Old Currency Exchange
-
పాత నోట్లు మార్చేద్దామని..
- రూ. 1.85 కోట్లు కూడగట్టిన 13 మంది నిందితులు - అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: పాతనోట్ల మార్పిడికి సాధారణ గడువు ముగిసినా ఇంకా కొందరు నల్లబాబుల్లో ‘మార్పిడి’ ఆశలు చావలేదు. ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోటాలో భారీ మొత్తం పాత నోట్ల మార్పిడికి ఓ ముఠా కుట్ర పన్నింది. మొత్తం 13 మంది నింది తులు రూ. 1.85 కోట్ల పాత నోట్లు కూడ గట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నింది తుల్ని అరెస్టు చేసి, రూ.500, రూ.1,000 డినా మినేషన్లో ఉన్న పాత నోట్లు స్వాధీనం చేసు కున్నారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన కమల్ కాబ్రా, కన్హయ్యలాల్ అగర్వాల్, విశాల్ కుమార్ హోల్‌సేల్ వ్యాపారులు. ఈ మ్గురూ తమ వద్ద ఉన్న రూ. 50 లక్షల పాత నోట్లను మార్చడం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో విశాల్‌కుమార్ తనకు పరిచయస్తుడైన దీపక్ అగర్వాల్‌ను సంప్రదించాడు. తనతో పాటు స్నేహితులైన టి.నరేందర్ అగర్వాల్, వై.అజయ్ కుమార్, మహ్మద్ మజర్, రాజేందర్ అగర్వాల్ రూ.1,01,55,000 పాత నోట్లు కలిగి ఉన్నారని, వారితో కలసి మారుద్దామంటూ చెప్పాడు. దీంతో ఈ ఎనిమిది మంది కలసి పాత నోట్ల మార్పిడి కోసం మార్గాలు అన్వేషించసాగారు. ఎన్ఆర్ఐ కోటాలో మారుస్తామని.. రాజేందర్ అగర్వాల్ ద్వారా వీరికి మహ్మద్ ఖమ్రుద్దీన్, ఎం.రాజారావు, మహ్మద్ వసీమ్, ఆర్.ప్రవీణ్‌రాజు, ఎన్.రాజు పరిచయ మయ్యారు. తమకు ఆర్బీఐ అధికారులతో పరిచయాలున్నాయంని.. ఎంత మొత్తం పాత కరెన్సీ అయినా మారుస్తామని నమ్మబలికారు. సాధారణ మార్పిడికి మార్చి 31తో తుది గడువు ముగిసినా... ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పాత నోట్లను మార్చుకోవడానికి జూన్ 30 వరకు గడువు ఉందని నమ్మించారు. ఈ దళారులు కూడా తమ స్నేహితులు, పరిచయస్తుల నుంచి రూ. 33,45,000 పాత నోట్లు సమీకరించారు. 80% కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం రూ.లక్ష పాత నోట్లు ఇస్తే 80 శాతం తమ కమీషన్లు పోను రూ.20 వేల కొత్త నోట్లు వస్తాయంటూ వ్యాపారులకు చెప్పారు. దీంతో మొత్తం 13 మందీ ఆదివారం రెండు వాహనాల్లో పాత నోట్లు తీసుకుని బేగంపేట హాకీ గ్రౌండ్స్ వద్ద ‘ఆర్బీఐ’వ్యాన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలోని బృందం దాడి చేసి 13 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.85 కోట్ల పాత నోట్లు, రెండు కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. -
పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
రూ.42.7 లక్షలు స్వాధీనం హైదరాబాద్: రద్దయిన పాత నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.42.7 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాకు నర్సాపురానికి చెందిన కె.శ్రీనివాస్(32) మోతీనగర్‌లో నివశిస్తున్నాడు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు.. ఆర్బీఐ వద్ద చిరిగిన నోట్లు మార్పిడి చేసే సనత్నగర్వాసి జి.ప్రశాంత్(55)తో పరిచయం ఏర్పడిం ది. రద్దయిన నోట్లను మార్చేందుకుగానూ రూ.24 లక్షల విలువైన పాత రూ.1000, రూ.500 నోట్లను ప్రశాంత్ శ్రీనివాస్‌కు ఇచ్చాడు. శ్రీనివాస్ పలు దఫాలుగా రూ.10 లక్షలను ప్రశాంత్‌కు అందించాడు. ఎర్రగడ్డకు చెందిన గార్మెంట్ సేల్స్, కమిషన్ ఏజెంట్ మహ్మద్ నసిరుద్దీన్(35) శ్రీనివాస్‌కు రూ.11.2 లక్షలు ఇవ్వగా, దీనికి కమిషన్‌గా రూ.4.2 లక్షలు అందించాడు. ఇలా రూ.35.2 లక్షల విలువ చేసే రద్దయిన నోట్లను సేకరించి శ్రీనివాస్ దగ్గర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి వచ్చి కేపీహెచ్బీలో ఉంటున్న ఏసీ మెకానిక్ నరసింహతో అతడికి పరిచయం అయింది. ఇద్దరూ కలసి పాత నోట్లను మార్చే క్రమంలో బేగంపేట్‌లో ఏజెంట్ల కోసం ప్రయత్నిస్తుండగా... పోలీసులు వారితో పాటు మరో ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. -
పాతకరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా అరెస్టు
1.35 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం హైదరాబాద్: పాతనోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ సంతోష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం డీఆర్డీఓ మిత్రా వైన్స్ సమీపంలో ఓ ముఠా నోట్లు మారుస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో రూ.1.35 కోట్ల పాత కరెన్సీతోపాటు రెండు కార్లు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కొత్తపేట్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉప్పల శ్రీధర్, సీసీఎస్ కానిస్టేబుల్ ఎండీ నజీర్‌హుస్సేన్, డబీర్‌పురాకు చెందిన ఆభరణాల వ్యాపారి మహ్మద్ నజీబుల్లా ఉన్నట్లు ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. -
పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం
-
పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం
∙రూ.1.20 కోట్ల పాత కరెన్సీ పట్టివేత ∙పరారీలో సూత్రధారి రామకృష్ణ బంజారాహిల్స్: పాత కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ల మార్పిడి తతంగంలో ఓ సినీదర్శకుడు సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని కమలాపురి కాలనీలో సినీ దర్శకుడు కిట్టు అలియాస్ రామకృష్ణ (కేటుగాడు సినిమా దర్శకుడు) కార్యాలయం ఉంది. ఈ నెల 31తో పాత కరెన్సీ మార్చుకునేందుకు గడువు ముగియనుండటంతో అతను తెలిసిన వారిని సంప్రదించి కరెన్సీ మార్పిడి చేస్తానని పిలిపించాడు. దీంతో ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్దమొత్తంలో పాత కరెన్సీ నోట్లు తీసుకుని కిట్టు సినీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 30 మంది రూ.13 కోట్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో పాత బస్తీకి చెందిన వ్యాపారి వసీం రూ. 20 లక్షలు, అమీర్‌పేట్‌కు చెందిన ప్రసాద్ రూ. 18 లక్షలు, మరో వ్యాపారి దిలీప్ రూ. 20 లక్షలు తేగా, మిగతా వారు కూడా పెద్దమొత్తంలో నగదు తీసుకువచ్చి కిట్టు కోసం వేచి చూస్తున్నారు. అయితే అదే సమయంలో ముంబయికి చెందిన బిలాల్ షుక్రు అనే వ్య రివాల్వర్‌తో అక్కడికి రావడంతో వారులో కొందరు అక్కడినుంచి జారుకున్నారు. ఇలోగా దీనిపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ప్రసాద్, దిలీప్, వసీంతోపాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీరిని స్టేషన్‌కు తరలించి షుక్రూ నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా వారిని భయపెట్టి పాత కరెన్సీతో ఉడాయించాలన్నది కిట్టూ గ్యాంగ్ పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దర్శకుడు కిట్టు పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రదారి కిట్టు కోసం గాలింపు చేపట్టారు. అతనితోపాటు రాజేష్, మనోజ్, బిలాల్, పాషా, వసీం, దిలీప్‌జైన్, ప్రసాద్, తులసీదాస్లపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ రూ.100 కోట్లు పాత నోట్ల మార్పిడి పేరుతో గత కొద్ది నెలలుగా కొన్ని ముఠాలు జోరుగా కమీషన్ దందా నడిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో సినీపరిశ్రమలోని కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక ప్రముఖ నిర్మాత కుమారుడు గడువు ముగిసేలోగా రూ.100 కోట్లు మార్చాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.. బంజారాహిల్స్ కేంద్రంగా గత మూడు నెలలుగా 60–40 పేరుతో జోరుగా దందా నడుపుతున్నారు. పాతనోట్ల రద్దుతో చాలా మంది తమ వద్ద ఆదాయానికి మించి ఉన్న కరెన్సీని మార్చుకొనేందుకు అడ్డదారులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది 40 శాతం కటింగ్‌తో కొత్త నోట్లను తీసుకున్నారు. ఈ వ్యవహారం నోట్ల జమ నిర్ణీత గడువు వరకు కొనసాగింది. ఒకానొకదశలో 10 శాతం కమీషన్‌పై కూడా నోట్లను మార్పిడి చేశారు. నేడు 60–40 బ్యాంకులు పాతనోట్లను స్వీకరించే గడువు ముగియడంతో పలువురు మిగిలిపోయిన డబ్బును ఇప్పుడు తమకు తెలిసిన వారి ద్వారా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు 60–40, 80–20 శాతానికి మార్చుకుంటున్నారు. ఇందుకు బంజారాహిల్స్ ప్రాంతం ముఖ్య కేంద్రంగా మారింది. ‘పెద్దల’ ఇలాకాలో.. నోట్ల మార్పిడి వ్యవహారం ఇప్పుడు క్లిష్టంగా మారడంతో పెద్దలు రంగంలోకి దిగారు. తమ పరిచయాల ద్వారా డబ్బును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమకు ఆర్బీఐలో పెద్ద పరిచయాలు ఉన్నాయంటూ కమీషన్‌పై మార్పిడి చేస్తున్నారు. దీనికితోడు సినీపరిశ్రమకు చెందిన కొందరు జోరుగా దందా కొనసాగిస్తున్నారు.. బంజారాహిల్స్ కేసులో సినీ దర్శకుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరు ఆందోళన చెందుతున్నారు.