Nrusimhaswamy
-
నృసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్
మంగళగిరి: మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం దర్శించుకున్నారు. నూతన సచివాలయంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజు శాసనసభలో ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ ఉదయం ఏడు గంటలకు పానకాల లక్ష్మీనృసింహస్వామి ఎగువ సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిగువ సన్నిధికి చేరుకుని ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసి స్వామివారితోపాటు ఆలయ ఆవరణలోని రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పానకాలరావు, పాలకవర్గ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి నృసింహుని చిత్రపటాన్ని బహూకరించగా అర్చకులు దివి పద్మనాభాచార్యులు, ఎన్ఎస్ భట్టాచార్యులు పూజలు నిర్వహించారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన స్వాతి వేడుకలు సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని స్వామి జయంతోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని 10 దేవాలయాల్లో కొలువైన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
– నవ నారసింహ క్షేత్రాల్లోని లక్ష్మీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో స్వయంభువుగా వెలసిన స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ.. నిత్య పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో కొలువుదీర్చి ముద్రకర్త శ్రీమాణ్ వేణుగోపాలన్, మణియార్ వైకుంఠం స్వామి ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలోని స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యంతో భక్తులు తరించారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.