obulavaripalli-krishnapatnam railway line
-
రాజధాని ప్రయాణమెప్పుడో..!
సాక్షి, కడప : చెన్నై–ముంబై కారిడార్ రైలు మార్గంలో జిల్లాలో అనుసంధానంగా నిర్మితమైన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో రాజధానికి రైలు అనే అంశం ఇప్పుడు జిల్లా వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎర్రగుంట్ల–నంద్యాల మార్గంలో ధర్మవరం–విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలును నడుస్తోంది. అయితే ఈ రైలు జిల్లా కేంద్రంలోని ప్రజలు రాజధానికి వెళ్లేందుకు అనుకూలంగా లేదనే వాదన వినిపిస్తోంది. ప్యాసింజర్ రైలు నడపాలని నిర్ణయం.. కడప–విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు యోచిస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి రోజున రైలును పట్టాలు ఎక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైలు కడప నుంచి విజయవాడ మధ్య నడిపిస్తే రాజధానికి వెళ్లేందుకు మార్గం సుగమం అవతుంది. ఈ రైలుకు ఫర్మిషన్ తెచ్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దిశగా దృష్టి సారించినట్లు రైల్వే వర్గాలు అంటున్నాయి. ఉదయానికి చేరుకునేలా.. కడప–విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు కడప రైల్వేస్టేషన్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయాన్నే విజయవాడకు చేరుకునేలా రైలును నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్నందున రాత్రి వేళలో త్వరలో ప్రవేశపెట్టబోయే ప్యాసింజర్‌ను నడిపిస్తే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని, అదే విధంగా విజయవాడలో కూడా రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయాన్నే కడపకు చేరుకునేలా రైలు రాకపోకలను నిర్ణయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు పై విధంగా రైలు నడిచేలా కృషిచేయాలని కోరుతున్నారు. అందుబాటులోకి లైను.. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం రైల్వేస్టేషన్లో ఫిబ్రవరి 21న కృష్ణపట్నం రైల్వేలైన్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. కాగా ఈ మార్గంలోని టన్నెల్ కిలో మీటర్ మేర పనులు పెండింగ్‌లో ఉన్నందువల్ల అప్పట్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేలేకపోయారు. అయితే ఈ మార్గాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ట్రయల్‌రన్ నిర్వహించారు. గత శుక్రవారం జీఎం గజనాన మాల్యా ఈ మార్గాన్ని పరిశీలించారు. ప్రయాణం కోసం ఎదురుచూపులు.. కడప –నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉన్న వెలికొండలను తొలిచి.. కృష్ణపట్నంకు వెళ్లేలా రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోనే పెద్దదిగా ఈ టన్నెల్స్‌కు గుర్తింపు రానున్నది. 7.5 కిలోమీటర్ల మేర గుహలో రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణం మరపురాని అనుభూతిగా ఉంటుందని ప్రయాణికు భావిస్తున్నారు. జిల్లా వాసులు ఈ మార్గంలో రాజధానికి చేరుకునేలా ప్యాసింజర్ రైలు కోసం ఎదురుచూస్తున్నారు. గూడ్స్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్.. ఈ మార్గంలో ముందుగా గూడ్స్ రైళ్లను నడిపించేందుకు రైల్వే సమాయత్తం అవుతుంది. సరుకుల రవాణాకు సంబంధించి గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం రైల్వే లైనులో నడవనున్నాయి. ప్రధానంగా రేణిగుంటకు వెళ్లి కృష్ణపట్నంకు వెళుతున్న బొగ్గు తదితర సరకుల రవాణా ఓబులవారిపల్లె నుంచి నడిపించేందుకు రైల్వే కసరత్తు చేస్తోంది. దీంతో రేణిగుంటకు వెళ్లకుండా కొత్తగా నిర్మితమైన రైలు మార్గంలో గూడ్స్ రైళ్లు నడువనున్నాయి. -
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం
సాక్షి, కడప : కృష్ణపట్టణం–ఓబులవారిపల్లె రైలు మార్గంలో రైలుకూత వినిపిస్తుందని దశాబ్దకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పూర్తిస్థాయిలో కృష్ణపట్టణం నుంచి ఓబులవారిపల్లె మీదుగా సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లను అధికారులు నడుపనున్నారు. కృష్ణపట్టణం పోర్టు నుంచి ఓబులవారిపల్లెకు దాదాపు 113 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో విద్యుత్ రైల్ ఇంజిన్ల ద్వారా గూడ్సులను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు రూ.2వేల కోట్లు వ్యయంతో పనులు పూర్తి చేశారు. రైలు మార్గం 2005–06లో మంజూరైంది. ఈనెల 15న రైల్వే అధికారులు ఆర్వీఎన్ఎల్ అధికారులు కలిసి పూర్తిస్థాయి గూడ్స్ ఇంజిన్‌తో ట్రైయల్‌రన్‌గా రైలును నడిపించారు. ఈ మార్గంలో కిలోమీటర్ రెండవ టన్నెల్ ఇదివరకే పూర్తయింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఈ దారిలో ఉంది. పూర్తిస్థాయి ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గం కృష్ణపట్టణం పోర్టు నుంచి సరుకు రవాణా చేసేందుకు నిర్మించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో పూర్తిస్థాయిలో రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో ఈ మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపేందుకు వీలుపడదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా దశాబ్దాలుగా కడప జిల్లా నుంచి కోస్తాకు, రాష్ట్ర రాజధాని విజయవాడకు నేరుగా రైలుమార్గం ఏర్పాటు చేసి ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20నుంచి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఇంజిన్లతో గూడ్సు రైలును ప్రారంభిస్తామని రైల్వే అధికారులు ప్రకటించినా, అనివార్య కారణాలతో నడపలేదు. ట్రక్ టన్నెల్ వద్ద చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి గూడ్సు రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్య, డివిజినల్ రైల్వే మేనేజర్ విజయప్రతాప్‌సింగ్ శుక్రవారం ఓబులవారిపల్లె–కృష్ణపట్టణం రైలు మార్గాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో నందలూరుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక రైలులో మార్గంలోని ట్రాక్ నాణ్యత, టన్నెల్ పనులను పరిశీలించనున్నారు. -
కృష్ణపట్నం లైన్‌కు రెడ్ సిగ్నల్!
⇒ ఆగిన టన్నెల్ నిర్మాణంతో సాగని పనులు ⇒ చేతులె త్తేసిన ముంబయి నిర్మాణ సంస్థ ⇒ మళ్లీ టెండర్లకు సన్నాహాలు ⇒ రూ400 కోట్లతో టన్నెల్ నిర్మాణం అంచనా రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం రైల్వేలైన్ పూర్తికి టన్నెల్ నిర్మాణమే అడ్డంకిగా మారింది. 8 ఏళ్లుగా ఈ రైల్వే లైను పనులు సాగుతున్నాయి. టన్నెల్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఈ మార్గం పూర్తికి గ్ర హణం పట్టింది. కృష్ణపట్నం- ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మితం కావాల్సి ఉంది. అయితే 18/66 కెఎం వద్ద 5.50 కిలోమీటర్లు, మరికొంత దూరంలో 1.50 కిలోమీటర్ల మేర టన్నెల్ వేయాల్సి ఉంది. 2007లో ముంబాయికు చెందిన దీపికా నిర్మాణ సంస్ధ రూ.400 కోట్ల అంచనాలతో దీని పనులు మొదలుపెట్టింది. పనులు చేసే విషయంలో నిబంధనలకు, వాస్తవ పరిస్థితికి మధ్య తేడాలు రావడంతో ఆ సంస్థ పనులను ఆపేసింది. ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు పాతరేట్లతో పనులు కొనసాగిస్తే తాము నష్టపోతామని ఆ సంస్ధ చేతులెత్తిసింది. కృష్ణపట్నం రైలుమార్గం తీరు ఇలా.. 113 కిలోమీటర్ల మేరకు కలిగిన కృష్ణపట్నం రైల్వేలైన్ 2005-2006లో మంజూరు అయింది. రూ.930కోట్ల అంచనాతో రైల్వేనిర్మాణ పనులు మొదలైంది. ఇప్పుడు అంచనా వ్యయం భారీగానే పెరిగిపోయింది. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలుపట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్‌ను పూర్తిచేశారు. ఇక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో టన్నెల్ ఉంది. 17 కిలోమీటర్ల మేర ఎర్త్ వర్క్ పనులు పూర్తి చేశారు. 38 చిన్న వంతెనెలు, 8 పెద్ద వంతెనలు పూర్తికావచ్చాయి. ఈ మార్గంలో మొత్తం మూడు రీచ్‌లు ఉన్నాయి. 1-17, 17 -35, 35-97 కిలోమీటర్ల మేర ఈ రీచ్‌లో ఉన్నాయి. 35-97 రీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ రీచ్‌లో పనులు త్వరితగతిని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలో రైలుమార్గానికి సంబంధించి ఎర్త్ పనులు శరవేగంతో జరుగుతున్నా టన్నెల్ పనులు చేపట్టడమే రైల్‌వికాస్‌నిగమ్‌లిమిటెడ్ సంస్ధకు తలకు మించిన భారంగా మారింది. కాగా చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సీపీఎం (చీఫ్‌ప్రాజెక్టు మేనేజరు) ప్రదీప్‌గౌర్ 0-17 కిలోమీటర్ల మధ్య పూర్తికావస్తున్న ఎర్త్‌వర్క్ పనులను ఇటీవల పరిశీలించారు. టన్నెల్ నిర్మాణం పూర్తిచేసేందుకు మళ్లీ టెండర్లను పిలువనున్నట్లు చెప్పారు. ఈ పనులు దక్కించుకునే సంస్ధ అయినా సకాలంలో టన్నెల్ పూర్తి చేయగలితే రెండేళ్లలో కృష్ణపట్నం రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం పూర్తరుుతే బొగ్గు, ఇనుపరారుు ఎగుమతి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాజధానికి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం మార్గాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.