Oil Mafia
-
భార్యతో కలసి హష్ ఆయిల్ దందా
సాక్షి, హైదరాబాద్: నాచారం కేంద్రంగా హష్ ఆయిల్ దందా చేస్తున్న మదన్ మానేకర్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. దందాలో పాలుపంచుకుంటున్న ఇతడి భార్య కొండపనేని మాన్సీ గతవారమే పోలీసులకు చిక్కింది. మదన్‌తోపాటు అతడి సహాయకుడు ఎన్.రాజు, మరో తొమ్మిది మంది కస్టమర్లను హెచ్–న్యూ బృందం బుధవారం అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది వినియోగదారుల కోసం గాలిస్తున్నామని డీసీపీ చక్రవర్తి గుమ్మి చెప్పారు. డీసీపీ వెల్లడించిన వివరాలు.. ► కొన్నేళ్లుగా మదన్ లైటింగ్ బోర్డ్ వర్కర్‌గా, మాన్సీ ఓ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరిద్దరూ హైదరాబాద్‌లోని చర్లపల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారి ఎన్.రాజుతో జట్టుకట్టి పలువురికి గంజాయి, హష్ ఆయిల్ విక్రయించేవారు. ► విశాఖ జిల్లాకు చెందిన బుజ్జి బాబు నుంచి కిలో రూ.60 వేలు చొప్పున మదన్, రాజు హష్ ఆయిల్ ఖరీదు చేసి సిటీకి తీసుకు వచ్చేవారు. ఐదు గ్రాముల చొప్పున ప్లాస్టిక్ కంటైనర్లలో నింపి ఒక్కోదాన్ని రూ.3 వేలకు అమ్మేవారు. ► హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి, నాచారం, కేపీహెచ్‌బీ, మాదాపూర్, మేడ్చల్, పంజగుట్ట, బంజారాహిల్స్, బోడుప్పల్లో వీరికి రెగ్యులర్ కస్టమర్లున్నారు. ఈ దంపతులు మరో ఇద్దరితో కలసి బోయిన్పల్లి ప్రాంతంలో మార్చి 12న గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీ సులు దాడి చేశారు. మాన్సీ, మదన్ పారిపోగా, ఇద్దరు యువకులతోపాటు 1.2 కిలోల గంజా యి దొరికింది. ఆ తర్వాత వీళ్లు గంజాయి విక్ర యించడం ఆపేసి హష్ ఆయిల్ దందా మొదలెట్టారు. ► ఈ క్రమంలో హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేశ్‌రెడ్డి, ఎస్సై సి.వెంకటరాములు గత గురువారం కొంపల్లి వద్ద మాన్సీని పట్టుకున్నారు. అప్పటి నుంచి మదన్, రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ► తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాణా పరిధిలోని ఎర్రకుంటలో మదన్, రాజు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 24 కంటైనర్లలోని 120 గ్రాములు హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ► ఈ నిందితులను విచారించగా పలువురు కస్టమర్ల వివరాలు బహిర్గతమయ్యాయి. 19 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులైన మొత్తం 18 మందిలో 9 మందిని అరెస్టు చేసి మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. -
ఆయిల్ మాఫియా కేసు కొత్త మలుపు
ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల నుంచి చమురు కాజేస్తున్న ఆయిల్ మాఫియా కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటి దాకా ఈ చమురు జిడ్డు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు, ఓఎన్జీసీలోనే ఇంటి దొంగలు, రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమాని, ఆయన కుటుంబీకులకే అంటుకుంది. తాజాగా ఆ జిడ్డు పోలీసులకు అంటుకుంటోంది. ఈ కేసుల్లో పోలీసులకూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలతో కోనసీమ పోలీసు శాఖలోనే కాదు ఈ సీమ ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది. తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: రెండు నెలల కిందట అల్లవ రం మండలం ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి బైపాస్ పైపుల ద్వారా సమీపంలోని జీడిమామిడి తోటలో సిన్టెక్స్ ట్యాంక్‌లో నింపుతుండగా ఆయిల్ చోరీ వెలుగు చూసింది. ఓఎన్జీసీ సెక్యూరిటీ విభాగం నిఘాలో బయటపడ్డ ఈ అక్రమ భాగోతంలో దొరికిన తీగను లాగిన పోలీసులు కేజీ బేసిన్లో ఉన్న ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న పలు ఓఎన్జీసీ బావుల నుంచి ఉప్పలగుప్తం మండలం ఎస్.యానంలోని ఆన్ లోడింగ్ పాయింట్‌కు వస్తున్న చమురు ట్యాంకర్ల ద్వారా కూడా భారీ స్థాయిలో చమురు చోరీ అవుతున్నట్లు గుర్తించారు. 2014 నుంచి దాదాపు రూ.200 కోట్ల విలువైన చమురు చోరీకి గురై ఉంటుందని అనధికార అంచనా కూడా వేశారు. ఈ కేసుల్లో పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇదంతా పాత ఎపిసోడ్. వెలుగులోకి ముడుపుల ఆరోపణలు తాజాగా ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమలాపురం నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు అందినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో మొత్తం రూ.30 లక్షల డీల్ జరిగిందని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు ఆ ముడుపులపై కొన్ని పత్రికల్లో అమరావతి నుంచి కథనాలు రావడంతో కోనసీమలో ఈ ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఆరోపణలతో అమలాపురం డివిజన్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో నిందితుడైన దాదాపు 70 వరకూ చమురు ట్యాంకర్లు ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి తనను, తన కుటుంబీకులను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు రూ.30 లక్షలు ఆఫర్ చేశాడని... దానిని పోలీసు అధికారులు తిరస్కరించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అలాగే ఆయిల్ మాఫియా బాస్‌ల నుంచి స్థాయిని బట్టి ఒక్కో పోలీసు అధికారికి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.2 లక్షల వంతున నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలపై అమలాపురం డివిజన్ పోలీసులు చర్చించుకుంటున్నారు. అయితే అమలాపురం పోలీసు అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూనే ఈ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారికి డిపార్ట్మెంట్లోనే అంతర్గతం ఉన్న శత్రువులైన అధికారులు లీకులు ఇచ్చి ముడుపుల ప్రచారం చేయిస్తున్నారని వివరణ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆయిల్ మాఫియాపై ఓఎన్జీసీ అధికారులే సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు... ఆ సంస్థ త్వరలోనే దర్యాప్తు ప్రారంభిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇది వాస్తవమే అయితే ఆయిల్ మాఫియా కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఎట్టకేలకు ఫిర్యాదు చేసిన ఓఎన్జీసీ అధికారులు ఆయిల్ చోరీ కేసు దర్యాప్తుకి ఓఎన్జీసీ అధికారులు తమకు ఆది నుంచి సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న చమురు చోరీలపై తమకు ఫిర్యాదు చేస్తే ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వారం రోజుల కిందట ఆ సంస్థ అధికారులు ఆయిల్ చోరీలపై ఫిర్యాదు చేయడం కొత్త పరిణామం. చమురు బావుల వద్ద లోడింగ్ పాయింట్లు, ఎస్.యానాం అన్లోడింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, నిఘాతో ఆ సంస్థ అధికారులు విధుల్లో ఉంటారు. ట్యాంకర్ల నుంచి వచ్చిన చమురు ఎంత పరిమాణంలో వచ్చింది... అంతే పరిమాణంలో దిగుమతి అవుతుందా లేదా...? అనే ఖచ్చితమైన గణాంకాలు ఆ అధికారులకు అధికారిక నమోదుతో సమాచారం ఉంటుంది. అయినా చోరీలు సాగుతున్నాయంటే పరోక్షంగా ఇంటి దొంగల వత్తాసు లేకుండా ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతాయన్నది ప్రశ్నార్థకమే. ఆ దిశగా ఓఎన్జీసీ నుంచి కనీస ఆరా గాని... చర్యలు లేవంటే ఇంటి దొంగలకు ఎంతటి అండదండలు ఉన్నాయో అంచనా వేయవచ్చు. రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమానికి చెందిన కొన్ని ట్యాంకర్లలో అక్రమ అదనపు ట్యాంకు, ట్యాంకర్లలో ఆయిల్ చాంబర్లకు వేసే ఓఎన్జీసీ తాళం కప్పలకు డూప్లికేట్ తాళాలు వంటి మోసాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. -
పోతోంది ‘దేశం’ పరువు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నేతల మధ్య విభేదాలు... పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ జరుగుతున్న వరుస పరిణామాలతో టీడీపీ వర్గాలు అంతర్మధనంలో పడ్డాయి. ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ఎప్పటికప్పుడు పార్టీ రచ్చకెక్కడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు నెలల కిందట ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం... ఇటీవల ఆయిల్ మాఫియా నడుపుతున్న టీడీపీ నేతల బాగోతం బయటపడటం... తాజాగా ప్రభుత్వ రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు ధ్వంసం చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయం నెలకొంది. విభేదాలెన్నెన్నో.... కాకినాడ అంతా తనదిగా భావిస్తూ, ఏం చేసినా అడిగే వారు లేరనే ధోరణితో ఎమ్మెల్యే కొండబాబు వ్యవహరించడం కొందరు టీడీపీ నేతలకు నచ్చడం లేదు. ఇక్కడ ఎవరూ వేలు పెట్టకూడదని, మంత్రైనా సరే అనే ధోరణిలో నియంతృత్వ పోకడకు పోతున్నారంటూ సహ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. దీంతో కొండబాబు లక్ష్యంగా పార్టీలోని ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఆయన కుటుంబీకులు, అనుచరులచే దందా సాగిస్తున్నారని, ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ సూపర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో గత కొంతకాలంగా వైరం కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పిల్లి సత్తిబాబు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగారు. దందాలన్నీ వారే చేస్తున్నారని, అక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల సమావేశంలో బహిర్గతమయ్యారు. మరో సందర్భంలో మంత్రి చినరాజప్పపై కూడా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించినట్టు పార్టీలో చర్చ జరిగింది. మంత్రి సోదరుడే ఎక్కువగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఆరోపణలకు దిగినట్టు విస్తృత ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా పసిగట్టి కొండబాబు హవాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేస్తున్నారు. ఆ మధ్య కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయునికి దక్కకుండా అధిష్టానం స్థాయిలో అంతర్గత ప్రత్యర్థులు చక్రం తిప్పారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా కొండబాబు వర్గానికి దక్కకుండా హైజాక్ చేశారు. చివరికీ కో ఆప్షన్ పదవుల్లో కూడా కొండబాబుకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఆయిల్ మాఫియాలో కీలకంగా వ్యవహరించిన కొండబాబు అనుచరుడు గ్రంధి బాబ్జీ విషయంలోనూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. తాజాగా రోడ్డు విషయంలో... మహలక్ష్మీనగర్‌లో రోడ్డు వేయకముందే ఆ స్థలం తమదని, ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయవద్దని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దృష్టికి ఎమ్మెల్యే కొండబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ రూరల్ ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా అనుకున్నట్టుగానే అక్కడ చకచకా రోడ్డు వేసేశారు. తాను చెప్పినట్టుగా వినకుండా ఏకపక్షాన రోడ్డు వేశారన్న అక్కసుతో ఎమ్మెల్యే కుటుంబీకులు ధ్వంస రచనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యే పిల్లి దంపతులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మద్దతుగా నిలుస్తున్న మంత్రి కూడా అంతర్గతంగా పావులు కదిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిణామాలను వివరించినట్టు తెలిసింది. « కలెక్టర్ ఆదేశాలతో ఎమ్మెల్యే కుటుంబీకులపై ఫిర్యాదు చేసే విషయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. నష్ట నివారణకు రంగంలోకి అధిష్టానం... కాకినాడలోని మహలక్ష్మీనగర్‌లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు «కుటుంబీకులు ధ్వంసం చేసిన ఘటనతో టీడీపీ పరువు మంటగలిసిపోయింది. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తమ వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకుని అధిష్టానం రంగంలోకి దిగింది. నష్ట నివారణకు చర్యలకు ఉపక్రమించింది. విచారణకు ఆదేశాలిస్తే వివాదాన్ని పక్కదారి పట్టించొచ్చన్న ఉద్దేశంతో కలెక్టర్‌కు సీఎం వ్యూహాత్మక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ఆగ్రహం, ఆదేశాలపై లీకులిచ్చి సీరియస్‌ను తగ్గించే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు దగ్గరి నుంచి ఇంతవరకు ఘటనపై అధికార వర్గాలు నోరు మెదపడం లేదు. విచారణాధికారిగా ట్రైనీ కలెక్టర్‌ను నియమించినా ఇంతవరకు విచారణ ముందుకు సాగడం లేదు. కింది స్థాయి అధికారులు కూడా ఆ వివాదం జోలికి పోవడం లేదు. ఎవరో ఒకరి చేత ధ్వంసం చేసిన రోడ్డును వేయించేసి వివాదాన్ని ముగించేసేందుకు యత్నాలు కూడా జరుగుతున్నాయి. -
పరారీలో టీడీపీ నేత కుమారుడు
కాకినాడ సాగర తీరంలో.. ఓడల నుంచి స్టోరేజ్ ట్యాంకులకు వెళ్లే పైపులైన్లకు కన్నాలు వేసి.. కోట్లాది రూపాయల విలువైన చమురును తస్కరిస్తున్న ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు, శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జీ కుమారుడు రాజా మాత్రం పరారీలో ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆయిల్మాఫియాకు అడ్డుకట్ట పడింది. పైపులకు రంధ్రాలు వేసి చాకచక్యంగా టన్నుల కొద్దీ పామాయిల్‌ను దొంగిలించి మార్కెట్‌కు తరలిస్తున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఆయిల్ మాఫియా దందాతో రూ.కోట్లు విలువ చేసే ఆయిల్‌ను దర్జాగా దోచుకుపోయిన మాఫియాకు కళ్లెం పడింది. ఇంత చేసినా.. పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంధి బాబ్జి కుమారుడు గ్రంధి రాజా విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. కాకినాడ : వాకలపూడి కేంద్రంగా ఆయిల్ మాఫియా చెలరేగిపోతోంది. విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చే క్రూడ్ ఆయిల్‌ను సముద్రం నుంచి పైపులైన్లతో స్టోరేజ్ ట్యాంక్‌లకు తరలిస్తారు. ఈ క్రమంలో పైపులైన్లకు రంథ్రాలు పెట్టి ఆయిల్‌ను దొంగిలించే ఓ మాఫియా చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తోంది. ఇందులో కొందరు రాజకీయ పార్టీ నేతల బంధువులు కూడా ఉండడంతో పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేశారన్న అనుమానాలు ఉన్నాయి. దందా సాగేదిలా.. తాజాగా వెలుగుచూసిన ఆయిల్ మాఫియా వ్యవహారంలో నిందితులు వాకలపూడికి సమీపంలోని పైపులైన్ వెళ్లే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌ను అద్దెకు తీసుకున్నారు. బయట తాళాలు వేసి లోపల ఓ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించేశారు. పైపులైన్‌కు రంధ్రం చేసి పైపులతో సంపులకు కనెక్షన్లు ఇచ్చి ఆయిల్‌ను తోడేసేవారు. ఇలా గడచిన ఐదారు నెలల్లో వందకు పైగా ట్యాంకర్ల ఆయిల్‌ను ఇక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు. బయటపడిందిలా.. ఓడల నుంచి వచ్చే ఆయిల్‌కు సంస్థ నుంచి బయటకు పంపే సరుకుకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో సదరు ఎన్సీఎస్ సంస్థ యాజమాన్యానికి సందేహం కలిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూపీ లాగారు. స్టోరేజ్ ట్యాంక్‌కు సమీపంలో ఈ తతంగమంతా జరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఇందులో ఎన్సీఎస్ సంస్థకు చెందిన కొంత మంది సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో టీడీపీ నేతలు పట్టుబడ్డ ఆయిల్ మాఫియా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అధికార టీడీపీ నేతల ప్రమేయం ఉందనే ఆధారాలు దొరకడంతో అవాక్కయ్యారు. చోరీ చేసిన ట్యాంకర్ల కొద్దీ ఆయిల్‌ను జిల్లా టీడీపీ వాణిజ్యవిభాగం అధ్యక్షుడు గ్రంథి బాబ్జికి చెందిన ధనలక్ష్మి ఆయిల్స్‌కు విక్రయించేవారని దర్యాప్తులో తేలింది. ఈ షాపును బాబ్జి తనయుడు రాజా నిర్వహిస్తున్నట్టుగా తేల్చారు. అయితే కేవలం దొంగిలించిన ఆయిల్‌ను రాజా కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నా మాఫియాతో కూడా అతనికి లింకులు ఉన్నాయని సమాచారం. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కుమారుడు కావడం, వీరికి ఎమ్మెల్యేలు, మంత్రులు అండ ఉండడంతో ఇతడిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంధుడైనా సిద్ధహస్తుడు ఆయిల్‌ను చాకచక్యంగా చోరీ చేసే వ్యవహారాల్లో బొంతు నారాయణ సిద్ధహస్తుడని పోలీసుల విచారణలో తేలింది. గతంలో నెల్లూరులో ఇదే తరహా చోరీలు చేస్తూ పట్టుబడడంతో అక్కడ ఇతడిపై దాడిచేసి కళ్లు పీకేశారని స్వయంగా పోలీసులే చెబుతున్నారు. దీంతో అతడిని పోలీసులు కాపాడారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలపై అనుభవం ఉన్న ఇతడిని ఎంచుకుని ఇక్కడ మాఫియా తమ దందాను కొనసాగించింది. ఎవరీ రాజా? ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం ఎస్పీ విశాల్‌గున్ని పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన వారిలో బొంతు నారాయణ, మల్లిపూడి శివరామప్రసాద్, మడికి జక్కియ్య, రాము నాగేంద్రకుమార్, ముమ్మిడి శ్రీనివాసరావు, మరో నిందితుడు ఉన్నారు. వీరి నుంచి రెండుటన్నుల ఆయిల్తోపాటు ధనలక్ష్మి ఆయిల్ కంపెనీకి చెందిన లారీని సీజ్ చేసినట్టు చెప్పారు. అయితే ఆయిల్ కొనుగోలు చేసిన ‘రాజా’ పరారీలో ఉన్నట్టు మాత్రమే పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన లేఖలోగానీ, చెప్పిన సందర్భంలోగానీ ఎక్కడా అతని ఇంటి పేరు, తండ్రిపేరు ప్రస్తావించకుండానే కేవలం ‘రాజా’ అనే పేర్కొనడం గమనార్హం. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక నిందితుడి విషయంలో కేసును పక్కదారి పట్టించే క్రమంలోనే పోలీసులు అలా వ్యవహరించారంటున్నారు. సాధారణంగా నిందితులకు సంబంధించి ఇంటిపేరు, తండ్రిపేరు, ముద్దుపేర్లతో సహా ప్రకటించే పోలీసులు కేవలం ‘రాజా’ అని పేర్కొనడం వెనుక ఒత్తిళ్లే కారణమంటున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని చెబుతున్నా విచారణ సందర్భంలో అతడిని తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే గ్రంథి రాజాకు చెందిన ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కేసు విషయంలో కూడా వాస్తవాలను మరుగుపరచకుండా కేసుతో ప్రమేయం ఉన్న రాజాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆయిల్ మాఫియా కేసులో అరెస్టైన రాము నాగేంద్రతో టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంథి బాబ్జి కుమారుడు గ్రంథి రాజా(నీలి రంగు చొక్కా) -
అల్లుకుపోతున్న ఆయిల్ మాఫియా
- విశాఖ నుంచి శ్రీకాకుళానికి... - ఆధిపత్యం కోసం ఇరు వర్గాల ఘర్షణ - గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స సాక్షి, విశాఖపట్నం: ఆయిల్ మాఫియా మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. రెండు నెలల క్రితం నగరంలో 14మంది మాఫియా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఇక ఈ దందా సాగనివ్వబోమని పోలీసులు ప్రకటించారు. కానీ విశాఖ నగరానికే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు ఆయిల్ మాఫియా కార్యకలాపాలు విస్తరించాయని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తాజా సంఘటన బయటపెట్టింది. రణస్థలం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడి పెసరపాలెంలో వేస్ట్ ఆయిల్ వ్యాపారం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరిలో విశాఖ నుంచి వెళ్లిన వారు 11 మంది కాగా అక్కడ వ్యాపారం చేస్తున్నవారు మరో ముగ్గురు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఓ ముఠా నగరంలో ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతోంది. తర్వాత వారిలో వారికి మనస్పర్ధలు రావడంతో ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. నగరంలోని పోర్టు, రైళ్లు, లారీల నుంచి ఆయిల్ దొంగిలిస్తున్నారు. భూ మాఫియా, డ్రగ్స్ మాఫియా కంటే దారుణంగా ఇది విస్తరించింది. తమ దందాకు ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే వారిపై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా గ్యాంగ్ వార్ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రౌడీల మధ్య జరుగుతున్న గొడవలతో నగరంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి. పోలీస్ యాక్ట్ 30, 31(ఎ) సెక్షన్లను కూడా అమలులో పెట్టారు. ఇప్పుడు ఆయిల్ మాఫియా కూడా తోడవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
అల్లుకుపోతున్న ఆయిల్ మాఫియా
సాక్షి, విశాఖపట్నం: ఆయిల్ మాఫియా మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. రెండు నెలల క్రితం నగరంలో 14 మంది మాఫియా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఇక ఈ దందా సాగనివ్వబోమని పోలీసులు ప్రకటించారు. కానీ విశాఖ నగరానికే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు ఆయిల్ మాఫియా కార్యకలాపాలు విస్తరించాయని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తాజా సంఘటన బయటపెట్టింది. రణస్థలం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడి పెసరపాలెంలో వేస్ట్ ఆయిల్ వ్యాపారం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరిలో విశాఖ నుంచి వెళ్లిన వారు 11 మంది కాగా అక్కడ వ్యాపారం చేస్తున్నవారు మరో ముగ్గురు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఓ ముఠా నగరంలో ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతోంది. తర్వాత వారిలో వారికి మనస్పర్ధలు రావడంతో ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. నగరంలోని పోర్టు, రైళ్లు, లారీల నుంచి ఆయిల్ దొంగిలిస్తున్నారు. భూ మాఫియా, డ్రగ్స్ మాఫియా కంటే దారుణంగా ఇది విస్తరించింది. తమ దందాకు ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే వారిపై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా గ్యాంగ్ వార్ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రౌడీల మధ్య జరుగుతున్న గొడవలతో నగరంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి. పోలీస్ యాక్ట్ 30, 31(ఎ) సెక్షన్లను కూడా అమలులో పెట్టారు. ఇప్పుడు ఆయిల్ మాఫియా కూడా తోడవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
హైదరాబాద్‌లో నకిలీ ఆయిల్ దందా!
-
టాస్క్‌ఫోర్స్ వలలో ఆయిల్ మాఫియా
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో మాఫియా వెలుగు చూసింది. పకడ్బందీగా తమ కార్యకలాపాలు సాగిస్తోంది. ఏకంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నుంచే ఆయిల్‌ను మాయం చేస్తోంది. పోలీసులకు దొరకకుండా ఇన్నాళ్లూ సాగించిన వారి దందాకు టాస్క్‌ఫోర్స్ నిఘాతో గట్టి దెబ్బతగిలింది. పోలీసులు వలపన్ని మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తితోపాటు అతని అనుచరులను పట్టుకున్నారు. నగర కమిషనర్ అమిత్‌గార్గ్ శుక్రవారం వారిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం 20 మందికిపైగా ముఠాతో ఆయిల్ దొంగతనాలకు పాల్పడేవాడు. తర్వాత అనుచరుల్లో మనస్పర్ధలు రావడంతో వారంతా ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతో కొంతకాలం అతని కార్యకలాపాలు తగ్గాయి. మళ్లీ వారిని చేరదీసి ముఠాగా ఏర్పరచి, పోర్టు, రైళ్లు, లారీల నుంచి ఆయిల్ దొంగిలించడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్, ట్యాంకర్ల నుంచి ఆయిల్ దొంగిలిస్తుండగా బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని మల్కాపురం పోలీసులకు అప్పగించారు. రెండు రోజులపాటు నిందితుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులకు... హెచ్‌పీసీఎల్ సంస్థలోని కొందరు సిబ్బందితోపాటు పోలీసు శాఖలో కొందరి నుంచి నిందితులకు సహకారం లభించినట్లు ఆధారాలు లభించినట్టు సమాచారం. -
ఆయిల్ మాఫియా
మేదరమెట్ల: జాతీయ రహదారిపై ఆయిల్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారుల అండ చూసుకొని కిరోసిన్, ఇతర ఆయిల్స్ అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మొదట్లో మారుమూల ప్రాంతంలో ఎవరూ చూడని ప్రదేశంలో కేవలం కిరోసిన్ మాత్రమే సేకరించి లారీలకు విక్రయించే వారు. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కనే యథేచ్ఛగా డిజిల్, సోప్ ఆయిల్, గేర్ ఆయిల్, పామాయిల్, తారు, ఇనుము లారీల నుంచి అక్రమంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మద్దిపాడు మండలంలోని మద్దిపాడు నుంచి కొరిశపాడు మండలం గుండ్లాపల్లి, మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి మండలంలోని వెంకటాపురం, పంగులూరు మండలంలోని రేణంగివరం, కొండమంజులూరు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమార్కులు సుమారు 20 కిపైగా అక్రమ ఆయిల్బంకులను ఏర్పాటు చేసి రాత్రీ పగలు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటిల్లో కిరోసిన్ అమ్మే బంకులు పది, డిజిల్తోపాటు ఇతర ఆయిల్స్ అమ్మే బంకులు పదికిపైగా ఉన్నాయి. ఇవి కాకుండామేదరమెట్ల-నార్కెట్‌పల్లి రోడ్డులో బొడ్డువానిపాలెం నుంచి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు సుమారు మరో పది బంకులకుపైనే ఈ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒంగోలు, కనిగిరి, ఇంకొల్లు, వినుకొండ, నరసరావుపేట హాకర్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ ట్యాంకర్లు నేరుగా హైవేపై ఉన్న బంకులకు చేరుతుంది. వాస్తవంగా రేషన్ దుకాణాలకు ప్రతినెలా 25వ తేదీ నుంచి 1వ తేదీలోపు రేషన్ చేరాలి. కానీ అక్రమార్కులు ఈ తేదీలను మినహాయించి మిగిలిన రోజుల్లో రోజు మార్చి రోజు వచ్చే ట్యాంకర్ల నుంచి బంకుల వద్ద నీలికిరోసిన్‌ను బయటకు తీస్తుంటారు. అలా వచ్చిన ఒక్కో ట్యాంకర్లో 12 వేల లీటర్ల కిరోసిన్ ఉంటుంది. లారీ డ్రైవర్ల కక్కుర్తి... హైవేపై తిరిగే లారీల్లో కొందరు డ్రైవర్లు మామూలు డీజిల్ బంకుల్లో తమ వాహనాలకు ఆయిల్‌ను కొట్టించకుండా అక్రమార్కుల వద్ద కిరోసిన్ పోయిస్తారు. వీరు లారీలో లీటర్ కిరోసిన్ రూ.46 లెక్క పోయించుకుని తమ వాహన యజమానికి మామూలు డీజిల్ ధర ప్రకారం లెక్క చూపిస్తారు. అందుకుగాను ఒక్కో డ్రైవర్‌కు లీటర్‌కు సుమారు రూ.10 మిగులుతాయి. వీరి కక్కుర్తి అక్రమార్కులకు వరమైంది. కిరోసిన్‌తో నడిచే వాహనాలు త్వరగా బోరుకు వ స్తాయి.. కల్తీలేని డీజిల్‌తో నడిచే వాహనం జాగ్రత్తగా తిరిగితే రెండు, మూడేళ్ల వరకు బోరుకు రాదు. అదే కిరోసిన్ వాడకం వల్ల ఏడాదికే బోరుకు వచ్చి లారీ మూలనపడుతుంది. దీనివల్ల లారీ యజమానికి నష్టం వాటిల్లుతోంది. అంతేగాక ఈ లారీలు ఎక్కువ మోతాదులో పొగను విడుదల చేయడం వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. రేషన్ డీలర్ల కుమ్మక్కు ఇలా... హైవేపై ఉన్న అక్రమార్కుల బంకులకు నీలికిరోసిన్ అమ్మడమే ధ్యేయంగా కొందరు డీలర్లు పనిచేస్తున్నారు. కొంతమంది డీలర్లైతే తమ వద్దకు కిరోసిన్ రానివ్వకుండానే ట్యాంకర్లను నేరుగా దళారుల ద్వారా బంకుల వద్దకు అర్ధరాత్రి తరలిస్తుంటారు. ఇందుకుగాను ఒక్కో డీలర్‌కు లీటర్‌కు సుమారు రూ.15 నుంచి రూ.25 వరకు మిగులుతాయి. పేదలకు అందాల్సిన కిరోసిన్‌ను దొడ్డి దారిన అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గేర్, ఇంజిన్ ఆయిల్... చెన్నైపోర్టు నుంచి హైదరాబాద్, కోల్కత్తా, పూణె తదితర ప్రాంతాలకు వెళ్లే గేర్, ఇంజిన్ ఆయిల్ ట్యాంకర్ల నుంచి ట్యాంకర్ డ్రైవర్లు అక్రమార్కుల స్థావరాల వద్ద బయటకు తీస్తారు. ఒక్కో ట్యాంకర్ నుంచి లీటర్ రూ.53 చొప్పున సుమారు 5 పీపాలు(1100 లీటర్లు) పడతారు. అలా సేకరించిన ఆయిల్‌ను సమీపంలోని ఆటోమొబైల్ షాపులకు లీటరు రూ.76కు ఇస్తుంటారు. ఆ ట్యాంకర్లు చేరాల్సిన ప్రాంతాల్లోని వారికి మామూళ్లు ఇస్తుండడంతో లోపల ఎన్ని లీటర్లు ఉందో పట్టించుకోరని ట్యాంకర్ల డ్రైవర్లు చెబుతుంటారు. కొందరు అక్రమార్కులు ఇలాంటి ఆయిల్‌ను లీటరు, అరలీటరు, వందగ్రాములు ఇలాప్యాకింగ్ చేసి మరీ ఆటోమొబైల్ షాపులకు అమ్ముతుంటారు. పామాయిల్... కాకినాడ, వైజాగ్ పోర్టుల నుంచి వచ్చే ముడి పామాయిల్ నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలకు వెళ్లే ట్యాంకర్ల నుంచి ఒక్కోదాని నుంచి సుమారు 660 లీటర్లు తీస్తారు. దీనిని ఒక్కో లీటర్‌ను రూ.42కు కొంటారు. ఈ ఆయిల్‌ను స్థానిక వ్యాపారులకు రూ.56కు అమ్ముతారు. అలా కొన్న ఆయిల్‌ను వీరు మామూలు ఆయిల్లో కల్తీ చేసి మార్కెట్ ధరకు ప్రజలకు విక్రయిస్తారు. తారును కూడా ఇలానే సేకరించి హైవేపై ఉన్న తారు ప్లాంట్లకు విక్రయిస్తారు. అలాగే స్థానికంగా ఉన్న చిన్నచిన్న రోడ్డు కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుంటారు. దీనిని పీపాల లెక్కన కొంటారు. ఒక్కో దాన్ని రూ.6500కు కొని తారు ప్లాంట్లకు రూ.9 వేల లెక్కన విక్రయిస్తారు. ఇనుము.. పొడవాటి ట్రాలీల ద్వారా రవాణా చేసే ట్రాలీల డ్రైవర్లు ట్రాలీలోని బారు ఇనుప చువ్వల ఒక్కో కట్ట నుంచి ఒకటి, రెండు చువ్వలు బయటకు లాగి అక్రమార్కులకు అమ్ముతారు. అలా సేకరించిన చువ్వలను స్థానిక ఇనుము వ్యాపారులకు అమ్ముతారు. మామూళ్లు మామూలే.. ఈ అక్రమ వ్యాపారాన్ని వదిలేసినందుకుగాను ఒక్కో కిరోసిన్ బంకు నుంచి నెలకు రూ.4 వేలు చొప్పున అటు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇతరులకు కూడా సుమారు రూ.3 వేల చొప్పున ఇస్తుంటారు. ప్రతి నెలా సుమారు రూ.3 కోట్ల వ్యాపారం... హైవేపై ఉన్న అక్రమ బంకుల వారందరూ కలిపి నెలకు సుమారు రూ.3 కోట్లకుపైనే వ్యాపారం చేస్తున్నారు. హైవేపై నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు సైతం తిరుగుతున్నా ఎవరూ ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమవ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. వ్యాపారంలోకి దిగితే చాలు లక్షాధికారే... ఈ అక్రమ వ్యాపారంలోకి ఒకరిని చూసి మరొకరు ఆకర్షితులవుతున్నారు. ఏమీ పనిలేని వారు ఇలాంటి వ్యాపారంలోకి దిగి అతితక్కువ కాలంలోనే లక్షాధికారులు అవుతుండటం చూసి యువత సైతం ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నా దృష్టికి రాలేదు పి.వి.సాంబశివరావు, తహశీల్దార్ కిరోసిన్ అక్రమ వ్యాపారం గురించి నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమంగా కిరోసిన్ వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటాం. నీలి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్పు... నీలి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చినందు వల్ల ఒక్కో లీటర్‌కు అదనంగా మరో రూ.10 వస్తాయి. ఇలా మార్చినందున ఒక్కో లీటర్‌కు రూపాయి వరకు ఖర్చవుతుంది. నీలి కిరోసిన్ 220 లీటర్ల డ్రమ్ముకు ఒక కేజీ కెమికల్ పౌడర్, వంద గ్రాముల వైట్ యాసిడ్, ఒకలీటర్ గేర్ఆయిల్ను కలిపితే కిరోసిన్...డీజిల్ రంగులోకి మారుతుంది. దీనిని మార్కెట్లో ఉన్న డీజిల్ ధర కంటే రూ.3 తక్కువకు విక్రయిస్తుంటారు. కల్తీ డీజిల్‌ను తాళ్లూరు, గంగవరం వంటి మారుమూల పల్లెల్లోకి రాత్రిపూట తరలిస్తుంటారు. అక్కడ మామూలు బంకుల వాళ్లు ఈ డీజిల్‌ను మార్కెట్లో దొరికే ధర కంటే లీటర్‌కు ఒకటి నుంచి మూడు రూపాయలకు అదనంగా అమ్ముతారు. నీలి కిరోసిన్ రవాణా... అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 196 రేషన్ దుకాణాల నుంచి అక్రమార్కులు కిరోసిన్ సేకరిస్తారు. ఈ మొత్తం దుకాణాలకు ప్రతినెలా 8,300 లీటర్ల కిరోసిన్ చేరుతుంది. ఇందులో రేషన్‌కార్డుదారులకు చేరేది కేవలం 2,500 లీటర్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని హైవేపై ఉన్న కిరోసిన్ మాఫియాకు తరలిస్తారు. రేషన్డీలర్కు ఒక్కో లీటరు రూ.15 పడుతుండగా, వీరి వద్ద నుంచి దళారులు ఒక్కో లీటర్‌ను రూ.30ల చొప్పున కొనుగోలు చేస్తారు. ఇలా కొన్న కిరోసిన్‌ను హైవేపై ఉన్న అక్రమార్కులు ఒక్కో లీటర్ రూ.46 చొప్పున లారీలకు అమ్ముతుంటారు. -
జంతువుల కలేబరాలతో నూనెల తయారీ !!