Open cast coal mining
-
బొగ్గు గనిలో వాలిపోనున్న ‘సలార్’ టీమ్
రామగుండం: ప్రభాస్ హీరోగా ‘సలార్' సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో త్వరలో సినీ నటుడు ప్రభాస్, ఇతర చిత్రబృందం వాలిపోనుంది. బొగ్గుగని ప్రాంతంలో ఫైట్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర బృందం ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్ పనులు మొదలుపెట్టారు. సెట్టింగ్ పనులు పూర్తవగానే నటీనటులు, చిత్రబృందం రానుంది. రెండు, మూడు రోజుల్లో సెట్టింగ్ పూర్తయి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందంలోని ఒకరు చెప్పారు. పది రోజుల పాటు ఓపెన్ కాస్ట్ గనిలో షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. దీనితోపాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు. -
భయం.. భయంగా..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలో బొగ్గు తవ్వకాలతో ఎన్టీఆర్ కాలనీకి ముప్పు ఏర్పడింది. కాలనీ ఓపెన్‌కాస్ట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఎన్టీఆర్ కాలనీలో సుమారు 579 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ముప్పావంతుకు పైగా దెబ్బతిన్నాయి. గనిలో బొగ్గు వెలికితీతకు బాంబులు పేల్చేటప్పుడు భూమి కంపిస్తోంది. శ్లాబులు పెచ్చులూడి పడిపోతున్నయి. ఇళ్లు ఊగిపోతున్నాయి. చాలా మంది కర్రలు పోటుపెట్టి బతుకీడుస్తున్నారు. బాంబుల తీవ్రత తగ్గిం చాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈసమస్యను స్థానిక ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ స్పందించడంలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సింగరేణి డైరెక్టర్‌కు పలు మార్లు విజ్ఞప్తులు పంపించామని, అయినా ఫలి తం కన్పించటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలతోనే సరి ఎన్టీఆర్నగర్ కాలనీ వాసులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అధికారులు మొక్కబడిగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి పోతున్నారు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. సింగరేణి ఏరియా జీఎం, పీఓ వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎలాం టి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల స్థానికులు ఖమ్మం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో బుధవారం రెవెన్యూ, మైనింగ్, సర్వే సిబ్బంది దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. న్యాయం చేస్తామని కానీ, పరిహారం ఇస్తామనికానీ హామీ ఇవ్వలేదు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆర్అండ్బీ ఇంజనీర్లతో పరిశీలన చేయించాలని, ఇల్లు ఎంతమేరకు దెబ్బతిన్నాయి..? నివాస యో గ్యానికి పని చేస్తాయా..? తదితర అంశాలను స్పష్టంగా తేల్చాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను తొలగించి కొత్త ఇళ్లను కట్టించాలని, లేని పక్షంలో సింగరేణి స్వాధీనం చేసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యంతో జబ్బులు సింగరేణి బొగ్గు తవ్వకాలతో వాతావరణం కలుషితమై కాలుష్యం పెరిగిపోయి రోగాల బారినపడుతున్నారు. ఛర్మ వ్యాధులు, కిడ్ని, శ్వాసకోశ, కణితులు, దృష్టిలోపం, లీవర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బొగ్గు నుసితో నల్లగా మారిపోతున్నాం. మంచినీళ్లతో సహా అన్నీ కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకోగా కంటితుడుపు చర్యగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించారు కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. సింగరేణి సంస్థ ఇంటింటి సర్వే నిర్వ హించి హెల్త్‌కార్డులు ఇచ్చి సింగరేణి ఆస్పత్రిలో ఉచిత వైద్యం సహాయం అందించాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. -
ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
కేకే ఓసీపీ భూమిపూజను అడ్డుకుంటాం
టీఫీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ బెల్లంపల్లి/కాసిపేట : ఎర్రగుంటపల్లిలో మంగళవారం నిర్వహించనున్న కేకే ఓసీ ప్రాజెక్టు భూమిపూజను అడ్డుకుని తీరుతామని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతి మంజూరు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం జనవినాశనానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో నిర్వహించిన సభలో కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉండవని, భూగర్భ గనులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ వాటి జోలికి వెళ్లకుండా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రజలు, ప్రజాసంఘాల బాధ్యులు ఓసీపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు తీవ్ర నిర్భంధకాండను ప్రదర్శిస్తున్నారన్నారు. రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల నాయకులు ఓసీకి వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఉలుకు, పలుకు లేకుండా ఉంటున్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఓసీని అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జంజర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ ఓసీలకు వ్యతిరేకమన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 17 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాలకు అనుమతి మంజూరు చేసి తన నైజాన్ని చాటుకుందని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలను బొం దల గడ్డగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కుటిల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాదికి రెండు పంటలు పండే పొలాలను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఓసీపీల వల్ల 23 గ్రామాలు చితిమంటలు వెలిగించబోతున్నాయన్నారు. ప్రజాకళా మండ లి కళాకారులు చైతన్య గీతాలు అలపించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకురాలు స్వాతి, ప్రజాకళా మండలి రాష్ట్ర గాయకుడు ఆశన్న, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పార్వతిరాజిరెడ్డి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, టీఫీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవి సత్యం పాల్గొన్నారు. సోమగూడెం వారసంతలో ప్రచారం కాసిపేట మండలంలో నిర్వహించిన బస్సుయూత్రలో భాగంగా సోమగూడెం వారసంతో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోమగూడెంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుబ్బగూడెం, కాసిపేట గ్రామాల్లో బస్సుయాత్ర సాగింది. ఆదివారం ఇందారంలో ప్రారంభమైన బస్సుయాత్ర నెన్నెల, మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, కాసిపేట లో కొనసాగి మంగళవారం ఎర్రగుంటపల్లికి చేరుకోనుంది.