చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు
మంత్రాలయం: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని దాచుకున్న కొందరు చెత్తకుండీల పాల్జేస్తున్నారు. గురువారం మంత్రాలయం ఆర్అండ్బీ ప్రహరీ సమీపంలోని ఓ చెత్త కుండీలో 8 వెయ్యి నోట్లు, మరో 8 రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. వీధులను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గమనించి సమాచారం ఇవ్వగా ఎస్ఐ శ్రీనివాసనాయక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు.