ప్రత్యూష్‌కు చెస్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ప్రత్యూష్ శ్రీవాస్తవ విజేతగా నిలిచాడు. శుక్రవారం దీప్తాంశ్ రెడ్డితో జరిగిన ఆఖరిదైన ఐదో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఈ రౌండ్ అనంతరం వీరిద్దరి ఖాతాలో చెరో నాలుగున్నర పాయింట్లు చేరాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రత్యూష్‌ను విజేతగా ప్రకటించారు.
ఇతర గేమ్‌లలో వరుణ్ (3)పై ఎం.వై. రాజు (4.5) నెగ్గగా... చక్రవర్తి రెడ్డి (4) చేతిలో బిపిన్‌రాజ్ (3) ఓడాడు. ప్రతీక్ శ్రీవాస్తవ (3.5)-కండి రవి (4); ఫయాజ్ (3.5)-రితేశ్ (3.5)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. ఏజ్ గ్రూప్ అండర్-14 బాలుర విభాగంలో తరుణ్ గోపాల్, కృష్ణసాయిలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల్లో మనస్విని, కేవీఎన్ శ్రేయ ఒకటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. అండర్-12లో సాయి కౌస్తుభ, యశ్వంత్, సాహిత్య; అండర్-10లో రోహిత్, శ్రీచక్ర, త్రిష; అండర్-8లో సహర్ష్ పట్నాయక్‌లు విజేతగా నిలిచారు.
విజేతలతో ముఖ్య అతిథి ఏపీ చెస్ సంఘం కార్యదర్శి కె. కన్నారెడ్డి