Orey Bammardhi Movie
-
OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్య కాలంలో థియేటర్లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి బడా మూవీలు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం! కలెక్టర్‌గా సాయితేజ్ ‘రిపబ్లిక్’ మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. బైక్ రైడర్స్ ఇదే మా కథ శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’.గురు పవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు ఎలా పరిచయమవుతారు? అనుకున్న గమ్యానికి వీరు చేరుకున్నారా అన్నదే సినిమా కథ. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆహాలో ‘ఒరేయ్ బామ్మర్ది’ సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ఇది వరకే రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. అక్టోబర్1 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ► డయానా (అక్టోబర్1) ► నో వన్ గెట్స్ అవుట్ ఎలైవ్ ( సెప్టెంబరు 29) ► ద గల్టీ( అక్టోబరు 1) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► షిద్ధత్ -అక్టోబరు 1 ► లిఫ్ట్- అక్టోబరు 1 అమెజాన్ ప్రైమ్ ► చెహ్రే (సెప్టెంబరు 30) ►బింగ్ హెల్(అక్టోబరు 1) ►బ్లాక్ ఆజ్ నైట్(అక్టోబరు 1) జీ5 ► బ్రేక్ పాయింట్ (అక్టోబరు 1) -
సినిమా జాతర మొదలైంది... ఈ వారం ఏకంగా 9 చిత్రాలు విడుదల
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో, థియేటర్స్ కి మెల్ల మెల్లగా పూర్వవైభవం వస్తోంది. కరోనా భయాన్ని వదిలి ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తుండటంతో నిర్మాతలు కూడా ఎలాంటి సందేహం లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. గత శుక్రవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మిగతా చిత్రాలు పర్వాలేదనిపించాయి. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వస్తుండడంతో నిర్మాతలు పోటీపడి మరీ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం(ఆగస్ట్ 13) అయితే ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో సుందరి, బ్రాందీ డైరీస్, సలాం నమస్తే, చైతన్య, రావే నా చెలియా, ఒరేయ్ బామర్ది, ది కంజూరింగ్ 3 ఉన్నాయి. శనివారం(ఆగస్ట్ 14) విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ సినిమా విడుదలవుతోంది. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైతన్న సినిమా కూడా శనివారమే వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. మరి ఈ వారం బాక్సాఫీస్ బరిలో ఎవరు నిలుస్తారో చూడాలి. -
అలా ‘ఒరేయ్ బామ్మర్ది’ కథ మొదలైంది: శశి
‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా సినిమాకు పనిచేసే ఒక రచయితను నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే ఆయన ఈ మధ్యే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య చిన్న తమ్ముడు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా తమ్ముడి కంటే ఈ బావమరిది తోనే నేను ఎక్కువ చనువుగా ఉంటాను, అతను ఎవరు చెప్పింది విన్నా వినకున్నా, నా మాట మాత్రం తప్పకుండా వింటాడు, కొడుకు, తమ్ముడు, ఫ్రెండ్ అన్నీ వాడే నాకు అని చెప్పాడు. ఆ రిలేషన్ నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒరేయ్ బామ్మర్ది సినిమా కథకు నా మనసులో ఆలోచన మొదలైంది’అన్నాడు దర్శకుడు శశి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం‘ఒరేయ్ బామ్మర్థి’.సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్ లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మీడియాతో మాట్లాడుతూ.. సివప్పు మంజల్ పచ్చై అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు డబ్ వెర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఒరేయ్ బామ్మర్ది కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు. బావమరిది క్యారెక్టర్ లో జీవీ ప్రకాష్ కుమార్ ని తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని అన్నాడు.