యాప్.. యాప్ హుర్రే..!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల సందడి పెరుగుతున్న కొద్దీ మనదేశంలో మొబైల్ అప్లికేషన్స్(యాప్స్) డౌన్లోడ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోందట. 2012లో 156 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ కాగా.. వచ్చే ఏడాది నాటికి ఆ సంఖ్య ఏకంగా 900 కోట్లకు చేరనుందట! అసోచామ్, డెలాయిట్ సంస్థలు ‘డిజిటేషన్ అండ్ మొబిలిటీ’ పేరుతో జరిపిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. ఈ సంస్థల తాజా అంచనాల ప్రకారం.. భారత్‌లో యాప్‌ల వృద్ధి రేటు ఏడాదికి 75 శాతం నమోదవుతోంది. 16-30 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా సోషల్‌మీడియా యూజర్లు పెరగడం, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ మంది క్రియాశీలం కావడం వల్లే యాప్‌ల వృద్ధిరేటు పెరిగింది. ఎన్నికల సమయంలో ఒక్క ఫేస్‌బుక్‌లోనే 2.90 కోట్ల మంది 22.70 కోట్ల పోస్టులు ఉంచారు. ట్విట్టర్లో సైతం 6 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయి. ఎక్కువగా డౌన్లోడ్ అయిన యాప్‌లలో మొబైల్ టీవీ, వాట్సాప్, యూటూబ్, స్నాప్‌చాట్ వంటి వి ఉన్నాయి. అయితే గేమ్‌లు, యాప్‌ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు మాత్రం భారతీయులు పెద్దగా ఇష్టపడటం లేదట.