Oral orders
-
మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ గుజరాత్‌కు చెందిన సలీమ్‌భాయ్ హమీద్‌భాయ్ మీనన్ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదంటూ గుజరాత్ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్ చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి. మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్‌ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్‌ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆశారాంకు జైల్లోనే చికిత్స లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది. -
‘పంచాయతీ’ జేబులకు కత్తెర
గ్రామ పంచాయతీల నిధులను తమ హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ వేస్తోంది. కేంద్రం ద్వారా మంజూరైన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకునేందుకు యత్నిస్తోంది. అంగీకరించని సర్పంచ్ల ‘చెక్‌పవర్’ రద్దు చేస్తామంటోంది. రాష్ట్రంలో సగానికిపైగా గ్రామపంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న నేపథ్యంలో వాటి నిధుల ఖర్చును పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ ఎత్తుగడ వేస్తోంది. మీ సొమ్ము... మాకివ్వండి * లేదంటే... సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు * పంచాయతీలకు ప్రభుత్వం హుకుం * రూ. 500 కోట్లు హస్తగతం చేసుకునేందుకు మౌఖిక ఆదేశాలు * 73వ రాజ్యాంగ సవరణకు రాష్ట్ర సర్కార్ తూట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే ఇన్నాళ్లూ చూశాం. విచిత్రంగా చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మీ ఊళ్లో రోడ్లు వేస్తాం, గ్రామ పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులను మాకు బదిలీ చేయాలంటూ ఆదేశిస్తోంది. స్వచ్ఛందంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు రాని గ్రామ సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేస్తామంటూ స్వయంగా ఉన్నతాధికారుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు రూ.1,774 కోట్లు మంజూరు చేసింది. వాటిలో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడానికి టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 500- 600కు పైగా గ్రామ పంచాయతీల నుంచి అలా మంజూరైన నిధులను ప్రభుత్వం గుంజేసుకుంది. కేంద్రం పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా ఇప్పటికే విద్యుత్ బకాయిల పేరుతో వందల కోట్లను లాగేసుకుంది. విపక్ష సర్పంచ్‌లు ఉన్నందునే.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించిన కారణంగా కేంద్రం రెండేళ్లుగా గ్రామాలకు నిలిపివేసిన నిధులన్నింటినీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ. 1,774 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారున్న నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో నిధుల ఖర్చు పూర్తిగా తమ చేతుల్లో తీసుకోవడానికి చంద్రబాబు సర్కారు ఈ ఎత్తుగడ వేసింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను, అదే గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారితో చేయించడానికి సిద్ధమవుతోంది. లింకులు పెట్టి ఉన్న పథకానికీ మంగళం పంచాయతీ నిధులను తమ హస్తగతం చేసుకునేందుకు గ్రామాల్లో వంద శాతం ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేసింది. ‘ఉపాధి’ పథకంలో కేవలం కూలీలతో చేపట్టే పనులే కాకుండా వందశాతం ఆ పథకం నిధులతో గతేడాది వరకు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తిపలికి భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు సగం నిధులు ఇవ్వడానికి ముందుకొస్తేనే మిగిలిన సగం నిధులు ఉపాధి పథకం ద్వారా ఆయా గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలపాలంటూ ప్రభుత్వం జూన్ 18న జీవో నంబరు 58 జారీ చేసింది. వాస్తవంగా, ఆర్థిక సంఘం పేరుతో కేంద్రం గ్రామాలకు ఇచ్చే నిధుల ఖర్చుతోపాటు, 90శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరిగే ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు కేవలం పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. జీవో 58 ప్రకారం.. పై రెండు పథకాల ద్వారా పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను 50-50 శాతం కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కొత్త ఎత్తుగడ వేసింది. నిధులు మళ్లించాలంటూ ఒత్తిడి పంచాయతీలు 50 శాతం నిధులివ్వడానికి ముందుకొస్తే ప్రభుత్వం మరో 50 శాతం నిధులిచ్చి గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొదట గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 12,918 గ్రామాలు ఉండగా, అందులో దాదాపు 8వేల గ్రామాలు తీర్మానాలను ప్రభుత్వానికి అందజేశాయి. మిగిలిన గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకోవడం కోసం ఒక పక్క అధికారులు ఒత్తిడి తీసుకొస్తూనే.. మరో పక్క ఇప్పటికే తీర్మానం చేసిన గ్రామ సర్పంచ్‌లు తక్షణమే కేంద్రమిచ్చిన నిధులను రోడ్ల నిర్మాణం కోసం తమకు మళ్లించాలంటూ ఒత్తిడి మొదలుపెట్టారు. దీనిపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోందంటే... ♦ రాజ్యాంగ సవరణ మేరకు గ్రామ పంచాయతీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. గ్రామ పంచాయతీలకు పన్ను రూపేణా వచ్చే ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపేణా గ్రామాలకు కేటాయించిన నిధులు పంచాయతీల సాధారణ నిధి (జనరల్ ఫండ్)కి జమవుతాయి. ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడంలో అధికారం పూర్తిగా ఆ గ్రామాల పంచాయతీలకే ఉంటుంది. ♦ ఈ నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోరాదు. ♦ అత్యవసర సందర్భాల్లోనూ పంచాయతీలతోనే ఖర్చు చేయించాలి. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కానీ, నిధులను తన అధీనంలోకి తీసుకోకూడదు. ♦ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 29 అధికారాలను గ్రామ పంచాయతీలకే పూర్తిగా బదిలీ చేయాలి. -
బంద్‌లపై నిర్బంధం!
ఓటుకు నోటు నేపథ్యంలో పోలీసులకు మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతూ.. ఇందుకు ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్న ఆరోపణలతో ప్రతిష్ట దిగజారుతుండటంతో దీన్నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. బాబు తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు భారీ స్థాయిలో చేపడుతున్న నిరసనలతో వాస్తవాలు ప్రజలకు చేరతాయనే ఉద్దేశంతో అవి విజయవంతం కాకుండా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ నిర్బంధం పెంచనుంది. జిల్లా ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా నిరసనలు, బంద్ వంటివి విజయవంతమైతే అందుకు స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్నీ బాధ్యుల్ని చేస్తామంటూ హెచ్చరించింది. అసాధారణ పరిస్థితుల్లో మినహా ఈ తరహా నిరసనలకు సాధారణంగా అనుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం చంద్రబాబుకు, సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి ఎవరైనా అనుమతులు కోరితే.. వివిధ కారణాలను సాకుగా చూపి అనుమతులు నిరాకరించాలని పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులిస్తే ఆయా పార్టీ శ్రేణులు మినహా సాధారణ ప్రజలు ఆయా నిరసనల్లో పాలు పంచుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎవరైనా బంద్‌కు పిలుపునిస్తే ఆయా ప్రాంతాల్లో బంద్‌కు నేతృత్వం వహించే, చురుకుగా పాల్గొనే వారిని ముందస్తు అరెస్టులు చేయాలని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఆందోళనలపై కేసులు డోన్: ఓటుకు కోట్ల వ్యవహారంలో చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములుతో పాటు 10 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున కోట్రికె హరికిషన్, బి.ప్రసాద్, కేడీ ప్రభాకర్, మొలకన్న, సుదర్శన్‌రెడ్డి, రంగస్వామి గౌడ్లను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ బెయిల్‌కు అనుమతించారు. ఆదోనిలో 25 మందిపై : ఆదోని పాతబస్టాండ్ సర్కిల్లో ఆందోళన చేశారంటూ పోలీసులు 25 మందిపై కేసు నమోదు చేశారు. -
వైద్య శాఖ ఓఎస్డీ సంపత్ తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య పేషీలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్‌ను తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించుకోవాలని ఆదేశించింది. ఆయనను తొలగించనున్నట్లు ‘సాక్షి’ శుక్రవారం సంచికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్హెచ్ఎంలో ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందన్న సాక్ష్యాలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనేక విభాగాల్లో జోక్యం చేసుకొని సమీక్షలు చేయడం, ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు అందిన ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆయనపై వేటు వేసింది. మరో ఓఎస్డీపైనా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం దీన్ని ధ్రువీకరించడంలేదు. -
ఆ గ్రామ పంచాయతీల నోరునొక్కే యత్నం!
వ్యతిరేక తీర్మానాలను ‘మినిట్స్’లో రాయొద్దు! ‘భూ సమీకరణ’ గ్రామ పంచాయతీలకు సర్కారు హుకుం సాక్షి విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరపడానికి తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఎంపిక చేసిన 17 గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. భూ సమీకరణకు వ్యతిరేకంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తీర్మానం చేసినా ఆ విషయాన్ని మినిట్స్ బుక్‌లో రాయొద్దని పంచాయతీ ఈఓలకు ఆదేశాలు జారీచేసింది. భూ సమీకరణకు ఎంపిక చేసిన అనేక గ్రామాల్లో రైతులు తాము భూములు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటై తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పంచాయతీ చట్ట ప్రకారం ఏర్పడిన గ్రామం చట్ట సభ కావడంతో ఇందులో కూడా తీర్మానం చేసి.. వాటిని సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా నిడమర్రు పంచాయతీ పాలకవర్గ సమావేశంలో భూ సమీకరణను తమ గ్రామంలోని రైతులు వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీన్ని మినిట్స్ బుక్‌లో రాశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి మీద ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సమీకరణకు ఎంపిక చేసిన గ్రామాలతో పాటు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, అమరావతి, దుగ్గిరాల మండలాల్లోని అన్ని పంచాయతీల్లో ఇలాంటి తీర్మానాలను అధికారికంగా నమోదు చేయొద్దని మౌఖిక ఆదేశాలు జారీ ఆయ్యాయి. తుళ్లూరు మండలంలోని రాయపూడి పంచాయతీ సర్వసభ్య సమావేశం కూడా భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఆ పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మినిట్స్ లో రాయలేదు. పంచాయతీ సమావేశాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే ఎవరైనా న్యాయపోరాటానికి దిగితే చిక్కులు వస్తాయనే ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.