తెలంగాణలో ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం బాగుందని జార్ఖండ్ ఆహార, ప్రజా పంపిణీ,
జార్ఖండ్ సివిల్ సప్లైస్ కార్యదర్శి వినయ్‌కుమార్ చౌబే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం బాగుందని జార్ఖండ్ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి వినయ్‌కుమార్ చౌబే అన్నారు. గురువారం పౌరసరఫరాల శాఖ భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లా డుతూ.. ధాన్యం కొనుగోలు విధానం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఇక్కడి విధివిధానాలను అధ్యయనం చేయడానికి త్వరలో తమ రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని ఇక్కడికి పంపిస్తామన్నారు.