ఫేస్బుక్ లైవ్ లో వన్ ప్లస్ 3టీ లాంచ్ నేడే
ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సిరీస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. దాదాపు అన్ని ఫీచర్స్ వన్ ప్లస్ 3 లాగానే ఉన్నప్పటికీ, అప్ గ్రేడెడ్ వెర్షన్ గా వన్ ప్లస్ 3 టీ పేరుతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్త డివైస్ మంగళవారం లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్తో నౌగట్ బేస్డ్ ఆక్సిజన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు మధ్యాహ్నం 11.30కు ఫేస్ బుక్ లైవ్ వీడియో ద్వారా విడుదల చేయనున్నారు. అయితే దీని ధర, ఇతర స్పెసిఫికేషన్స్ నెట్ లో కొన్ని రూమర్లు, అంచనాలు చెలరేగాయి. దీని ప్రకారం వన్ ప్లస్ 3 టీ మొబైల్ ధర సుమారు రూ.34,000.
వన్ ప్లస్ 3 లోని స్నాప్డ్రాగన్ 820తో పోలిస్తే .కొత్త డివైస్ లోని కొత్త ప్రాసెసర్ పనితీరు 10 శాతం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే క్వాల్కామ్ వెల్లడించింది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్, 64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ రియర్ కెమెరా 3300ఏంఏహెచ్ బ్యాటరీ, అమర్చినట్టు భావిస్తున్నారు.