objection letters
-
దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన
సాక్షి, బాన్సువాడ : బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద కార్మికులు కోలాటం ఆడి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నాయమైన డిమాండ్లను పరిష్కారించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులు కావస్తున్న సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అందుకే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఖలీల్, సుదీర్, సంగమేశ్వర్, హన్మండ్లు, రాజాసింగ్, అశ్వీన్, సోను, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్, కో కన్వీనర్లు మల్లయ్య, బసంత్, శంకర్, లక్ష్మణ్, నాగరాజ్, జీఎస్. గౌడ్, యాదుల్లా, మూర్తి, కౌ సర్, సాయిలు, చంద్రకాంత్, ప్రశాంత్‌రెడ్డి, రా ధ, సవిత, విమల, లక్ష్మీ, శ్యామల ఉన్నారు. శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్తులకు బంద్‌కు సహకరించాలని విన్నవించారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. -
అప్పీళ్ల పరిశీలన
వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్న సిబ్బంది అన్ని అభ్యంతరాలను పరిశీలించనున్న కలెక్టర్ ఆ తర్వాత కలెక్టర్ సంతకంతో అప్లోడ్ జిల్లాలో 1,047కు చేరిన అభ్యంతరాలు హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అభ్యంతరాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లాల ఏర్పాటు అప్పీళ్ల కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్లో నమోదైన దరఖాస్తులను డౌన్లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే వచ్చిన మెుత్తం అప్పీళ్లను కలెక్టర్ పరిశీలించి రిమార్క్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి అవసరమైన వాటిని కలెక్టర్ సంతకంతో మళ్లీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో నేరుగా అందజేసిన అప్పీళ్ల కాపీలను కూడా అధికారులు కలెక్టర్ పరిశీలనకు ఉంచి అనంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో నమోదైన అప్పీళ్లను డౌన్లోడ్ చేయడం.. వాటిని కలెక్టర్ పరిశీలించాక మళ్లీ అప్లోడ్ చేయడం అధికారులకు తలకు మించిన భారంలా మారనుంది. ముఖ్యంగా సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా తొందరగా డౌన్లోడ్ కావడం లేదు. ఈక్రమంలో శుక్రవారం సుమారు 2గంటల పాటు ఈ పనిలో ఉన్న అధికారులు మొత్తంగా 50 అప్పీళ్లు కూడా డౌన్లోడ్ చేయలేకపోయారు. ఈ లెక్కన ఇప్పటివరకు నమోదైన 1,047 అప్పీళ్లను డౌన్లోడ్ చేసి పరిశీలించి అప్లోడ్ చేయడం ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్న దానిపై అధికారులతో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడారు. అలాగే, డీఆర్వో కార్యాలయంలో డీఆర్వో కె.శోభ, జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్ సమావేశమై అప్పీళ్ల పరిశీలనపై చర్చించారు. -
సమీకరణపై 10 వేల అభ్యంతరాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని భూసమీకరణకు సంబంధించి కుప్పలు తెప్పలుగా వచ్చిన అభ్యంతరాలకు సమాధానాలిచ్చేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఆపసోపాలు పడుతోంది. స్వచ్ఛందంగా భూములిచ్చేవారి అంగీకార పత్రాలతోపాటు భూములిచ్చేందుకు నిరాకరించే రైతుల అభ్యంతర పత్రాలు కూడా భారీగా వచ్చాయి. తొలిదశ భూసమీకరణ ప్రక్రియ ముగిసే నాటికి 7,982 ఎకరాలకు సంబంధించి 10,460 మంది రైతులు అభ్యంతర(9.2) పత్రాలు దాఖలు చేశారు. వాటిలో 70 శాతం భూములకు సంబంధించినవి కాగా మిగిలినవి ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి. సుమారు ఏడువేల పత్రాలు అభ్యంతరాలు కాగా మిగతావన్నీ సూచనలు, సలహాలు ఉన్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా చదివి సీఆర్డీఏ చట్టానికి లోబడి సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఎక్కువమంది భూములివ్వడం తమకిష్టం లేదని పత్రాల్లో పేర్కొన్నారు. కొందరు పరిహారం పెంచాలని, మరికొందరు తమకున్న భూమిలో కొంత ఇచ్చి కొంత ఉంచుకుంటామని, ఇంకొందరు జరీబు భూములు ఉంచుకుని, మెట్ట భూములు ఇస్తామని 9.2 పత్రాల్లో పేర్కొన్నారు. గ్రామకంఠానికి అవతల తమ ఇళ్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తారా? అని కొందరు పత్రాలు దాఖలు చేయగా, గ్రామాలను ఇక్కడే ఉంచుతారా? వేరే చోటుకు తరలిస్తారా?, రోడ్డుపక్కన ఉన్న భూమికి, రోడ్డు అవతల ఉన్న భూమికి ఒకే పరిహారం ఇస్తారా? అని పలువురు పత్రాల్లో పేర్కొన్నారు. భూముల తర్వాత వ్యవసాయాధారిత వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటికీ సమాధానాలిచ్చేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసమీకరణ జరుగుతున్న తొలిదశలో అంగీకార పత్రాల(9.3)తోపాటు భారీగా వస్తున్న అభ్యంతర పత్రాల(9.2)ను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తీసుకోకతప్పలేదు. చివరికి 32,469 ఎకరాలకు సంబంధించి 20,510 మంది రైతులు అంగీకారపత్రాలివ్వగా 10,460 మంది అభ్యంతరాల పత్రాలిచ్చారు.