p ashok gajapathi raju
-
గన్నవరం-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం
గన్నవరం: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఎయిరిండియా రెండో విమాన సర్వీసు మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోకగజపతిరాజు గురువారం ఉదయం సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు 14 మంది ప్రయాణికులతో విమానం గన్నవరం చేరుకుంది. విజయవాడ, బందరు, ఏలూరు ఎంపీలు కేశినేని శ్రీనివాస్(నాని), కొనకళ్ల నారాయణరావు, మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం 10 గంటలకు ఎంపీ కొనకళ్లతో సహా 30 మందితో విమానం తిరిగి న్యూఢిల్లీ వెళ్లింది. ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్ మాట్లాడుతూ ఈ విమానం ప్రతిరోజు ఉదయం 6.20 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 8.25 గంటలకు గన్నవరం చేరుకుంటుందని చెప్పారు. తిరిగి 9 గంటలకు బయలుదేరి 11.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని వివరించారు. -
పైడితల్లి ఉత్సవంలో అశోక్‌గజపతి రాజుకు అవమానం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి. అశోక్‌గజపతి రాజుకు సొంత ఇలాకా విజయనగరంలో మంగళవారం అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్‌గజపతి రాజు ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. అయితే దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో తొలిసారిగా 144 సెక్షన్ అమల్లో ఉండగా సిరిమానోత్సవం జరుగుతోంది. అయితే విజయనగరంలో పోలీసు ఆంక్షల నేపథ్యంలో గతేడాది కంటే సిరిమానోత్సవానికి హాజరయ్యే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.