OFBJP
-
న్యూజెర్సీలో తెలంగాణా విమోచన దినోత్సవం
న్యూజెర్సీ : ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని నార్త్ బృన్స్విక్‌లోని మిర్చీ రెస్టారెంట్లో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా విచ్చేసిన ప్రవాసులు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని ఆఫ్-బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆఫ్-బీజేపీ జాతీయ యువ సహ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల కార్యక్రమానికి విచ్చేసిన వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. కే.లక్ష్మణ్ ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ అమెరికాలో ప్రవాస తెలంగాణ వారు ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని అభినందించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి శరత్ వేముల మాట్లాడుతూ.. 'నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం. సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం అయింది వాస్తవం. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం? సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు? సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు. స్వరాష్ట్రంలోనూ ఇదే విధానమా? హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా? రజాకార్లు, దేశ్ ముఖ్లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా?' అని ప్రశ్నించారు. రజాకార్లకు(ఖాసీం రజ్వి) వారసులైన ఓవైసీ కుటుంబాన్ని తలకెత్తుకుని తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్న కేసీఆర్ తీరుపై బీజేపీ నేత ఏనుగు లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ మరో 13 నెలల పాటు చీకటి రోజులు గడిపిందని రఘువీర్ రెడ్డి అన్నారు. విజయ్ కుందూరు మాట్లాడుతూ.. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణకు అసలు చరిత్రే లేకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ కీర్తిని, తెలంగాణ చరిత్రని ముందు తరాలకి తెలియచేస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాంత్ తుమ్మల. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు అని మండిపడ్డారు. లింగాల సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తామన్నారు. డా.మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు, గోపి సముద్రాల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా, వీరుల త్యాగాలను మజ్లిస్ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 12వేల మందికి పైగా బలిదానాలు చేసుకుంటే.. 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమన్నారు. ఈరోజు నిజంగా అరుదైన రోజు.. హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయని వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదీ జన్మదిన సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి, జన్మ దిన శుభ కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆఎఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఆఫ్ బీజేపీ జాతీయ యువ సహా కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీకాంత్ తుమ్మల, డా.మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు, రఘువీర్ రెడ్డి, గోపి సముద్రాల, విజయ్ కుందూరు, లింగాల సంతోష్, వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్, శరత్ వేముల, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ఏనుగు లక్ష్మణ్ రెడ్డి, అశ్విన్, ప్రదీప్ కట్ట, రామ్మోహన్ ఎల్లంపల్లి, ఇంకా గుజరాత్ నుండి పలువురు పాల్గొన్నారు. -
బీజేపీ విజయం.. న్యూజెర్సీలో సంబరాలు
న్యూజెర్సీ : సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి గెలుపొందడంపై ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో న్యూజెర్సీలో ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్‌లో జరిగిన ఈ వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా వచ్చారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లాలని అందరూ కోరుకున్నారు. గత 5సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అరవై ఏళ్లలో ఎప్పుడు జరగలేదని వివరించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో అభివృద్ధి ఎజెండాగా అవినీతి రహిత పాలనను అందించాలని కోరారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంట్ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ కార్యకర్తలు 1.4 మిలియన్ల ఫోన్ కాల్స్‌ను భారతీయులకు చేసి బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశామని తెలిపారు. అలా చేసిన 108 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 96 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నోకార్యక్రమాలు చేశామన్నారు. అమెరికాలోని 30 నగరాల్లో కారు ర్యాలీలు, చౌకీదార్ మార్చ్‌లు, ఛాయ్ పే చర్చ, కాల్ ఏ థన్ (ఫోన్ కాల్స్ క్యాంపెయినింగ్) సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలవడం, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఈ సంబరాలలో తెలుగు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో కూడా బీజేపీ బలోపేతం అవ్వడానికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పని చేస్తుందని విలాస్ రెడ్డి జంబుల అన్నారు. ఈ సంబరాల్లో జయేష్ పటేల్, షహ, రాయల్ ఆల్బర్ట్ జసాని, డా. సుధీర్ పారిఖ్, ప్రమోద్ భగత్, సునీత రెడ్డి, రఘువీర్ రెడ్డి, గుంజన్ మిశ్ర, హరి సేతు, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ రెడ్డి, విజయ్ కుందూరు, శరత్ వేముల, ఆత్మ సింగ్, గణేష్, ఫణి భూషణ్, రవి బుధనీరు, అరవింద్ పటేల్, వంశీ యంజాల, విజేందర్, మధుకర్, దేవ్‌తో పాటూ వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఓఎఫ్ ఆధ్వర్యంలో ఉజ్వల్ భారత్
వాషింగ్టన్ డీసీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ(ఓఎఫ్) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్ డీసీలో ఉజ్వల్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి. ఎల్ నరసింహ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, వాటి ఫలితాలను జి.వి. ఎల్ నరసింహ రావు వివరించారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు అందరు కలిసి మెలిసి ఉంటూ, దేశ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. భారత దేశ ఏకీకరణ, సగటు భారతీయునికి సమాజంలో గౌరవం, దేశ భద్రతా, సమతుల్య ఆర్థిక అభివృద్ధి, మోదీ ప్రభుత్వ అభివృద్ధి విధానానికి మూలా స్తంభాలుగా రామ్ మాధవ్ పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకులు తీసుకొన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఓఎఫ్ బీజేపీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఏనుగుల అన్నారు. అలాంటి శక్తివంతమైన నాయకుల్లో మోదీ ఒకరు అని కొనియాడారు. ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్, ఓఎఫ్ బీజెపీ వాషింగ్టన్ డీసీ కోఆర్డినేటర్ లక్ష్మి నారాయణ, ఓఎఫ్ బీజేపీ ఒహియో కోఆర్డినేటర్ శ్రీనివాస్ కొంపల్లి, ఓఎఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ సమీర్ చంద్ర, ఓఎఫ్ బీజేపీ జాతీయ యువ సహా-కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, దిగంబర్ ఇస్లాంపురే, ఇతర ఓఎఫ్ బీజేపీ నేతలు, వంశీ యంజాలతో పాటూ అనేక సంఘాలనేతలు, అనేక మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన వివిధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. -
కర్ణాటక గెలుపుపై ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంబరాలు
ఎడిసన్, న్యూ జెర్సీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంతో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ(ఆఫ్ బీజేపీ) ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూ జెర్సీలో విజయ్ దివస్ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అధికారప్రతినిధి జి.వి. ఎల్ నరసింహ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత దేశంలోని 29 రాష్ట్రాల్లో 23 బీజేపీ లేదా బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తోంది అని ఆఫ్ బీజేపీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల తెలిపారు. అదేవిధంగా, జనాభా పరంగా చుస్తే, దాదాపు 75 శాతానికి అధికంగా బీజేపీ లేదా బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తోంది అని చెప్పారు. అలాగే, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక పాత్రను గురించి వివరించారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ చేప్పట్టిన టెలీఫోనిక్, సోషల్ మీడియా ప్రచారాల వ్యూహాలను, వాటి ఫలితాలను అఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ దిగంబర్ ఇస్లాంపురే వివరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వారి పార్టీలకు కంటిఫై నిద్ర లేకుండా చేశాయని జి.వి. ఎల్ నరసింహ రావు అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయన్నారు. తెలుగు రాష్ట్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాజకీయ పార్టీలుగా కాకుండా వారి కుటుంబ పార్టీల వ్యాపారంగా మారిపోయిందని మండిపడ్డారు. కేవలం ఆయా కుటుంబాలకు, వారి కులాలకు, వారి సంబంధీకులకు సేవ చేసే వ్యవస్థలుగా తయారు అయ్యాయి అని చెప్పారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు తమ తమ వ్యవహార శైలిని మార్చుకోకపొతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టుతుంది అని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపితం అవడానికి ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ పని చేస్తోందని అఫ్ బీజేపీ జాతీయ యువ సహ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల పేర్కొన్నారు. అనంతరం ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు జయేష్ పటేల్, టీవీ ఆసియ వ్యవస్థాపకులు హెచ్ఆర్ షహ, సీనియర్ ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేత ప్రమోద్ భగత్‌లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రాముఖ్యతను తెలిపారు. ఈ సంబరాల్లో ఆఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఆఫ్ బీజేపీ జాతీయ మండలి సభ్యులు కల్పన శుక్ల, జయేష్ పటేల్, బాల గురు, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ అరవింద్ పటేల్, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ గుంజన్ మిశ్ర, ఆఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ దిగంబర్ ఇస్లాంపురే, ఆఫ్ బీజేపీ జాతీయ యువ సహా-కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, దీప్ భట్, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ యూత్ కన్వీనర్ పార్తీబన్, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ యూత్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర ఆఫ్ బీజేపీ నేతలు, ఆత్మ సింగ్, వంశీ యంజాలతో పాటూ అనేక సంఘాల నేతలు, పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.