Old age mother
-
అమ్మాచిని మించి దైవం ఉన్నదా!
మనం చిన్నవయసులో ఉన్నప్పుడు అమ్మ ఎత్తుకుంటుంది. కుంచెం నడవడం వచ్చిన తరువాత కూడా ఎత్తుకోమని అమ్మ దగ్గర మారాం చేసేవాళ్లం. అలాంటి అమ్మను ఎత్తుకోవడాన్ని మించిన అదృష్టం ఏం ఉంటుంది! కేరళకు చెందిన రోజన్ పరంబిల్ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తాడు. అయిదు సంవత్సరాల తరువాత సొంత ఊరు వచ్చాడు. వయసు పైబడి, బలహీనంగా కనిపిస్తున్న అమ్మాచి(అమ్మ)ను చూసి చాలా బాధేసింది. ఎంతో కాలంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన అమ్మకు బయటిగాలి తాకేలా ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ చిరు ప్రయాణంలో వారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. రకరకాల జ్ఞాపకాలను కలబోసుకుని తెగ నవ్వుకున్నారు. నచ్చిన చోట ఆగి సెల్ఫీలు తీసుకున్నారు. గతంలో ఒకసారి రోజన్ తన తల్లిని స్విట్జర్లాండ్ తీసుకువెళ్లి యూరప్‌లోని రకరకాల ప్రదేశాలు చూపెట్టాడు. తల్లిలో అప్పుడు కనిపించిన ఎనర్జీ ఇప్పుడు మరోసారి కనిపించింది. ట్రిప్ కోసం రోజన్ తన తల్లిని భుజాల మీద మోస్తూ కారు దగ్గరికి తీసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. నెటిజనులను కదిలించేలా చేసింది. -
పరుగులు తీసి.. ప్రాణం కాపాడి..
సాక్షి,చిత్తూరు(రేణిగుంట): ఏ కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. ఆగి ఉన్న గూడ్సు కింద పట్టాలపై తలపెట్టి పడుకుంది.. అదే సమయంలో రైలు కదిలేందుకు సిగ్నల్ పడింది.. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన రైల్వే పోలీసులు పరుగులు పెట్టారు.. పట్టాలపై నుంచి వృద్ధురాలిని పక్కకు లాగి కాపాడారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని ఉరుకులు పెట్టించిన ఈ ఘటన ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో జరిగింది. జీఆర్పీ ఎస్ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. రేణిగుంట బాలాజీ కాలనీకి చెందిన వరదరాజులు భార్య పాండియమ్మ(76) సాయంత్రం 6.30గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్ చివరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ కింద తలపెట్టింది. ఈ విషయం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సీసీ కెమెరాలో గమనించారు. వెంటనే ఆయన జీఆర్పీ స్టేషన్ సమాచారం అందించారు. అప్పటికే రైలుకు సిగ్నల్ పడడంతో ఎస్ఐ అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి పరుగుపరుగున పట్టాలపై పడుకున్న వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెను బలవంతంగా పక్కకు లాగేయడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వృద్ధురాలిని కాపాడిన కొద్దిక్షణాల్లోనే రైలు కదలింది. అనంతరం రైల్వే పోలీసులు పాండియమ్మ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలితో ఇంటికి పంపించారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
మానవత్వం మంటగలిసింది
కన్నబిడ్డలకు భారమైన తల్లి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం వృద్ధాశ్రమంలో చేర్పించిన పోలీసులు ఖమ్మం క్రైం : తొమ్మిది నెలలపాటు మోసి.. వారు ప్రయోజకులు అయ్యేంతవరకు పెంచి.. వారికి బతకటానికి మార్గం చూపించిన కన్నతల్లి కుమారులకు భారంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు కొడుకులు ఉన్న ఆమెకు తిండి పెట్టలేక వెళ్లగొట్టారు. 95 ఏళ్ల వయసున్న ఆమెను చిన్నపిల్లలా చూసుకోవాల్సిన కొడుకు, కోడళ్లు కాదుపొమ్మన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ పండు ముదుసలి ఖమ్మంలోని మున్నేరులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఖమ్మంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం చందర్లపాడుకు చెందిన ఉడుతా వెంకమ్మ(95)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరకీ వివాహాలయ్యాయి. భర్త సుబ్బయ్య మృతిచెందిన తరువాత వెంకమ్మ పరిస్థితి దారుణంగా తయారైంది. నలుగురు కొడుకులు ఆమెను పట్టించుకోవటం మానేశారు. ఒకరికొకరు పోటీపడి తమకు సంబంధం లేదంటూ వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉంటున్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటికి ఇటీవల వచ్చింది. అయితే కొడుకు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తూ .. ‘నీకు భోజనం పెట్టలేము.. ఖమ్మంలో ఉన్న నీ కూతురు వద్దకు వెళ్లు’ అని బలవంతంగా పంపించారు. ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న కూతురు ఇంటికి వెళ్లి.. వారికి భారం కావడం ఇష్టం లేని వెంకమ్మ ఇక తనకు చావే శరణ్యం అని భావించింది. ఖమ్మం బస్టాండ్ నుంచి ఆటోలు కాల్వొడ్డులోని మున్నేరు వద్దకు వచ్చి అందులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ రెహమాన్, ఎస్ఐ సర్వయ్య అక్కడికి చేరుకుని వెంకమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకుని వాసవి వృద్ధాశ్రమ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తితో మాట్లాడి అందులో చేర్పించారు. వైరాలో ఉన్న ఆమె కుమారుడిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు.