అత్త మామలను చంపి... కానిస్టేబుల్ ఆత్మహత్య
ఓ కానిస్టేబులు పిల్లనిచ్చిన మామ, అత్త, బావమరిదితోపాటు మరో ఇద్దరు బంధువులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన ఒడిశా కోరాపూట్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. తుపాకుల కాల్పులలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారని ఐజీ యశ్వంత్ వెల్లడించారు.
కుటుంబ తగాదాల కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ నరేంద్ర కందప్పన్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని ఐజీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.