వాట్సన్ ను దూషించినందుకు జడేజాకు జరిమానా!
ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జరిమానా విధించారు. బెంగళూరులో జరిగిన ఏడవ వన్డే మ్యాచ్ లో వాట్సన్ అవుటయ్యాక అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినట్టు మ్యాచ్ రెఫరీ అండి పైక్రాఫ్ట్ తెలిపారు.
మ్యాచ్ 29 వ ఓవర్ లో జడేజా ఈ ఘటనకు పాల్పడ్డారని.. ఐసీసీ ప్రవర్తనా నియమావళి 2.1.4 ను ఉల్లంఘించినట్టు మ్యాచ్ రెఫరీ ధృవీకరించారు. ఆట ఎలాంటి పరిస్థితుల్తో ఉన్నా.. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను గౌరవించాల్సి ఉండగా.. జడేజా రియాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పైక్రాఫ్ట్ అన్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన జడేజాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.