎలా పౌష్టికాహారాన్ని అందించవచ్చో వివరిస్తున్నాం. – ఎన్ఆర్సీ వైద్యులు చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జున బాబు ఎదుగుదలలో మార్పు వచ్చింది మా బాబు సూర్యప్రకాష్(1). బరువు తక్కువగా ఉండటంతో వారం క్రితం ఎన్ఆర్సీలో చేర్పించాం. ఇక్కడి డాక్టర్లు పిల్లలకు ఏమి, ఎప్పుడు తినిపించాలో బాగా వివరించా రు. ఇంట్లో లభించే ఆహార పదార్థాల్లోనే ఏఏ పోషకాలు ఉన్నాయి, వాటిని పిల్లలకు ఎలా తినిపించాలో చెప్పారు. ఇప్పుడు ఆస్పత్రిలోనూ బాబుకు మంచి ఆహారం, మందులు ఇస్తున్నారు. దీనివల్ల ఐదురోజుల్లోనే మార్పు కనిపించింది. – హరిత, ప్యాపిలి పాప ఆరోగ్యంగా ఉంది నాకు ఏడాది క్రితం కవల పిల్లలు (బాబు, పాప) జన్మించారు. ఇందులో పాప బరువు తక్కువగా ఉండటంతో రెండు నెలల క్రితం ఎన్ఆర్సీలో చేర్పించాను. డాక్టర్లు మంచి మందులు ఇవ్వడంతో పాటు సరైన పౌష్టికాహారం అందించారు. రోజుకు 6 నుంచి 8 సార్లు పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఎలా అందించాలో వివరించారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంటి వద్ద అలాగే చేస్తున్నాం. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉంటోంది. – సుజాత, గార్గేయపురం, కర్నూలు