అమెరికాలో కాల్పుల కలకలం | shooting in Ohio State University Students injured | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం

Published Mon, Nov 28 2016 9:40 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

అమెరికాలో కాల్పుల కలకలం - Sakshi

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికా : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలంబస్లోని ఒహియో స్టేట్ యూనివర్శిటీలో సోమవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్శిటీ ఇంజినీరింగ్ భవనంలోకి చొరబడ్డ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.

దీంతో యూనివర్శిటీ ప్రధాన ద్వారాలు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీలో ఉన్న మిగతా విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానిక పోలీసుల సహకారంతో యూనివర్శిటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. కాగా.. దాడికి పాల్పడిన వ్యక్తి కాల్పుల్లో మృతి చెందాడని యూనివర్సిటీ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement