padha yathra
-
ముగిసిన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. కాంగ్రెస్‌లో సరికొత్త జోష్
సాక్షి, ఖమ్మం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసింది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్రలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..108 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. సొంత జిల్లా అయిన ఖమ్మంలో శనివారంతో ముగిసింది. జూలై 2న జరగబోయే కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారు. కాగా 108 రోజుల భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్‌లో సరికొత్త ఊపు తీసుకువచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెద్దఎత్తున యువతకులు, మహిళలు పాల్గొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడడంతోపాటు ఇతర పార్టీల నాయకులు చెయ్యి అందుకోవడానికి సిద్ధమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జనలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండటమే ఇందుకు నిదర్శనం. చదవండి: నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
ఎమ్మెల్యే పాదయాత్ర
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన సోదరుడు బుడ్డా శేషారెడ్డితో కలిసి బుధవారం సిద్ధాపురం చెరువు నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు దాదాపు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో పది గ్రామాల ప్రజలు పాల్గొ న్నారు. ఉద్యమాలతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సాధించి, రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆత్మకూరు: ఉద్యమాలతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సాధించి, రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ పథకం పనులను పరిశీలించేందుకు తన సోదరుడు బుడ్డా శేషారెడ్డితో కలిసి బుధవారం సిద్ధాపురం చెరువు నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు దాదాపు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రకు విశేష స్పందన లభించిందని, వందల సంఖ్యలో రైతులు తన వెంట తరలివచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2006లో రూ. 80 కోట్లు నిధులను మంజూరు చేశారన్నారు. నల్లకాల్వ గ్రామం వద్ద ఈ పథకం మంజూరు చేస్తూ భూమిపూజ కూడా చేశారని గుర్తు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ పథకం నేటికి పూర్తి కాలేదన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో వందల క్యూసెక్కుల నీరు ఉన్నా రైతులు వినియోగించుకోలేని స్థితి దుస్థితిలో ఉన్నారని, ఇదంతా పాలకుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామినిచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తానన్నారు. ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయాయి, కారణాలు ఏమిటి, ఈ పథకం ఎలా పూర్తి చేయాలి, తదితర అన్ని విషయాలపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. ఈ పథకం పూర్తి చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తునే ఉంటానని చెప్పారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి తన తండ్రి స్వర్గియ బుడ్డా వెంగళరెడ్డి, తన సోదరుడు స్వర్గీయ బుడ్డా సీతారామిరెడ్డిలు నిరంతర కృషి చేశారన్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడుపై ఈ పథకం ప్రారంభించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తు చేశారు. ఈ పథకం పూర్తి చేసే వరకు అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి రైతులతో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ పథకాన్ని పూర్తి చేస్తే 13 గ్రామాలకు చెందిన 21 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాదయాత్రలో మాజీ మార్కెట్‌యార్డు చెర్మైన్లు పాండురంగచౌదరి, తిరుపమయ్యలు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర
విడవలూరు, న్యూస్‌లైన్: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు. తొలుత మండలంలోని తీర ప్రాంత పంచాయతీ రామచంద్రాపురం నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. పాదయాత్ర ఇలా రామచంద్రాపురం పంచాయతీలోని పొన్నపూడి పెదపాళెంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్తూరు, దళితవాడ, లక్ష్మీపురం, ప్రశాంతగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుసిగాడిపాళెం, గిరిజనకాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రాపురం వరకు సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలు ఆయన తెలుసుకుంటారు. 15వ తేదీ మండలంలోని దండిగుంట, వరిణి, వీరారెడ్డిపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో పాదయాత్ర సాగుతుంది. 16, 17, 18వ తేదీల్లో కోవూరు , 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాళెం , 24, 25 తేదీల్లో కొడవలూరు , 26, 27, 28 తేదీల్లో ఇందుకూరుపేట మండలాల్లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. -
జనంతో మమేకం
సాక్షి, నె ల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం నాటికి వారంరోజులు పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఆయన 110 కిలోమీటర్లు నడిచారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. పాదయాత్రకు సంకల్పించిన గౌతమ్‌రెడ్డి ఈ నెల 22న ఏఎస్‌పేట మండలం హసనాపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు నుంచి ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామగ్రామాన పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు గౌతమ్‌రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్నారు. తొలుత ఏఎస్ పేట మండలంలో 7 గ్రామ పంచాయతీల్లో 18 గ్రామాల పరిధిలో ఈ పాదయాత్ర జరిగింది. అనంతరం ఆత్మకూరు మండలంలో రెండు పంచాయతీల్లో, మర్రిపాడు మండలంలో 6 గ్రామ పంచాయతీల్లో యాత్ర కొనసాగింది. శనివారం నాటికి యాత్ర చిన్నమాచనూరుకు చేరుకుంది. మొత్తం మీద శనివారం నాటికి 30 గ్రామాల పరిధిలో 110 కిలోమీటర్ల యాత్రను గౌతమ్‌రెడ్డి పూర్తిచేశారు. యాత్ర సందర్భంగా ప్రజలు ఆయా గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సమస్య, విద్యాలయాల్లో గదుల కొరత తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌతమ్‌రెడ్డి దృష్టి సారించారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. చాలాచోట్ల పంటలకు నీరు అందని విషయాన్ని రైతులు ఆయనకు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పొగాకు రైతుల అవసరాలను తెలుసుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో రైతాంగంతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వపరంగా అందిన సహాయాన్ని,సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి వివరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గౌతమ్‌రెడ్డి యాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు. జనంతో మమేకమవుతూ సాగుతున్న గౌతమ్ యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డిపై వెల్లువెత్తిన ప్రజాదరణ చూసి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాదరణ మరువలేనిది: మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, వారి ఆదరణ మరువలేనిదని మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. వారంలో వందరోజుల పాదయాత్రను పూర్తిచేసిన గౌతమ్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్ కుటుంబంపై ప్రజాభిమానం చెక్కుచెదరనిదన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనను నియోజకవర్గ ప్రజలు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారన్నారు. సోమశిల నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడ కోట్ల నిధులు కుమ్మరిస్తున్నా.. అవి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయే తప్పా ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మూడునెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
మరో ఘట్టానికి అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు కోసం తానున్నానంటూ మహానేత తనయ షర్మిల ముందుకొస్తోంది.మరో ఘట్టానికి అంకురార్పణ చేయనుంది. సెప్టెంబర్ 2నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. జగనన్న బాణమై మరోమారు కుటిల రాజకీయాలను ఎండగట్టనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమించనున్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3112 కిలో మీటర్ల పాదయాత్రను ఇటీవల షర్మిల చేపట్టారు. గత ఏడాది అక్టోబర్18న ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం 230 రోజులు పాటు సాగింది. ప్రపంచ చరిత్రలో ప్రజాపోరాటాలు చేసిన మహిళామణులు ఎందరో ఉన్నా ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర ఎవరూ చేయలేదు. కుట్రలతో మహానేత తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్న ప్రజానీకంలో స్త్యైన్ని నింపేందుకు షర్మిల పాదయాత్ర చేపట్టి సఫలీకృతమయ్యారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుండటంతో మరోమారు బస్సు యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం మహానేత వైఎస్సార్ వర్ధంతి రోజున ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుని బస్సుయాత్రను కొనసాగించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కారకులైన కాంగ్రెస్, అందుకు తోడ్పాటుగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీలను ఎండగడుతూ ప్రజల పక్షంగా ఉద్యమంచనున్నారు. రాష్ట్ర విభజన చేపట్టరాదని, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజానీకం మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు.