nregs scheme
-
వాళ్లు రాస్తే ఏమనిపించదు గానీ...
సాక్షి, విజయవాడ : తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు సర్కార్ బురద జల్లుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. ‘ఉపాధి హామీ పనులను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారనేది అవాస్తవం. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. టీడీపీ నేతల జేబులు నింపడం కోసమే...ఉపాధి హామీ పనులను యంత్రాలతో చేయిస్తున్నది వాస్తవం కాదా?. మేం పేదల తరఫున మాట్లాడితే అభివృద్ధికి అడ్డుపడినట్లా?. ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు బయటపెడితే మాపై నిందలా?. మీకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి. లేదా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించండి’ అని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు, టీడీపీ నేతల జేబులు నింపేందుకే చంద్రబాబు పని చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఉపాధి పనులు లేక ప్రజలు పొట్టచేతబట్టుకొని దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంతో పేదలు గౌరవంగా బతికేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే...బాబు మాత్రం పేదల పొట్టగొడుతూ నిధులను పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. బాబు అధికారంలోకి వస్తూనే ఆగస్టు 12 2014న ఉపాధి హామీ పథకం పనుల్ని ఆపమని మెమో ఇచ్చిన ఘనుడని దుయ్యబట్టారు. ఆ రోజు ఉపాధి హామీ పథకం జరిగిన తీరుతెన్నులపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పింది వాస్తవం కాదా..?అని బాబును నిలదీశారు. ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేస్తే..నిధులు రాకుండా అడ్డుపడుతోందంటూ చంద్రబాబు నానా యాగీ చేయడం సరికాదన్నారు. ఉపాధి పనుల్లో 146కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనికి ఏం సమాధానం చెబుతారని బాబును, మంత్రులను ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ కూడ వైఎస్ఆర్ సీపీ రాసిందని చెబుతారా..? అంటూ ధ్వజమెత్తారు. కేంద్రానికి సంబంధించిన ఇండిపెండెంట్ బాడీ కూడా ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పిందన్నారు. 2016కు సంబంధించిన ఉపాధి హామీ పనుల్లో 350కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను మీడియా ముఖంగా పార్థసారధి చూపించారు. వాళ్లు రాస్తే ఏమనిపించదు గానీ...తాము ఆ తప్పుల్ని ఎత్తిచూపితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని పాట పాడతారా..? అని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో పదిలక్షల మంది వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే దాన్ని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని చంద్రబాబును నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తమ నాయకుడు వైఎస్ జగన్ నిలదీశారని పార్థసారధి గుర్తు చేశారు. ‘ప్రధాని కుర్చీ నా చేతిలో ఉందని తొడలు గొట్టారే గానీ.... వలసలను ఆపాలని గానీ, పేదవాళ్ల కడుపు నింపాలని గానీ ఏనాడైనా ప్రయత్నించారా బాబూ’ అని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ తన హయాంలో అత్యధికంగా ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి పేదలు గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించారన్నారు. చివరకు చంద్రబాబు ఎంత నీచానికి దిగజారారంటే... 13 లక్షల ఇళ్లు ఉపాధి హామీ పథకం కింద కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే వాటిని కూడా ఆపేశారని మండిపడ్డారు. -
‘ఉపాధి’ ఉత్తిదే!
– కరువులోనూ ఆదుకోని పథకం – కుటుంబానికి ‘వంద’.. అందనంత దూరమే! – పనుల్లేక వలస బాటలో కూలీలు – ‘భృతి’ విషయాన్ని మరచిన వైనం అనంతపురం టౌన్ : జాబ్‌కార్డు ఉండి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకంలో పని చూపించాలన్నది చట్టంలోని నిబంధన. ఈ పథకానికి నిధుల కొరత లేదు. నమోదైన వారందరికీ పనులు కల్పించాలి. పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పని చేయాలి. కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో పని కావాలని అడుగుతున్నా అధికారులు కల్పించడం లేదు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే పనులు చూపుతూ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. కొన్నిచోట్ల లేని కూలీలను ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడుతున్నారు. పనుల్లేక వలసబాట ప్రతి కుటుంబానికి వంద రోజులు పని చూపించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఈ పథకాన్ని తీసుకొచ్చినా.. అది కాగితాలకే పరిమితం అవుతోంది. ఏటా జిల్లాలో కరువు నెలకొంటున్నా కూలీల ఉపాధికి ఏ మాత్రమూ ‘హామీ’ ఇవ్వలేకపోతున్నారు. దీంతో బయట వ్యవసాయ పనులు లేక.. ఉపాధి దొరకక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి చూపలేని పక్షంలో భృతి కింద డబ్బు ఇవ్వాల్సిన ఉన్నా ఏ ఒక్కరికీ ఇస్తున్న పాపానపోవడం లేదు. ఈ క్రమంలో కూలీలు వలస బాట పడుతున్నారు. ఒక్క కుందుర్పి మండలంలోనే వేలాది కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాయి. ఈ మండలంలోని బెస్తరపల్లి, ఎనుములదొడ్డి, తూముకుంట, కరిగానిపల్లి, ఎర్రగుంట, మలయనూరు, నిజవల్లి, జంబగుంపల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున వలసబాట పట్టారు. ఇప్పుడు ముసలీముతక తప్ప ఎవరూ ఇళ్ల వద్ద ఉంటున్న పరిస్థితి లేదు. కానీ అధికారుల కళ్లకు ఇవేమీ కన్పించకపోవడం గమనార్హం. మరుగున పడుతున్న ప్రణాళికలు ఉపాధి పథకం సిబ్బంది ఏడాదికి ఒకసారి గ్రామాల్లో సభలు నిర్వహించి పథకం కింద చేపట్టాల్సిన పనులు గుర్తించాలి. ఆయా పనులను ఏడాదిలో పూర్తి చేసేలా, అడిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలి. కానీ..ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 98,502 పనులు గుర్తించారు. ఇప్పటి వరకు 29,414 పనులను మాత్రమే పూర్తి చేశారు. ఒక్కో కుటుంబానికి 48 రోజుల చొప్పున మాత్రమే పని చూపించారు. జిల్లాలో 7,85,225 జాబ్‌కార్డులు ఉండగా.. 15,395 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించారు. జిల్లాలో గత ఆరేళ్లుగా అమలు తీరును పరిశీలిస్తే లక్ష్యంలో సగం పనిదినాలు కూడా చూపించని దుస్థితి నెలకొంది. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉపాధి పనులు కల్పించాలని కోరితే తప్పకుండా చూపాల్సిందే. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత పీఓలపై కఠినంగా వ్యవహరిస్తాం. – నాగభూషణం, డ్వామా పీడీ ఆరేళ్లుగా పథకం అమలు తీరిది.. ఏడాది జాబ్‌కార్డులు ఒక కుటుంబానికి ఏడాదిలో చూపిన పని దినాల శాతం వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 2011–12 7,08,405 82.48 78,174 2012–13 7,30,303 73.11 74,729 2013–14 7,47,020 64.27 61,617 2014–15 7,61,069 54.05 41,833 2015–16 7,81,124 75.74 93,615 2016–17 7,85,225 48.27 (ఆగస్టు వరకు) 15,395 -
ఉపాధి కూలీల ఆందోళన
వరంగల్: వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా కూలీ ఇవ్వటం లేదంటూ మండలకేంద్రంలోని రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రాస్తారోకోకు పూనుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.