paan masala
-
హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు: అజయ్ దేవగణ్
Ajay Devgn Reaction Controversy Pan Masala Ad: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మాసాల ప్రకటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలైన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్‌తో కలిసి అక్షయ్ ఈ ప్రకటనలో నటించాడు. తాజాగా అక్షయ్ ఈ యాడ్ ఎండార్స్మెంట్ వివాదంపై అజయ్ దేవగన్ స్పందించాడు. ఆయన తాజాగా నటించిన ‘రన్‌వే 34’ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ భాగంగా అజయ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాన్ మాసాల ఎండార్స్మెంట్ వివాదంపై, అక్షయ్ దీని నుంచి తప్పుకోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ‘నేను దీనిపై పెద్ద మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటనల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరికి తమకు తాముగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే అదే సమయంలో అది హానికరమా? కాదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కొన్ని హానికరమైనవి ఉండోచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే ‘ఇది మాత్రమే కాకుండా హాని కలిగించే ఉత్పత్తులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా వాటిని నేను ప్రమోట్ చేయాలనుకోవడం లేదు. అయితే నేను చేసింది ఎలైచి బ్రాండ్ యాడ్ మాత్రమే’ అని సమాధానం ఇచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు అనంతరం ఇదంతా పక్కన పెడితే ఈ ప్రకటనలు అనేవి పెద్ద విషయం కాదనేది తన అభిప్రాయమని, మరి అవి అంతటి హానికరమైన ఉత్పత్తులు అయితే.. వాటిని విక్రయించకూడదని అజయ్ అభిప్రాయ పడ్డాడు. అవి హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కాగా అజయ్ దేవగన్ ఎంతో కాలంగా ఇదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ ఈ యాడ్‌లో నటించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఉత్పత్తులను తమ అభిమాన నటుడు ప్రమోట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అక్షయ్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అవి చూసిన అక్షయ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుందని అక్షయ్ స్పష్టం చేశాడు -
సారీ, ఇకపై అలాంటి పనులు చేయను: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌పై గత కొద్దిరోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే! పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు ఫ్యాన్స్ సైతం అతడిపై గుర్రుగా ఉన్నారు. మా నమ్మకాన్ని వమ్ము చేశావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్షయ్ కుమార్ ఓ మెట్టు దిగాడు. అలాంటి ప్రకటనలో నటించినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. 'అభిమానులు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. గత కొద్దిరోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా కదిలించి వేసింది. నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను కూడా! మీ భావోద్వేగాలను నేను గౌరవిస్తున్నాను. బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నాను. ఆ ప్రకటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తాను. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది. కానీ ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించనని మాటిస్తున్నాను' అంటూ సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశాడు. 🙏🏻 pic.twitter.com/rBMZqGDdUI — Akshay Kumar (@akshaykumar) April 20, 2022 చదవండి: రీమేక్ సినిమాలపై ఓ కన్నేసిన తెలుగు హీరోలు ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత
పాట్నా: పాన్ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి పాన్ మసాలా (గుట్కా) అప్పుగా ఇవ్వాలని కోరగా దుకాణ యజమాని నిరాకరించాడు. దీంతో దుకాణ యజమానితో అతడు గొడవ పడ్డాడు. అప్పుగా పాన్ మసాలా ఇవ్వకపోవడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ సందర్భంగా అదే కోపంతో తెల్లారి వచ్చి ఆ దుకాణంపై దాడి చేశాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో త్రివేణిగంజ్‌కు చెందిన అజిత్‌కుమార్ రౌడీ. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్‌కు వచ్చాడు. బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 విలువ చేసే పాన్ మసాలా అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అయితే దుకాణంలో ఉన్న యజమాని ఇవ్వను అని తేల్చిచెప్పాడు. కొద్దిసేపు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడితో వాగ్వాదం చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు సర్ది చెప్పడంతో అజిత్ వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సోమవారం తన అనుచరులతో దుకాణం వచ్చాడు. దుకాణంలో ఉన్న యజమాని చిన్న కుమారుడు మిథిలేశ్‌తో మళ్లీ పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన అజిత్ కుమార్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన మిథిలేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి సమీపంలో ఉన్న మిథిలేశ్ అన్న పరుగెత్తుకుంటూ రావడంతో త్రివేణి సింగ్, అతడి అనుచరులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను తాము గుర్తించినట్లు.. త్వరలోనే వారిని పట్టుకుంటామని సుపాల్ జిల్లా పోలీస్ అధికారి షేక్ హసన్ తెలిపారు. -
సీఎం కారు డ్రైవర్‌కు జరిమానా
లక్నో: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా జరిమానా కట్టాల్సింది. అది స్వయానా ముఖ్యమంత్రి డ్రైవర్ అయినా సరే. విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారు డ్రైవర్ రూ.500 జరిమానా చెల్లించాడు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో అతడు పాన్ మసాలా నమలడంతో అతడు ఈ ఫైన్ కట్టాడు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కారు డ్రైవరే పాన్ మసాలా నములుతూ దొరికిపోయాడు. సీఎం పీఠం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ...అధికారులను పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. యూపీ సచివాలయాన్ని సందర్శించిన ఆయన ఆ గోడలపై పాన్ మరకలు ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాన్ మసాలా వంటివాటిని నమల వద్దని, ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. -
పాన్, గుట్కాలపై యోగి నిషేధం
ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే యోగి ప్రకటించారు.