onine
-
ఉల్లి ఎగుమతులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఆదివారం) తెలిపింది. 2022 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య భారదేశం నుంచి సుమారు 523.8 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లి రవాణా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఉల్లి విత్తన ఎగుమతిపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపైన ఫిబ్రవరి 25న ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. భారత్ నుంచి సుమారు చాలా దేశాలకు ఉల్లి ఎగుమతి అవుతోందని, ఏ దేశానికీ ఉల్లి ఎగుమతులపై నిషేధం లేదని, అందుకు విరుద్ధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు దురదృష్టకరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' శనివారం ట్వీట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఉల్లి ఎగుమతులు దాదాపు 50 శాతం పెరిగి 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 16.3 శాతం పెరిగి 523.8 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు, కానీ ఉల్లి విత్తనాల ఎగుమతిపైన నిషేధం ఉన్నప్పటికీ DGFT నుండి ఆథరైజేషన్ కింద అనుమతించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని బట్టి భారతదేశం నుంచి ఉల్లి ఏ దేశానికైనా ఎగుమతి చేయవచ్చని, దానిపైన ఎటువంటి ఆంక్షలు లేదని స్పష్టమవుతోంది. There is no ban on onion exports from India to any country and misleading statements suggesting the contrary is unfortunate. Infact, from July-December 2022, onion exports have consistently been above the $40 million mark every month, benefiting our Annadatas. https://t.co/tGzwVHCt9J — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2023 -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్‌హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్‌లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్‌లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
ఆన్లైన్ తల్లిపాలతో ముప్పు
లండన్: ఆన్లైన్లో దొరికే తల్లిపాలతో ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బలవర్ధకంగా పేర్కొంటూ ఆన్లైన్లో అమ్మేపాలను తాగితే కేన్సర్, హెపటైటీస్, సిఫిలిస్, హెచ్ఐవీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని లండన్‌లోని క్వీన్ మేరి విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు కాగని తల్లిపాలను తాగడం వల్ల అంటు వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని వారు హెచ్చరించారు. ఈ పాలతో ఐస్‌క్రీములు, ఇతర పాలఉత్పత్తులు తయారుచేసి అమ్మటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఈ పాలను తాగితే కండరాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెబ్సైట్లు ప్రచారం చేస్తున్నాయనీ, కానీ వాటికి ఎలాంటి శాస్త్రీయఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చారు.