సమాజ్ వాదీ పార్టీ(ఎస్ పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడు.
సంభల్: సమాజ్ వాదీ పార్టీ(ఎస్ పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడు. దీనిపై ఎస్ పీ యువజన సభ విభాగం నాయకుడు కైజర్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.