Objectionable Picture
-
ధోనితో ఆ లోగో తీయించండి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారత ఆర్మీ అంటే అభిమానం, గౌరవం. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ధోని రాష్ట్రపతి భవన్లో జరి గిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఆర్మీ కవాతుతో పురస్కారాన్ని స్వీకరించాడు. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు... వారిని స్మరిస్తూ ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగేలా చేశాడు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అతని దేశభక్తి ఉన్నతమైనదే అయినా... దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. -
వాట్సాప్: అభ్యంతరకర ఫొటో.. ఇద్దరిపై కేసు
సాక్షి, ముజఫర్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. వాట్సాప్‌లో పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందులో ఒకరు వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ కాగా, మరొకరు ఫొటోను పోస్టు చేసిన వ్యక్తి. ఐపీసీ సెక్షన్ 505 (ఒక వర్గాన్ని లేదా ఒక వ్యక్తిని రెచ్చగొట్టే ఉద్దేశంతో వ్యవహరించడం, వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం), ఐటీ చట్టం కింద అభియోగాలు నమోదుచేశారు. వాట్సాప్‌లో ప్రధాని మోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. సర్క్యులేట్ చేయడంపై స్థానిక బీజేపీ నేత యోగేందర్ చౌదరి ఆందోళన నిర్వహించి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు. -
ప్రధాని ఫోటో సర్క్యూలేట్ చేస్తూ పట్టుబడ్డాడు!
మోరెనా : సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ షాపు నడుపుతున్న అస్లాం ఖాన్ అనే వ్యక్తి, ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్నాడని బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఆత్మారాం శర్మ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోపై బన్మోర్ డివిజన్ ప్రెసిడెంట్ రాంబారన్ మావై ఆధ్వర్యంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు స్టేషన్ ముందు నిరసనకు దిగినట్టు చెప్పారు. అదుపులోకి తీసుకున్న అస్లాం ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు శర్మ చెప్పారు. -
ములాయంపై అభ్యంతరకర పోస్ట్
సంభల్: సమాజ్ వాదీ పార్టీ(ఎస్ పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడు. దీనిపై ఎస్ పీ యువజన సభ విభాగం నాయకుడు కైజర్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.