online payment system
-
ఆన్లైన్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా
ఆన్లైన్ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్వర్డ్, పిన్, సాఫ్ట్వేర్ టోకెన్లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది. -
రూ. 11 లక్షల కోట్లకు చేరిన యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా సెప్టెంబర్‌లో జరిగిన పేమెంట్ల విలువ రూ. 11 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. 678 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మే నెలతో పోలిస్తే (రూ. 10,41,506 కోట్లు) జూన్‌లో యూపీఐ డిజిటల్ పేమెంట్లు రూ. 10,14,384 కోట్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలైలో రూ. 10,62,747 కోట్లకు పెరిగాయి. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల విలువ చేసే 657.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తాజా గా పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్‌లో ఇటు విలువపరంగా అటు పరిమాణంపరంగా యూపీఐ సరికొత్త రికార్డులు నమోదు చేయొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
వాట్సాప్‌లో రూపాయి సింబల్ ఫీచర్..ఎందుకంటే
న్యూఢిల్లీ: చాట్ కంపోజర్‌కు రూపాయి గుర్తును జోడించినట్టు వాట్సాప్ ప్రకటించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదార్లకు అందరికీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ తోడవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాగే కంపోజర్లో ఉన్న కెమెరాతో 2 కోట్లకుపైగా స్టోర్లలో క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేయవచ్చు. 1.5 కోట్ల మంది చిన్న వర్తకులు వాట్సాప్ బిజినెస్ యాప్ వాడుతున్నారు. వీరంతా వాట్సాప్ యూజర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. పేమెంట్స్ సేవలను కంపెనీ భారత్‌లో గతేడాది నవంబర్‌లో ప్రారంభించింది. చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేయండి.. -
ఆన్లైన్ చెల్లింపు విధానం భేష్
జార్ఖండ్ సివిల్ సప్లైస్ కార్యదర్శి వినయ్‌కుమార్ చౌబే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆన్లైన్ చెల్లింపుల విధానం ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం బాగుందని జార్ఖండ్ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి వినయ్‌కుమార్ చౌబే అన్నారు. గురువారం పౌరసరఫరాల శాఖ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లా డుతూ.. ధాన్యం కొనుగోలు విధానం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఇక్కడి విధివిధానాలను అధ్యయనం చేయడానికి త్వరలో తమ రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని ఇక్కడికి పంపిస్తామన్నారు.