రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా ఆల్ ఇన్క్లూజివ్ వన్-వే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.949ల ప్రారంభ ధరలతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 10 మధ్యలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 12 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని, ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని విస్తారా తెలిపింది.