కోమటిరెడ్డి ఇల్లు ముట్టడి
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిని ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ముట్టిడించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళనకు దిగిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.