Over subscribe
-
ఓఎన్జీసీ ఓఎఫ్ఎస్కి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్ఎస్ కింద ఓఎన్జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్ ఫర్ సేల్కు నాన్–రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. షేరు 5 శాతం డౌన్.. ఓఎఫ్ఎస్ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. -
పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్ సబ్‌స్క్రైబ్ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. నవంబర్ 15న షేర్లను అలాట్ చేయనుండగా, 18న లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్ ఇండియాను మించిన ఇష్యూ.. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్ శేఖర్ శర్మ 2000లో వన్97 కమ్యూనికేషన్స్‌ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్ రీచార్జి, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్‌కు 1.07 రెట్ల స్పందన న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజా హట్ అవుట్‌లెట్స్ నిర్వహణ సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్ వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్ ఫుడ్స్ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్ ఫుడ్స్ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. -
మజగావ్ డాక్ లిస్టింగ్ అదరహో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ.145తో పోల్చితే 49 శాతం లాభంతో రూ. 216 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. చివరకు 19 శాతం లాభంతో రూ. 173 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,489 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 36 లక్షలు, ఎన్ఎస్ఈలో 4 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. పేలవంగా యూటీఐ ఏఎమ్‌సీ లిస్టింగ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయ్యాయి. బీఎఎస్‌ఈలో యూటీఐ ఏఎమ్‌సీ షేర్ ఇష్యూ ధర రూ. 554తో పోల్చితే 12 శాతం నష్టంతో రూ.490 వద్ద లిస్టయింది. ఇంట్రడేలో 15 శాతం నష్టంతో రూ. 471 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 14 శాతం నష్టంతో రూ. 477 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,043 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 13.7 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీఓ 2.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. -
హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో.. భలే రెస్పాన్స్
డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలందించే హ్యాపీయెస్ట్ మైండ్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(9న) ముగియనుంది. సోమవారం ప్రారంభమైన ఇష్యూ నేటి మధ్యాహ్నానికల్లా 34 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 2.3 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 79.44 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ విభాగంలో 50 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 80 రెట్లు అధికంగా స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 6 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఇతర వివరాలు.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 165-166కాగా.. రూ. 702 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ముఖ విలువ రూ. 2కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్ 90 షేర్లుగా నిర్ణయించారు. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షలకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా కంపెనీ తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన సీఎండీబీ-2 తమకున్న 19.4 శాతం వాటా(2.72 కోట్ల షేర్లకుపైగా) విక్రయించనుంది. ప్రమోటర్ అశోక్ సూతా 84.14 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఐటీ సర్వీసుల రంగం నుంచి ఇంతక్రితం 2016లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా హ్యాపీయెస్ట్ మైండ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 316 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 166 ధరలో 1.9 కోట్ల షేర్లను జారీ చేసింది. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ పీటీఈ, ఎవెండస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్ తదితర 25 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి అనధికార(గ్రే) మార్కెట్లో 50 శాతం ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు 10 రెట్లు స్పందన
న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 10.5 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. బుధవారం ఆఫర్ ముగిసే సమయానికి రూ. 46,298 కోట్ల విలువైన బిడ్స్‌ను కంపెనీ ఆకర్షించగలిగింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన రూ. 1,635 విలువైన షేర్లతో కలుపుకుంటే ఆఫర్ అందుకున్న బిడ్స్ విలువ రూ. 47,933 కోట్లకు చేరుతుంది. 10 లక్షలకుపైగా దరఖాస్తులు రావడం విశేషం. రూ. 300-334 ప్రైస్‌బ్యాండ్‌తో రూ. 6,057 కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈ ఆఫర్ జారీచేసింది. 2010లో వచ్చిన రూ. 15,000 కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూ తర్వాత ఇదే పెద్ద ఐపీఓ. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా 11.83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్‌కాగా, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 28.55 రెట్ల స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా మాత్రం 1.37 రెట్లు మాత్రమే ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్హోల్డర్లకు కేటాయించిన కోటాకు 12.20 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది.