ntr vidhyonnathi
-
‘టీడీపీ నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలను ఆయన ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. తిత్లీ తుపాన్ బాధితులకు పరిహారం అందజేయడంలో పచ్చ చొక్కా నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుపాన్ విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే.. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని హైజాక్ చేసిన టీడీపీ నేతలు వారి నోట్లో మన్ను కొట్టారని విమర్శించారు. సెంట్ భూమి లేనివారు సైతం బాధితులమంటూ.. 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్టు రాయించుకున్న ఘటనలు కోకొల్లలని తెలిపారు. 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు చేసుకుని.. ఎకరానికి 60 కొబ్బరి చెట్లు చోప్పున 3 ఎకరాలకు 180 చెల్లు చూపించి.. 2.70 లక్షల పరిహారం పొందారని అన్నారు. ఈ విధమైన కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని దోచేశారని మండిపడ్డారు. విద్యోన్నతిలో గందరగోళం.. ఎన్టీఆర్ విద్యోన్నతి కోచింగ్ సెంటర్ల కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని అన్నారు. చాలా మంది అభ్యర్థులకు చాలా దూరంగా కోచింగ్ సెంటర్లను కేటాయించడంపై మండిపడ్డారు. అభ్యర్థులు తమకు దగ్గర్లోని హైదరాబాద్, విజయవాడలలో సెంటర్లు కోరుకుంటే వారికి.. తెలుగు మీడియం సౌకర్యం లేని, ఎక్కడో దూరానా ఉన్న ఢిల్లీలో సెంటర్లు కేటాయించారని విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే ఎన్యూమరేషన్‌ను హైజాక్ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 సెంటు భూమి లేని వారు సైతం 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న ఘటనలు కోకొల్లలు! 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు. ఎకరాకి 60 కొబ్బరి చెట్లు చొప్పున 3 ఎకరాలకు 180 చెట్లు. పరిహారం 2.70 లక్షలు. కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని హాంఫట్ చేసిన తీరిది! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 The allotment of NTR Vidyonnathi coaching centers by the @ncbn administration is done in a ridiculous manner. Many aspirants are allotted far off places like Delhi where there is no Telugu medium facility even though they opted for nearby places like Vijayawada and Hyderabad. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 -
‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ ఎంపికలో గోల్మాల్
-
‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ ఎంపికలో గోల్మాల్
సాక్షి, అమరావతి: సివిల్స్ కోచింగ్‌కు ఉద్దేశించిన ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఎంపికలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపికైన వారి జాబితాను బీసీ సంక్షేమ శాఖ సోమవారం రాత్రి ఇంటర్నెట్లో పెట్టింది. ఎంపికలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. దాదాపు 100 మందికి అన్యాయం జరిగిందని విద్యార్థులు చెబుతుండగా 30 మంది వరకు ఉండే అవకాశం ఉందని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. 82 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎంపిక జాబితాలో లేకుంటే నేరుగా తనను కలవొచ్చని, వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. టీసీఎస్, జేఎన్టీయూ తయారు చేసిన జాబితాలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు బుధవారం బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు. డైరెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. కటాఫ్ మార్కులు 82గా నిర్దేశించినందున సీటు రాని వారు వచ్చే సంవత్సరం రాసుకోవాలని, లేదంటే గ్రూప్స్ కోచింగ్‌కు ఎంపిక చేస్తామని డైరెక్టర్ పేర్కొన్నారు. కొందరు విద్యార్థినులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటే తప్పకుండా ఎంపికవుతామనే నమ్మకంతో పోటీ పరీక్ష రాశామని, ఇప్పుడు జాబితాలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలేదీ? సివిల్స్ కోచింగ్‌కు బీసీ విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో రిజర్వేషన్లు అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం.. ఏ, బీ, డీ గ్రూపుల వారికి తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఏ గ్రూపు వారికి 7శాతం, బీ గ్రూపు వారికి 10 శాతం, డీ గ్రూపు వారికి 8 శాతం ఇవ్వాలి. సీ గ్రూపు వారికి సాంఘిక సంక్షేమ శాఖ రిజర్వేషన్ ఇస్తుంది. ఇవి కాకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ తప్పక పాటించాలి. బీసీ సంక్షేమ శాఖ మెరిట్ ప్రకారం జాబితాను ప్రకటించి ఎంపిక చేసింది. అందులోనూ లోపాలు ఉన్నాయని బయటపడింది. ఎక్కువ మార్కులు వచ్చిన వారిని పక్కనపెట్టి తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు ఇచ్చారు. ఇచ్చిన సీట్లను రద్దుచేసే అవకాశం లేదు. మిగిలిపోయిన సీట్లు బీసీల్లో 131 సీట్లు మిగిలిపోయాయి. 1,000 మందికిగాను 869 మందికి సీట్లు కేటాయించారు. ఈబీసీల్లో 750 మందికి గాను 620 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 130 మందికి ఇవ్వాల్సి ఉంది. కటాఫ్ మార్కుల కారణంగా సీట్లు మిగిలిపోయాయి. తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు రావడం, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు రాకపోవడాన్ని చూస్తే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వారి సిఫార్సులకు తలవంచి తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామని, మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది తప్ప కేటగిరీల వారీగా రిజర్వేషన్ ఉండదని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్థన్ చెప్పారు. -
ఎన్టీఆర్ విద్యోన్నతి..అభ్యర్థులు అధోగతి
రెండోవిడత ఎంపికపై నీలినీడలు! వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి మొండిచేయి అనంతపురం ఎడ్యుకేషన్ : ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై ఆశలు పెట్టుకుని సివిల్స్ రాయాలనుకున్న చాలామంది అభ్యర్థులు కొందరు అధికారుల అలసత్వం కారణంగా అధోగతి పాలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్, బ్రెయిన్ ట్రీ, లక్ష్మయ్య కోచింగ్ సెంటర్‌తో పాటు బెంగళూరులోని యూనివర్సల్, ఢిల్లీలోని శ్రీరామ్స్ కోచింగ్ సెంటర్లలో ఉచితంగా తొమ్మిది నెలలపాటు శిక్షణ ఇప్పిస్తారు. నెలకు రూ.8 వేలు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం–2016 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాల్సి ఉండగా, వీరిని ఎంపిక చేయడానికి కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ వారు ఆగష్టు 28న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించారు. 2వేల మందితో మెరిట్ లిస్టు తయారు చేశారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 1000 మంది అభ్యర్థులను పిలిచారు. - హాజరైన వారిలో 137 (ఎస్సీలు 107, ఎస్టీలు 30) మంది ఇదివరకే శిక్షణ తీసుకున్నవారు కావడంతో అధికారులు వీరికి అవకాశం కల్పించలేదు. అయితే నోటిఫికేషన్లో ‘శిక్షణ తీసుకున్న వారు అనర్హులు’ అనే విషయాన్ని పొందుపరచక పోవడం వల్లే తాము పరీక్ష రాశామని, ఎంపికయ్యాక కాదంటే ఎలాగని వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారి సర్టిఫికెట్లను పరిశీలించాలని, తుది నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ 137 మంది సర్టిఫికెట్లనూ అక్టోబర్ 5న పరిశీలించారు. - మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 250 మంది దాకా గైర్హాజరు కాగా, వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారిని ఎంపిక చేసేందుకు అక్టోబర్ 14న వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. దాదాపు ఎస్సీ విద్యార్థులు 200 మంది, ఎస్టీ విద్యార్థులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. మూడు వారాలు గడిచినా వారికి ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) రాకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయారు. ఓటీపీ వస్తేనే ఆన్లైన్లో కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకునే వీలుంటుంది. 2017 జూన్ 18న ప్రిలిమినరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. యూపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష 2017 జూన్ 18న నిర్వహించనున్నారు. శిక్షణ తొమ్మిది నెలలైతే పరీక్ష గడువు 7 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు నెలల శిక్షణ కోల్పోయామని, వెంటనే రెండో జాబితాను ఖరారు చేసి శిక్షణకు పంపించాలని అభ్యర్థులు రాము, రుషికేష్, ముత్యాలప్ప, సాయినాథ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్నను వివరణ కోరగా... ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, అంతా డైరెక్టరేట్ కార్యాలయం వారు, కాకినాడ జేఎన్టీయూ వారే చూస్తున్నారని ఆయన తెలిపారు.