
గత కొద్దిరోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా కదిలించి వేసింది. నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను కూడా! మీ భావోద్వేగాలను నేను గౌరవిస్తున్నాను. బ్రాండ్ అంబాసిడర్‌గా..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌పై గత కొద్దిరోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే! పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు ఫ్యాన్స్ సైతం అతడిపై గుర్రుగా ఉన్నారు. మా నమ్మకాన్ని వమ్ము చేశావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్షయ్ కుమార్ ఓ మెట్టు దిగాడు. అలాంటి ప్రకటనలో నటించినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
'అభిమానులు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. గత కొద్దిరోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా కదిలించి వేసింది. నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను కూడా! మీ భావోద్వేగాలను నేను గౌరవిస్తున్నాను. బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నాను. ఆ ప్రకటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తాను. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది. కానీ ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించనని మాటిస్తున్నాను' అంటూ సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశాడు.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022