సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు కోసం తానున్నానంటూ మహానేత తనయ షర్మిల ముందుకొస్తోంది.మరో ఘట్టానికి అంకురార్పణ చేయనుంది. సెప్టెంబర్ 2నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. జగనన్న బాణమై మరోమారు కుటిల రాజకీయాలను ఎండగట్టనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమించనున్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3112 కిలో మీటర్ల పాదయాత్రను ఇటీవల షర్మిల చేపట్టారు. గత ఏడాది అక్టోబర్18న ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం 230 రోజులు పాటు సాగింది. ప్రపంచ చరిత్రలో ప్రజాపోరాటాలు చేసిన మహిళామణులు ఎందరో ఉన్నా ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర ఎవరూ చేయలేదు. కుట్రలతో మహానేత తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్న ప్రజానీకంలో స్త్యైన్ని నింపేందుకు షర్మిల పాదయాత్ర చేపట్టి సఫలీకృతమయ్యారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుండటంతో మరోమారు బస్సు యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం మహానేత వైఎస్సార్ వర్ధంతి రోజున ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుని బస్సుయాత్రను కొనసాగించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కారకులైన కాంగ్రెస్, అందుకు తోడ్పాటుగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీలను ఎండగడుతూ ప్రజల పక్షంగా ఉద్యమంచనున్నారు. రాష్ట్ర విభజన చేపట్టరాదని, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజానీకం మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు.
మరో ఘట్టానికి అంకురార్పణ
Published Sun, Sep 1 2013 4:09 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement