పాలవాయిలో చిరుత కలకలం
కల్యాణదుర్గం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాయివాయిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం ఓ చిరుత, ఆవుల మందపై దాడిచేసింది. ఈ ఘటనలో రెండు ఆవు దూడలు మృతి చెందాయి. చిరుత సంచారం సమాచారం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చర్య తీసుకోవాలని అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.