సాక్షి, హైదరాబాద్: సైబర్ చెస్ అకాడమీ నిర్వహించిన వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో వి.వరుణ్ విజేతగా నిలిచాడు. గచ్చిబౌలిలోని టెలికామ్ నగర్‌లో ఉన్న సైబర్ చెస్ అకాడమీలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఐదు రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో వరుణ్ నాలుగు విజయాలు, ఒక డ్రా ఫలితంతో నాలుగున్నర పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇతనితో పాటు ఎస్.ఖాన్ కూడా 4.5 పాయింట్లు సాధించినప్పటికీ ప్రొగ్రెస్సివ్ స్కోరు ఆధారంగా వరుణ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఖాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అశ్లేష్ (4) మూడో స్థానం దక్కించుకున్నాడు. రాజా రిత్విక్ (4) నాలుగో స్థానంలో, హేమంత్ ఈశ్వర్ (4) ఐదో స్థానంలో నిలిచారు. ప్రత్యూష్ శ్రీవాత్సవ (3.5), సూర్యనారాయణ (3.5)లు వరుసగా ఆరు, ఏడు స్థానాలు పొందారు. వీరి తర్వాత తమిళ్‌సెల్వన్ (3.5), దుర్గా ప్రసాద్ (3.5), శ్రీశ్వన్ (3) తొలి పది స్థానాల్లో నిలిచారు.
సైబర్ చెస్ చాంపియన్ వరుణ్
Published Mon, Apr 28 2014 1:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement