ongole district
-
ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం
-
యంగ్ సైంటిస్ట్ శిక్షణకు మంగమూరు విద్యార్థి
ఒంగోలు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహించనున్న యంగ్ సైంటిస్ట్ శిక్షణకు మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి మట్టిగుంట క్రాంతికుమార్ ఎంపికయ్యాడు. ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు, 8వ తరగతి మార్కులు, సైన్స్ ఫెయిర్, ఒలంపియాడ్ పరీక్షలు, క్విజ్, క్రీడలు తదితర అంశాల్లో చూపిన ప్రతిభను పరిగణలోకి తీసుకున్న ఇస్రో.. యువికా–2022కు క్రాంతికుమార్‌ను ఎంపిక చేసింది. దేశం మొత్తం మీద 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ను డీఈవో బి.విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజ్మేరీ, పాఠశాల హెచ్ఎం బి.సుధాకరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో రిపోర్టు చేయాలని ఇప్పటికే విద్యార్థికి ఆదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇస్తూ యువ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ మరియు స్పేస్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వార్త కూడా చదవండి: చురుగ్గా 44వ విడత ఫీవర్ సర్వే -
దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని, ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఇంత మంది జరుగుతున్నా కూడా చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని మండిపడ్డారు. ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్, రామోజీరావు, టీవీ5 అని అన్నారు. ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారని, పేదలకు మంచి చేయొద్దని అంటున్నారని సీఎం మండిపడ్డారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉందని, మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలిపారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని సీఎం అన్నారు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వమని, టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని, మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చదవండి: YSR Sunna Vaddi 2022: ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన -
ఒంగోల్ లో ఘనంగా నరకాసుర వధ కార్యక్రమం
-
భార్య మృతిని తట్టుకోలేక భర్త దారుణం
సాక్షి, ప్రకాశం: భార్య మృతితో మనస్తాపానికి గురైన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి, ఓ కుమారుడు మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఎలుకల మందు మజాలో కలిపి తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలు మిలటరీ కాలనీకి చెందిన తన్నీరు అంకమ్మ రాజు (36) బేల్దారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈయన భార్య కల్యాణి గతేడాది క్యాన్సర్‌తో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి కొడుకుల జీవనం కష్టంగా మారింది. పెద్ద కుమారుడు వంశీకృష్ణ ఆరో తరగతి, చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) ఐదో తరగతి చదువుతుండేవాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూత పడడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే రెండు నెలలుగా పనులకు కూడా వెళ్లకుండా రాజు ఉన్న డబ్బుతో పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాజు తన సోదరుడు మధుకు ఫోన్‌చేసి తాను, పిల్లలు ఇద్దరు మజా బాటిల్లో ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. వారి ఇంటి సమీపంలోనే ఉంటున్న మధు వెంటనే వచ్చి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజు మృతిచెందాడు. అయితే చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) పరిస్థితి విషమంగా ఉండడంతో బైపాస్ సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన కొద్దిసేపటికే కృష్ణ కన్నుమూశాడు. వంశీకృష్ణ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. వంశీకృష్ణ కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాజెక్టు ‘జియో’కు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:పోలీస్ శాఖలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసుల దర్యాప్తు విషయంలో ఎస్సైలు, సీఐలపైనే ఆధారపడకుండా ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు కూడా దర్యాప్తు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టారు. ‘జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (జియో)’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించి, వారికి నైపుణ్య శిక్షణను కూడా మొదలుపెట్టారు. 2020 జనవరి 1 నాటికి జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సైతం పూర్తి స్థాయి నైపుణ్యం సాధించేలా ఎప్పటికప్పుడు వారి పనితీరును సమీక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ‘ప్రాజెక్టు జియో’ విజయవంతమైతే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ యోచిస్తున్నారు. జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు గతంలో మాదిరిగా ఏసీ గదుల్లో శిక్షణ ఇవ్వడం కాకుండా నేరం జరిగిన వెంటనే సీనియర్ అధికారులు వీరిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు ఏ విధంగా మొదలుపెట్టాలి? ఎలాంటి ఆధారాలు సేకరించాలి? కేసు ఎలా నమోదు చేయాలి? దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత నివేదిక ఏ విధంగా రూపొందించాలి? అనేవాటిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా..పోలీస్ శాఖలో ఉన్న సిబ్బంది కొరతను అధిగమించేందుకు ‘జియో’ ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ప్రస్తుతం వంద మంది మాత్రమే ఉండడంతో కేసులు త్వరగా పరిష్కారం కావడం లేదు. గతేడాది జిల్లాలో 12 వేల కేసులు నమోదు కాగా 6 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులను నియమించాక మొత్తం 500 మంది వరకు దర్యాప్తు అధికారులు తయారయ్యారు. వీరి ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతినెలా దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన జూనియర్ అధికారులకు రివార్డులు కూడా అందించాలని నిర్ణయించారు. -
ఒంగోలులో భారీ చోరీ
ఒంగోలు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గోదావరి పుష్కరాలకు వెళ్లిన వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుష్కరాలకు వెళ్లి గురువారం తిరిగి వచ్చిన వ్యాపారి ప్రభాకర్ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. ఒంగోలు పట్టణంలోని చేజర్ల లక్ష్మణచారి వీధిలోని ఏనుగు చెట్టు వద్ద ఉండే ప్రభాకర్ గుప్తా రెండు రోజుల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్లి గురవారం తెల్లవారుజామున తిరిగి వచ్చాడు. కాగా, దొంగలు ఇంటిలో నుంచి 200 సవర్ల బంగారం, రూ. 4 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దోచుకున్నట్లు వ్యాపారి తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మనస్తాపంతో పొగాకు రైతు మృతి
టంగుటూరు (ప్రకాశం): పండించిన పొగాకు ధరలు పడిపోవటంతో తీవ్ర ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన దళిత రైతు మిడసల కొండలరావు (55) పదెకరాల్లో పొగాకు వేశారు. బుధవారం ఉదయం టంగుటూరులోని వేలం కేంద్రానికి పొగాకు తీసుకుని వేలం పాటకు హాజరయ్యాడు. అయితే, గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించకపోవటంతో కొండలరావు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో అక్కడే కుప్పకూలి చనిపోయాడు. -
ఊరెళ్తే..ఊడ్చేశారు
కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ. 4 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి ఇంటి యజమాని కమర్షియల్ ట్యాక్స్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు క్రైం: నగరంలోని కర్నూలు రోడ్డు, ముంగమూరు రోడ్డుకు మధ్య ఉన్న సుందర్ నగర్లో ఓ ఇంట్లో దొంగలు చేతివాటం చూపారు. ఆ ఇంటి యజమాని కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయట శుభ్రం చేసేందుకు పనిమనిషి వచ్చింది. ఇంటి కిటికీ తొలగించి ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న యజమాని ఆర్.సదానందరావుకు విషయం చెప్పింది. హుటాహుటిన ఆయన బయల్దేరి బుధవారం మధ్యాహ్నానికే ఒంగోలు చేరుకున్నారు. తలుపులు తీసి లోనికి వెళ్లగా ఇల్లు మొత్తం చిందరవందరగా కనిపించింది. ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి ఒంగోలు తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. దొంగతనం చేసిన తీరును గమనించారు. ఇంటి యజమాని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దొంగలు ప్రహరీ దూకి లోనికి ప్రవేశించి కిటికీ తొలగించారు. అత్యంత చాకచక్యంగా కిటికీకి ఉన్న ఇనుప బద్దెలు విరగ్గొట్టారు. ఇనుప ఫ్రేమ్‌ను కూడా బయటకు లాగేశారు. అనంతరం లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగులగొట్టారు. అందులోని 12 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు అపహరించుకుపోయారు. మూడు బెడ్రూముల్లోని అన్ని అలమరాలు చిందర వందర చేశారు. అనంతరం ఇంటి వెనుక తలుపు తీసుకొని దర్జాగా బయటకు వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావులు వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తుపై తాలూకా పోలీసులకు పలు సూచనలు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంటోనిరాజ్ తెలిపారు. -
పిచ్చికుక్కల స్వైర విహారం
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని కొండెపి మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం మండల కేంద్రంతో పాటు.. దాసిరెడ్డిపాలెం గ్రామంలో పిచ్చికుక్కలు పలువురిని గాయపరిచాయి. గ్రామానికి చెందిన రెండు వీధికుక్కలను ఒక పిచ్చి కుక్క కరవడంతో వాటికి పిచ్చెక్కి గ్రామస్తుల పై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులతో పాటు.. పదిమంది చిన్నారులను కరవడంతో.. వారిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అధికారులదీ అదే జపం
కందుకూరు అర్బన్( ప్రకాశం జిల్లా): కందుకూరు మున్సిపాలిటీలో అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదం. మున్సిపాలిటీ ఏమైపోయినా ఫర్వాలేదు... వారు చెప్పినవారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలను సైతం లెక్కచేయకుండా అడ్డగోలుగా అప్పగిస్తున్న వైనంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలకతీతంగా పని చేయాల్సిన కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు మున్సిపాలిటీలో శానిటేషన్, ఇంజినీరింగ్, కంప్యూటర్ ఆపరేటర్లు టెండర్ల గడువు మార్చినాటికి ముగిసింది. అధికారులు 2015-16 సంవత్సరానికి మార్చి 23న టెండర్లు పిలవగా శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లకు సాయి హెచ్ఎల్సీసీఎస్ (ఓగూరు), ఆర్ఎస్ఎంఎల్సీసీఎస్ (దూబగుంట) మార్చి 30వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిర్స్ ప్రతినిధులు టెండర్లు వేశారు. టెండరుదారుల్లో అధికారపార్టీకి చెందిన వారు లేకపోవడంతో సరైన ధ్రువపత్రాలు లేవని రదు ్దచేస్తున్నట్లు ప్రకటించారు. గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి పట్టం ఏప్రిల్ నెలలో కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ 2 శాతం ఎక్కువుగా టెండరు వేసింది. వెల్ఫేర్ అసోసియేషన్ 4.94 శాతం ఎక్కువకు టెండర్లు వేసింది. రెండు నెలలు తరువాత మళ్లీ సరైన పత్రాలులేవంటూ డీఈ సుబ్రమణ్యం, కమిషనర్ ఎస్వీ రమణకుమారిలు ప్రకటించి ఆ రెండు టెండర్లను తిరస్కరించారు. రెండు రోజుల తరవాత గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి చెందిన 4.94 ఎక్కువ శాతం వేసిన వెల్ఫేర్ అసోసియేషన్‌కి కట్టబెట్టి తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. ఒంగోలు ఇన్చార్జిగా ఆర్డీఓ మే 2వ తేదీన ఫీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిస్ టెండర్ల దారులకు ఫోన్ చేసి నిబంధనల ప్రకారం టెండరు ఖరారు చేసినట్లు చెప్పారు. తరువాత కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడంతో తరువాత సీన్ రివర్స్ అయింది. తక్కువ శాతం వేసిన టెండరును పక్కన పెట్టేసి ఎక్కువ శాతం టెండరును ఎలా ఓకే చేస్తారని పీఎస్ మ్యాన్‌పవర్ టెండరు ప్రతినిధులు నిలదీసినా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ఈ చర్యలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా సమర్పించినా రద్దుచేసి, డీఈ, కమిషనర్ సంబంధంలేని సమాధానాలు చెబుతున్నారని టెండరుదారుడు వాపోతున్నారు. ఒకసారి టెండరు రద్దుచేసిన తరువాత మళ్లీ టెండర్లు పిలవాలని నిబంధనలున్నా మూడో కంటికి తెలియకుండా టెండర్లు దఖలు పరచడం వెనుక అంతరార్థమేమిటని పురపాలిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కంప్యూటర్ టెండరుతోపాటు ఏప్రిల్ 27వ తేదీన ఓపెన్ చేసిన శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లను రద్దు చేశారు. ఆ టెండర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తా : ఎమ్మెల్యే పోతుల కందుకూరు మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆపరేటర్ విభాగానికి వేసిన టెండరు పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రద్దుచేసి గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తికి కట్టపెట్టిన కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్‌అధికారులకు ఫిర్యాదు చేస్తా. స్థానిక రోడ్లు,భవనాల శాఖ అతిధి గృహానికి వచ్చిన ఎమ్మెల్యేకు పి.ఎస్. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ తరుపు టెండరుదారులు కలిసి సమస్యను వివరించారు. ఇన్చార్జి ఆర్డీఓ నిబంధనల ప్రకారం టెండరు ఖారారు చేసినా ఇందుకు భిన్నంగా అధికారపార్టీకి అనుకూలమైన వారికి టెండరు ఖరారు చేశారని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ టెండర్లు రద్దుచేశామని చెప్పిన తరువాత మళ్లీ టెండర్లు పిలిచి ఇవ్వాల్సిన కనీస బాధ్యత కమిషనర్‌కు ఉందన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి మున్సిపాలిటీకి నష్టం జరిగే చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. శానిటేషన్,ఇంజనీరింగ్ టెండర్లను కూడా పదేపదే రద్దుచేయడం మంచిపద్దతి కాదన్నారు. మున్సిపల్ అభివృద్ధికి దోహదపడాల్సిన కమిషనర్ ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న విధానం మంచిది కాదన్నారు. -
నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు
మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్సీకి పోటీ తలకాయలు తమ తమ జేబుల లోపల దాచుకొనుచు పోలింగ్‌కు పోవల్సిన రోజులొస్తే సెలవిక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా.. అని ఆరు దశాబ్దాల కిందటే ఆవేదన వ్యక్తం చేశారు శ్రీశ్రీ. ప్రజాస్వామ్య విలువలకు వలువలు వలిచేస్తూ తలకాయలు ఎగరేస్తున్న నేటి టీడీపీ నేతలను చూస్తే ఇంకెంత పరుషంగా తన పదాలకు పదును పెట్టేవారో ఆ మహాకవి. ఓటుకు నోటంటూ అడ్డంగా దొరికిపోయినా మరింత అడ్డదిడ్డంగా వాగ్వాదాలకు దిగుతూ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గంటూ జిల్లాలో రాయ‘బేరా’లకు దిగుతున్నారు ‘పచ్చ’దొరలు. మెజార్టీ లేకపోయినా కోట్ల రూపాయలు కుమ్మరించి ఎమ్మెల్సీ సీటు దక్కించుకోడానికి ప్రయత్నిస్తున్న తీరును చూసి జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికను ఆ...విధంగా ముందుకు తీసుకువెళ్తాన్నారు మన నారా బాసు. ఒంగోలు: ఒకపక్క తమ పార్టీ అధినేత ఓటుకు నోటు కేసులో పీకల్లోతులో కూరుకుపోయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గంటూ తాజాగా జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓటుకు నోటు పద్ధతినే అవలంబిస్తున్నారు ఇక్కడి టీడీపీ నేతలు. మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగిన తెలుగుదేశం నాయకులు విపక్షాల సభ్యులకు ప్రలోభాల వల వేస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో వైఎస్సార్ సీపీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 992 ఓట్లుండగా, కో-ఆప్షన్ సభ్యులను కలుపుకుని వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన వారి సంఖ్య 496 వరకూ ఉండగా, తెలుగుదేశం పార్టీకి 457 ఓట్లున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ వర్గంతో కలుపుకుని, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 38 సీట్లు వరకూ ఉన్నాయి. జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకి 25 ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31 ఓట్లున్నా ఓటర్లను ప్రలోభ పెట్టి ముగ్గురిని తమ వైపు తిప్పుకున్నారు. ఒకరిని పాత కేసు బయటకు తీసి ఎన్నికకు కొద్ది గంటల ముందు అరెస్టు చేశారు. అయినా సొంతపార్టీలో తిరుగుబాటు అభ్యర్థిగా ఈదర హరిబాబు నిలబడటం, వ్యూహాత్మకంగా వైఎస్సార్ సీపీ అతనికి మద్దతు పలకడంతో తెలుగుదేశం పార్టీకి భంగబాటు తప్పలేదు. ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడగా, ఇన్‌ఛార్జి ఛైర్మన్ నూకసాని బాలాజీకి పదవుల ఎర చూపి పార్టీలోకి చేర్చుకున్నారు. ఎంపీపీల ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రలోభాలకు గురిచేసి, కొంతమందిని భయపెట్టి, మరికొంతమందిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. కనిగిరిలో ఎంపీపీ అభ్యర్థిని ఏకంగా కిడ్నాప్ చేసి భయపెట్టి ప్రలోభాలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా మెజారిటీ లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపారు. ఆర్థికంగా బలవంతుడైన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బొట్టు పెట్టారు. గతంలో పార్టీలోకి వస్తానంటే వద్దని చెప్పిన చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఏకంగా చినబాబు లోకేష్ రంగంలోకి దిగి కృష్ణమోహన్‌ను ఆహ్వానించారు. అయితే స్థానిక నాయకత్వం పూర్తిగా వ్యతిరేకించినా ససేమిరా అన్నారు. ఇటీవల కనిగిరి పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు గీతోపదేశం చేశారు. ఎంత ఖర్చయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించారు. సొంత పార్టీ వారికి ఎంతివ్వాలి, విపక్షాల నుంచి వచ్చే వారికి ఎంత ఇవ్వాలన్నది కూడా అదే సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఓటుకు నోటు వివాదంలో ముఖ్యమంత్రే స్వయంగా కూరుకుపోవడంతో తెలుగుదేశం నేతలు కొంత వెనకడుగువేశారు. పార్టీలోకి రావాలన్న విషయాన్ని ఫోన్లలో మాట్లాడటం లేదు. రహస్య ప్రాంతాలకు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. ఇటీవల దర్శిలో ఒక ఎంపీటీసీ పార్టీలో చేరితే అతనికి ఒంగోలు తీసుకు వచ్చి ఒక్కో ఏటీఎం నుంచి, ఒక్కో అకౌంట్ ద్వారా కొంత మొత్తం డ్రా చేసి అందజేశారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ మొత్తం డ్రా చేయకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో పార్టీలోకి వస్తారనుకున్న వారిని కూడా పూర్తిగా నమ్మడం లేదు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తన అభ్యర్థిని నిలబెట్టదంటూ ఒక దశలో ప్రచారం చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడంతో పోటీ ఉత్కంఠగా మారింది. ఎవరు గెలిచినా అతితక్కువ ఓట్లతోనే గెలిచే అవకాశం ఉండటంతో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. -
లారీ - కారు ఢీ: ముగ్గురి మృతి
ప్రకాశం: లారీ - కారు ఢీకొని ముగ్గురి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఐఓసీ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్నోవా కారు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన వారుగా గుర్తించారు. -
చెర వీడేనా ?
యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ నీరు - చెట్టు కార్యక్రమంలోనైనా ప్రభుత్వ పరమయ్యేనా ? అక్రమార్కులకు వరమైన రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తత ఆక్రమణ ల్లో 71.51 ఎకరాల చెరువుల భూములు వాటి విలువ రూ.7 కోట్లపైనే.. ‘చెట్లు పెంచుదాం..చెరువుల్ని సంరక్షిద్దాం..నీటి వృథాని నిలువరిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలను వేగవంతం చేయాలని సాక్షాత్తు సీఎం అధికారులను ఆదేశించారు. కానీ అందుకు అనుగుణంగా అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. వందలాది ఎకరాల చెరువుల భూములు అధికార పార్టీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకుపోయినా నోరు మెదపడం లేదు. కొండలు, వాగులు, చెరువు కట్టలూ వదలకుండా కబ్జా చేసేస్తున్నా చోద్యం చూస్తున్నారు. తాళ్లూరు : చెరువుల్లో పూడిక తీసి వాటికి పూర్వవైభ వం తేవడం సంగతి అటుంచి..ఉన్న చెరువుల్నీ ఆక్రమిస్తున్నారు అధికార పార్టీ నేతలు. సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సుబ్బన్న చెరువు సర్వే నంబర్ 324,325,326లో 61.24 ఎకరాలు ఉన్నాయి. అందులో 2001లో ఏక్‌సాల్ పట్టాలు ఇచ్చారంటూ కొందరు 12 ఎకరాలు ఆక్రమించి సుబాబుల్ సాగు చేశారు. 2007లో రెవెన్యూ యంత్రాంగం సాగును అడ్డుకోగా ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. స్టే తొలగింపజేసి చెరువును ఆక్రమణ చెర నుంచి విడిపించడంలో రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపలేదు. నాటి నుంచి సుబాబుల్ పెంపకం సాగుతూనే ఉంది. వారిబాటలోనే మరో 18 ఎకరాలను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించారు. ఇదేమిటి అని అడిగిన నాథుడే లేడు. దీంతో సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336లో 5.25 ఎకరాలు, స.న.337లో 5.90 ఎకరాలు, స.న.339లో 6.72 ఎకరాలు, స.న.322/1లో 23.72 ఎకరాలను తూర్పుగంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు 2014 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేసేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. తాజాగా వెలుగువారిపాలెం పంచాయతీ పరిధిలోని ఓసీ శ్మశానం యలమందవాగు ప్రాంతంలోని వాగు పోరంబోకు, శ్మశాన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ సమస్యపై గ్రామస్తులు తహశీల్దార్‌ను కలిస్తే గ్రామాల్లోని వాగులు, వంకలు తమ పరిధిలోకి రావని..పంచాయతీ వాటిని సంరక్షించాలని చెప్తుండగా...పంచాయతీ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదని అటుండటంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. మొత్తం రూ.7 కోట్లకుపైగా విలువైన చెరువుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కనీసం నీరు-చెట్టు పథకం అమలులో భాగంగానైనా గ్రామాల్లో చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించి వాటికి పూర్వవైభవం తేవాలని ప్రజలు కోరుతున్నారు. భూ కబ్జా చట్టం అమలు ఎక్కడ.. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై, ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూకబ్జా చట్టాన్ని తెచ్చారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అందుకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవటంతో ధన, రాజకీయ బలవంతులు దౌర్జన్యంతో చట్టాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్లు తెరచి కబ్జా అయిన వాగులు, వంకలను గుర్తించి రూ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, లేకుంటే గ్రామాల్లో శ్మశానాలు సైతం మాయమయ్యే రోజులు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా పి.సరోజిని, తహశీల్దార్ నూతనంగా బాధ్యతలు చేపట్టాను. కొత్తగా ఏవైనా ఆక్రమణలు ఉంటే చెప్పండి. గతంలో జరిగిన ఆక్రమణలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాను.