Ohio State University
-
భూసార నిపుణుడు డా. లాల్‌కు ‘జపాన్ ప్రైజ్’
దుక్కి చెయ్యకుండా పంట విత్తటం, వాతావరణంలోని ఉద్గారాలను భూమి పీల్చుకునేలా సాగు పద్ధతులను రూపొందించడంలో విశేష కృషి చేసిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో భారతీయ సంతతికి చెందిన భూసార శాస్త్రవేత్త డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైౖజ్ –2019ను గెల్చుకున్నారు. పంజాబ్‌లో జన్మించిన డాక్టర్ లాల్ ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భూసార శాస్త్రవేత్తగా సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. డా. లాల్‌కు జపాన్ ప్రైజ్ కింద 4.5 లక్షల డాలర్ల నగదు పురస్కారాన్ని జపాన్ రాజు అకిహిటో, ప్రధాని షింజో అబెల నుంచి ఏప్రిల్ 8న ప్రదానం చేస్తారు. ఇంతకుముందు గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్‌ను, వరల్డ్ అగ్రికల్చర్ ప్రైజ్‌లను కూడా ఆయన అందుకోవడం విశేషం. నగదు బహుమతులను కర్బన ఉద్గారాలపై పరిశోధనలకే వెచ్చిస్తానని ఈ సందర్భంగా డా. లాల్ ప్రకటించి తన ఉదాత్తతను చాటుకున్నారు. -
గాయాలు మానేందుకు సరికొత్త చికిత్స
న్యూయార్క్: పలు కారణాల వల్ల మానవ శరీరంపై ఏర్పడే గాయాలను అతి త్వరగా నయం చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. సాంకేతిక పరిభాషలో టిష్యూ నానోట్రాన్స్‌ఫెక్షన్ (టీఎన్టీ)గా వ్యవహరించే ఈ చికిత్సా విధానాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. గాయాల కారణంగా దెబ్బతిన్న జన్యు కణాలను రీప్రోగ్రామింగ్ చేయడమే ఈ కొత్త చికిత్సా విధానం. గాయపడిన చోట చర్మానికి ఎలక్ట్రికల్ స్టిములేషన్ కలిగిస్తారు. అనంతరం చొక్కా బటన్ సైజులో ఉండే ఓ చిప్‌ను గాయమైన చోటుకు పంపిస్తారు. అది వెంటనే డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలో ముందుగా చేసిన ప్రోగ్రామ్ ద్వారా దెబ్బతిన్న కణాలను రీప్రోగ్రామ్ చేస్తుంది. సజీవ కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా డాక్టర్ల ఆదేశాల మేరకు ఈ చిప్‌లో ముందస్తు ప్రోగ్రామ్ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో చనిపోయిన జన్యు కణాలను ప్రాణం తెప్పించేందుకు, దెబ్బతిన్న అవయవాలను తిరిగి పెరిగేలా చేయడం కోసం ఈ సరికొత్త చికిత్సా విధానాన్ని అమలు చేసి విజయం సాధించామని పరిశోధకులు తెలిపారు. మానవులపై ఈ ప్రయోగం చేయడానికి మరో ఏడాది కాలం పట్టవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్, స్ట్రోక్‌తో బాధ పడుతున్నవారికి ఈ చికిత్సా విధానం మంచిది కాకపోవచ్చని, ఆ విషయన్ని కూడా తేల్చుకొని అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నట్లు వారు వివరించారు. -
కణం..వశీకరణం
నానో చిప్‌తో వైద్యం కొత్త పుంతలు! ప్రసాద్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడు కణాలు వేగంగా నాశనమవుతున్నాయి. ఇంతలో డాక్టర్లు నల్లటి చిప్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని తలపై పెట్టి.. చిన్న కరెంటు షాక్ ఇచ్చారు! వారం గడిచింది. ప్రసాద్ కోలుకుంటున్నాడు. మెదడు కణాలూ మళ్లీ చైతన్యవంతమవుతున్నాయి! ఇదేదో సినిమా కథ కానేకాదు. ఇంకొన్నేళ్లలో వాస్తవ రూపం దాల్చనున్న వినూత్న టెక్నాలజీ కథ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఒహాయో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భవిష్యత్తులో ఒక్క గుండెపోటుకే కాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకూ మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మూలకణాల గురించి తెలుసుకోవాలి. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సత్తా వీటి సొంతం. పిండ మూలకణాలు, అడల్ట్ స్టెమ్‌సెల్స్ అని ఇవి 2 రకాలు. పిండమూల కణాలు శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగలవు. అడల్ట్ స్టెమ్‌సెల్స్‌కు పరిమిత స్థాయిలోనే ఈ సామర్థ్యముంటుంది. గుండె కండరంలో ఉండే అడల్ట్ స్టెమ్‌సెల్స్ ఆ అవయవం తాలూకూ కణాలుగానే మారగలవు. కొన్ని ప్రక్రియల ద్వారా అడల్ట్ స్టెమ్‌సెల్స్‌ను కూడా పిండమూల కణాలుగా మార్చేందుకు అవకాశముంది. ఇప్పటివరకూ ఇది పరిశోధనశాలకే పరిమితం కాగా.. ఒహాయో శాస్త్రవేత్తలు శరీరంలో ఉండే సాధారణ కణాలనూ పిండమూలకణాలుగా మారిపోయేలా చేయగలిగారు. ఇందుకోసం నానోటెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన ఒక చిప్‌లాంటి పరికరాన్ని వాడారు. టిష్యూ నానో ట్రాన్స్‌ఫెక్షన్ (టీఎన్టీ) అని పిలుస్తున్న ఈ వినూత్న టెక్నాలజీని అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదే మానవులపై ప్రయోగించడం మొదలుపెట్టవచ్చు. ఎలుకలు, పందుల్లో ప్రయోగాలు.. ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలు, పందులపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. నానో చిప్ సాయంతో ఎలుకల చర్మకణాలను నాడీ కణాలుగా మార్చేసి రక్తనాళాలు బాగా దెబ్బతిన్న ఎలుక కాలిని సరిచేశారు. నానో చిప్ సాయంతో చర్మకణాలనే నాడీ కణాలుగా మార్చేసి మెదడు దెబ్బతిన్న ఎలుకల్లోకి జొప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. ‘‘ఈ టెక్నాలజీ 98 శాతం కచ్చితంగా పనిచేస్తుంది. నొప్పి కూడా తెలియనంత సూక్ష్మస్థాయిలో కరెంటు షాక్ ఇవ్వడం ద్వారా ఒక సెకను కాలంలో ఒకరకమైన కణాలను మనకు అవసరమైన కణంగా మార్చేయగలిగాము. పైగా ఇదంతా శరీరం లోపలే జరుగుతుండటం వల్ల కొత్త కణాలను రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరించేందుకూ అవకాశం ఉండదు’’ అని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి వైద్యుడు డాక్టర్ చందన్ సేన్ అన్నారు. ఏముంటాయి... ఈ టెక్నాలజీలో రెండు ప్రధాన భాగాలున్నాయి. మొదటిది నానో చిప్. దీంట్లో కణాలను మూలకణాలుగా మార్చేందుకు అవసరమైన సామగ్రి (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటివి) ఉంటుంది. ఇక రెండో భాగం మనం తయారు చేయాలనుకుంటున్న కణం (గుండె, నాడీ, రక్తనాళం వంటివి) తాలూకూ సమాచారం. నానో చిప్‌కు కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు అందులోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు నేరుగా కణాలను చేరుకుని ఉన్న సమాచారానికి తగ్గట్టుగా కావాల్సిన కణాలు తయారవుతాయన్నమాట. అడల్ట్ స్టెమ్‌సెల్స్‌ను సేకరించి పరిశోధనశాలలో పిండ మూలకణాలుగా మార్చడం, ఆ తర్వాత దాన్ని అవసరమైన అవయవం వద్ద జొప్పిం చడం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ కొత్త కణాలను తిరస్కరించడం లేదా అవసరమైన మేరకు కొత్తకణాలు అందించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ టీఎన్‌టీతో చెక్ పెట్టవచ్చునని అంచనా. -
విశ్వం నిర్మాణాన్ని తెలిపే నూతన మ్యాప్
వాషింగ్టన్: విశ్వం నిర్మాణానికి సంబంధించిన తొలి మ్యాప్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మ్యాప్ రూపకల్పనలో విశ్వవ్యాప్తంగా ఉన్న క్వాసార్స్ అనే ప్రకాశవంతమైన నక్షత్రాల్లాంటి నిర్మాణాలను ఖగోళ శాస్త్రవేత్తలు వాడారు. ‘ఈ క్వాసార్స్ అనేవి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల లాంటి నిర్మాణాలు, ఇవి విశ్వమంతటా ఉన్నాయి. పెద్ద పెద్ద కృష్ణబిలాల వల్ల ఈ క్వాసార్స్లో కాంతి ఉద్భవించింది. క్వాసార్స్ అత్యంత కాంతివంతమైనవి కావున విశ్వవ్యాప్తంగా వీటిని మనం చూడవచ్చు. ప్రస్తుతం తాము ఈ క్వాసార్స్ సాయంతోనే విశ్వానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించగలిగాము’అని అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆష్టే రాస్ వెల్లడించారు. -
అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికా : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలంబస్‌లోని ఒహియో స్టేట్ యూనివర్శిటీలో సోమవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్శిటీ ఇంజినీరింగ్ భవనంలోకి చొరబడ్డ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీంతో యూనివర్శిటీ ప్రధాన ద్వారాలు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీలో ఉన్న మిగతా విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానిక పోలీసుల సహకారంతో యూనివర్శిటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. కాగా.. దాడికి పాల్పడిన వ్యక్తి కాల్పుల్లో మృతి చెందాడని యూనివర్సిటీ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. -
తల్లిదండ్రుల ఒత్తిడితో సంతానానికి ముప్పు
న్యూయార్క్: గర్భదశలో మహిళ ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై ఉంటుందట. అలాంటి మహిళలకు జన్మించే వాళ్లు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికా నగరం ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. -
తల్లి ఒత్తిడితో పుట్టబోయే పిల్లలకు ముప్పు!
న్యూయార్క్: గర్భంతో ఉన్న మహిళ ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందట. తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. అందుకే గర్బంతో ఉన్న మహిళలను ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఆ సమయంలో అనవసర విషయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారని ఓహియో వర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. -
ఎక్కువ సమయం పనిచేస్తున్నారా.. జాగ్రత్త!
న్యూయార్క్: ప్రతిరోజు గంటల తరబడి పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త! మీ ఆరోగ్యం ప్రమాదపు అంచునా ఉంది. మగవారితో పోలిస్తే ఎక్కువ సమయం పనిచేసే మహిళలకే ప్రమాదం పొంచి ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమయ్యే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ మగవారితోపాటు సమానంగా అన్ని విషయాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబ పోషణ భారం కావడంతో మగవారితో పాటు మహిళలూ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. ఇటు ఇంటి ఇల్లాలుగానూ, అటు ఉద్యోగినిగానూ అన్ని విషయాల్లో సమయానికి మించి ఎక్కువ సమయం పనిచేయడం మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. వారానికి 60 గంటలకు పైగా పనిచేసే మహిళల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మహిళ్లల్లో ఎక్కువగా డయాబెటీస్, కేన్సర్, గుండె సంబంధిత వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు అల్లార్డ్ డెంబె పేర్కొన్నారు. 32 సంవత్సరాల వయస్సు ఉన్న 7,500 మంది మహిళలను సంప్రదించి వారి జీవినశైలిపై పరిశోధించారు. ఈ పరిశోధనలో ఎక్కువ సమయం మహిళలు ఇంటా బయటా ఉద్యోగ నిర్వహణలోనూ, కుటుంబ బాధ్యతలు, పని కారణంగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారని తెలిపింది. పని ఒత్తిడి కారణంగానే మహిళల్లో అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని నిపుణుడు అల్లార్డ్ డెంబె పేర్కొన్నారు. సాధారణంగా ఎక్కువగా పనిచేసే మహిళల్లో గంటల సమయం 40 నుంచి 50కు మించినట్లయితే వారి ఆరోగ్యం క్రమక్రమంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. మూడు దశాబ్దాల్లో 60 గంటలకు మించి మహిళలు పనిచేసినట్టయితే వారిలో డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ప్రబలడానికి మూడు రెట్లుకు పైగా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో 20 నుంచి 30, 40 వయస్సు ఉన్న వారికి ఆరంభంలో సమస్యల ప్రభావం అంతగా కనిపించదని.. వారి జీవితంలో క్రమక్రమంగా ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధనలో వెల్లడైంది. -
నచ్చకపోతే ఇంతే మరి!
తిక్క లెక్క నిజంగా ఇది తిక్క లెక్కే. ఈ లెక్క వేసిందీ, తీసింది కూడా ఎప్పటిలా పాశ్చాత్యులే. అందులోనూ అమెరికా వాళ్లే. చిరునవ్వు ప్రపంచమంతటా ఒకేలా ఉంటుంది కదా, సుతిమెత్తని చిరచిర కూడా అలాగే ఉంటుందా అనే గొప్ప డౌటొకటి వచ్చి ఓహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఓ 150 మంది కాలేజీ అమ్మాయిల ముఖ కవళికల్ని రికార్డు చేసింది. ఆ అమ్మాయిల్లో అమెరికా వాళ్లున్నారు. బ్రిటన్, స్పెయిన్, చైనా వగైరా దేశాల వాళ్లూ ఉన్నారు. ఈ పరిశోధకులు ఏం చేశారంటే... ‘అమ్మాయిలూ.. మీకు నచ్చని విషయమేదైనా ఉంటే దాన్ని మాటల్లోనే కాకుండా మీ ముఖంలో కూడా ఎక్స్‌ప్రెస్ అయ్యేలా చెప్పండి ప్లీజ్’ అని అడిగారు. ఆ తర్వాత వాళ్ల ముఖారవిందాల రీడింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత కామన్‌గా ఉన్న వ్యక్తీకరణల్ని బయటికి తీశారు. మూతి ముడవడం, చుబుకం కాస్త పైకి వెళ్లడం, కనుబొమలు ఎడంగా జరగడం, ముక్కు వంకరపోవడం వంటివి అందరిలోనూ ఒకేలా ఉండడం చూసి... నవ్వు నలభై రకాలుగా ఉంటుంది కానీ, చిరాకు నాలుగైదు రకాలుగా మాత్రమే ఉంటుందని తేల్చేశారు. ఇదేం లెక్కోమరి! -
పొడుగరులే ఆరోగ్యవంతులట!
రోజువారీ పనుల్లో పొడుగరులకు తరచు కొన్ని ఇబ్బం దులు తప్పకపోయినా, ఆరోగ్యం విషయంలో మాత్రం పొడగరులే అదృష్టవంతులని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పొట్టి వారితో పోలిస్తే పొడగరులకు గుండెజబ్బులు, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని అమెరికాలోని ఓహయో స్టేట్ వర్సి టీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకులు చేప ట్టిన అధ్యయనంలో పొడగరుల గురించి మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పొట్టి వారి కంటే పొడగరులే కెరీర్లో బాగా రాణించడమే కాకుం డా, ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారని పరిశోధ కులు చెబుతున్నారు. అయితే వీరికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోలేదు. వీరికి స్కిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. -
ఇంద్రుడు చంద్రుడు అనకండి
అవతలివాళ్లు ఎంత మేధావులు, మంచివారూ అయినా, వారిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొంతమంది. అయితే అది నిజానికి వారి తప్పు కాదు. వారి తలిదండ్రుల పెంపక లోపం. కొన్ని అధ్యయనాల ప్రకారం అతి గారాబంతో, ప్రత్యేక శ్రద్ధతో పెరిగే పిల్లలు, వారు పెద్దయ్యాక స్వయం ప్రేమికులుగా... అంటే ఎంతసేపటికీ తమను తాము గొప్పవాళ్లం అనుకోవడం తప్ప ఇతరులను పట్టించుకోరని రుజువైంది. పిల్లల్లో స్వయంప్రేమ లేదా స్వీయానురక్తికి దారి తీసే కారణాలపై అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో జరిగిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. తలిదండ్రులు తమ పిల్లలను సముదాయించడం కోసమో లేదా నిజంగానే వారిపట్ల తమకుండే మితిమీరిన ప్రేమ, గారాబం వల్లనో ‘ఫలానా వారికన్నా నువ్వు చాలా గొప్పవాడివి లేదా ఫలానా వారికీ, నీకూ అసలు పోలికే లేదు. తనకన్నా నువ్వు చాలా తెలివైనదానివి, నీ జ్ఞాపకశక్తి చాలా గొప్పది, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చాలా అందగత్తెవి...’’ అంటూ చెప్పే మాటలు పెద్దయ్యాక వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయట. ‘నువ్వు మా బంగారానివి, దేవుడు ఇచ్చిన అపూర్వమైన కానుక నువ్వు’ అంటూ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలతో తరచు చెబుతుంటారు. అయితే అటువంటి మాటలు వారి మనసులపై గాఢమైన ముద్రవేస్తాయి. నిజంగానే తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్లం కాబోలు’ అనుకుని, అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు వారు. అందులో భాగంగా తామే అందరికన్నా గొప్పవాళ్లమని, తెలివితేటల్లో, అందచందాల్లో, ప్రతిభలో తమను మించిన వారే లేరని విర్రవీగుతారు. ఎదుటివారిని పూచికపుల్లల్లా తీసిపారేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే చిన్నారులను నువ్వు ఇంద్రుడు, చంద్రుడు అని పొగడకూడదు. దాని బదులు వారిలోని శక్తిసామర్థ్యాలను, మంచితనాన్ని వెలికి తీయాలి. వారిలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాన్నివ్వాలి’’ అంటారు సహ అధ్యయనవేత్త, కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ బుష్మాన్. అంటే పిల్లల్ని అతి ప్రేమగా, ప్రత్యేకంగా పెంచే తలిదండ్రులు ఇకపై ఆ పద్ధతిని మార్చుకోవాలేమో!