Ori Devudoy
-
’ఓరి దేవుడోయ్’ టీంతో చిట్‌చాట్
-
సాలూరి వారసుడి...సోషియో ఫ్యాంటసీ
ఆ యువకుడు మంచి సంపాదనపరుడు. చీకూ చింతా లేని అతని జీవితం చిక్కుల్లో పడుతుంది. తన సమస్యలతో పాటు ఇతరుల సమస్యలను పరిష్కరిస్తాడు.ఆ యువకుడు ఎందుకు సమస్యల్లో పడతాడు? ఆ సమస్యలేంటి? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘ఓరి దేవుడోయ్’. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు మనుమడు, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరు కథానాయకునిగా శ్రీరామ్ వేగరాజు దర్శకత్వంలో ఛేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్.వి నిర్మించారు. మదిరాక్షి, మోనికా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఇప్పటివరకూ రాని కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొం దించాం. యువతలో సృజనాత్మకత మెండుగా ఉందనీ, వారు అనుకుంటే ఏ స్థాయికి అయినా చేరుకోగలరని చెప్పే చిత్రం ఇది. రాజీవ్ అద్భుతంగా నటిం చాడు. కోటిగారు స్వరపరచిన పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలు స్తాయి. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. సుమన్, తనికెళ్ల భరణి, సీనియర్ నరేశ్, ఎల్బీ శ్రీరామ్, కొండవలస తదితరలు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రతాప్ కుమార్, మాటలు: చేబియ్యం శ్రీనివాసన్ , సహనిర్మాత: మాధురి వేగరాజు. -
'ఓరి దేవుడోయ్' ఆడియో ఆవిష్కరణ
-
అమెరికాలో 'ఓరి దేవుడోయ్' పాటలు కంపోజింగ్
ప్రవాసాంధ్రుడు శ్రీరామ్ వేగిరాజు దర్శకత్వంలో 'ఓరి దేవుడోయ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. రాజీవ్ సాలూరి కథానాయకుడిగా ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ఇటివలే అమెరికాలో పాటల కంపోజింగ్ పూర్తి చేశారు. అమెరికాకు చెందిన మ్యుజీషియన్స్ తో 6 పాటలను, థీమ్ స్కోర్ ను కోటి కంపోజ్ చేశారు. -
అమెరికాలో ఓరి దేవుడోయ్
అమెరికాలో సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ఓ తెలుగు చిత్రానికి పాటల కంపోజింగ్ జరిగింది. ఆ సినిమా పేరు ‘ఓరిదేవుడోయ్’. ప్రవాసాంధ్రుడు శ్రీరామ్ వేగిరాజు దర్శకత్వంలో రాజీవ్ సాలూరి హీరోగా, ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ -‘‘ఇది సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అమెరికాకు చెందిన మ్యుజీషియన్స్‌తో 6 పాటలను, థీమ్ స్కోర్‌ను కోటి కంపోజ్ చేశారు. ఈ పాటలు ఫ్రెష్ ఫీల్‌తో శ్రోతలను ఆకట్టుకుంటాయి’’ అని చెప్పారు. నిర్మాత వి.రవిశంకర్ మాట్లాడుతూ -‘‘మా దర్శకుడు శ్రీరామ్ గతంలో ‘డిస్టాంట్ బీట్స్’ అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు, లాస్ఏంజిల్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో పురస్కారం కూడా సాధించారు. ‘ఓరి దేవుడోయ్’ షూటింగ్ ఈ నెలాఖరున మొదలుపెడతాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అని తెలిపారు.