Ourmine
-
ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ కూడా శనివారం హ్యాకింగ్‌కు గురయింది. ఇటీవలే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల సోషల్ మీడియా అకౌంట్లను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసి, అదే అకౌంట్లో హ్యక్ చేసినట్టు వెల్లడించింది. జాక్ డార్సీ ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. -
అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..!
కోరా అకౌంట్‌ను హ్యాక్ చేసిన అవర్‌మైన్ న్యూయార్క్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు చెందిన కోరా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ చర్యకు పాల్పడింది ఎవరో కాదు.. ఇది వరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ట్వీటర్, పింటరెస్ట్ అకౌంట్లను హ్యాక్ చేసిన ‘అవర్‌మైన్’ సంస్థే మళ్లీ ఇప్పుడు పిచాయ్ అకౌంట్‌నూ హ్యాక్ చేసింది. ఈ సంస్థ పిచాయ్ అకౌంట్ ద్వారా ఆయనకు తెలియకుండానే కోరాలో పలు మెసేజ్‌లను పోస్ట్ చేసింది. కోరా అకౌంట్ ట్వీటర్‌తో కూడా అనుసంధానమై ఉండటంతో అవర్‌మైన్ చేసిన పోస్టులన్నీ.. పిచాయ్కున్న 5,08,000 మంది ఫాలోవర్స్‌కు వెళ్లాయి. అవర్‌మైన్ సంస్థ తొలిగా ‘హ్యాక్డ్’ అని పోస్ట్ చేసింది. తర్వాత మీ సెక్యూరిటీ లెవెల్స్‌ను పరీక్షించడానికే హ్యాక్ చేశామని తరువాతి పోస్ట్‌లలో పేర్కొంది. పిచాయ్ టీమ్ కోరా అకౌంట్‌ను తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. తదనంతరం అకౌం ట్లోని అవర్‌మైన్ పోస్ట్‌లను తొలగించారు. కాగా అవర్‌మైన్ సంస్థ టెక్ దిగ్గజాల అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తోందనేది ఇప్పటిదాకా వెల్లడి కాలేదు.