Palghar district
-
పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు..
ఇటీవలి కాలంలో లివింగ్ పార్ట్నర్స్ దారుణ హత్యకు గురవుతున్న వార్తలు చాలానే చూశాం. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం, దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఆమె డెడ్‌బాడీని సూటుకేసులో పెట్టి బయటపడేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సినీ మేకప్ ఆర్టిస్ నైనా మహత్(29)కు మనోహర్ శుక్లా(43)తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో శారీరకంగా కూడా వీరద్దరూ దగ్గరయ్యారు. అయితే, మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి వ్యవహరం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు.. తన బంధాన్ని కొనసాగించారు. నైనా ఫోన్ ఆఫ్.. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో.. నైనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేసింది. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆఫ్ రావడంతో నైనా కుటుంబ సభ్యులు ఆగస్టు 12వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. నైనా ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు. గుజరాత్ సరిహద్దుల్లో డెడ్‌బాడీ.. ఇక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నైనా లవర్ శుక్లాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి ఆమెకు బ్రేకప్ చెప్పినట్టు తెలిపాడు. కానీ.. ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే శుక్లాపై అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన టార్చర్ భరించలేకనే నైనాను చంపేసిన్నట్టు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం, నైనా డెడ్‌బాడీ ఉన్న సూట్‌కేసును పోలీసులు గుజరాత్ బోర్డర్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Manohar Shukla (43) KiIIed LIVE-IN Partner Naina Mahat (28) stuffed her body in SUITCASE & dumped her body in Gujrat with the help of his wife Shukla visited Naina's society but left the place with suitcase. It created suspicion Shukla said: Naina was forcing him to marry her pic.twitter.com/QAZVzmHeNf — Mohammad Nawaj (@NawazJ78) September 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె
పూణె: దసరా ఉత్సవాలు దేశమంతటా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయా సంప్రదాయాల రీత్యా డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అచ్చం ఇలానే ఆనందోత్సహంతో పండుగా చేసుకుంటూ ఒక వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...35 ఏళ్ల మనీష్ నీరాప్జీ సోనిగ్రా గ్లోబల్ సిటీలోని విరార్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న గర్బా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ రోజు రాత్రి ఆనందంగా చిందులేస్తూ ఉన్నటుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వ్యక్తి తండ్రి అతన్ని హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా... అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణ వార్త విన్న సదరు వ్యక్తి తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు) -
ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
-
అరే ఏంట్రా ఇది.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
ఫుట్ ఓవర్ బ్రిడ్జి... రద్దీ రోడ్లను దాటేందుకు ఇబ్బంది పడకుండా పాదచారులకోసం చేసే ప్రత్యేక ఏర్పాటు. కానీ.. మనవాళ్లు ఎలా ఉపయోగించారో చూడండి. అవును.. మీరు చూసింది నిజమే! ఆ బ్రిడ్జి మీదుగా ఆటో వెళ్తోంది. ‘ఇండియాలో ఇంతే!’ అనేలాంటి ఈ ఘటన మహారాష్ట్రలోని ఢిల్లీ–చెన్నైలను కలిపే జాతీయరహదారి 48పై పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఎస్‌యూవీలకు కూడా సాధ్యం కానీ ఆ ఫీట్ ఆటో ఎలా చేసింది? స్టెప్స్ ఎలా ఎక్కగలిగిందనే కదా మీ సందేహం. అక్కడ ర్యాంప్ సౌకర్యం ఉంది. రోడ్డు దాటాలనుకున్న డ్రైవర్ ర్యాంప్ ఎక్కించేసి తాపీగా ఫుట్ఓవర్ బ్రిడ్జిపైనుంచి రోడ్డును దాటేశాడు. ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఆ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబై పోస్టు చేసింది. ‘బస్ యహీ దేఖ్నా బాకీ తా’ అంటూ కోట్ చేసింది. ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా ఉపయోగిస్తారా?’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ‘అక్కడ మూడునాలుగు కిలోమీటర్ల వరకు క్రాసింగ్ లేదు. చిన్న చిన్న వాహనాలు అలాగే దాటేస్తుంటాయి’ అంటూ స్పందించాడు ఓ స్థానికుడు. (క్లిక్: అమాంతం కుప్పకూలిన బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు) -
మహారాష్ట్రలోని పాల్ఘర్లో భూకంపం
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్‌కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. -
ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సాధువులపై దాడి చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని బలివాలి వద్ద ఉన్న జఘ్రుత్ మహాదేవ్ మందిర్ ఆశ్రమంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయం పూజారులపై దాడి చేసి రూ. 6800 విలువైన వస్తువులతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ జాగ్రీత్ మహాదేవ్ ఆలయంలో పూజారులుగా ఉన్న శంకరానంద్ దయానంద్ సరస్వతి (54), శ్యామ్సింగ్ సోమ్సింగ్ ఠాకూర్ (60) పై దాడి చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 వేలు రికవరీ చేశారు.మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా ముగ్గురు నిందితులపై ఐపీసీ 394 సెక్షన్‌తో పాటు పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సురేష్ వరడే తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 16న చెందిన కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాధువులు ముంబై నుంచి సూరత్ వైపు వెళుతుండగా పాల్ఘర్ జిల్లాలో ఒక గుంపు వీరిని అడ్డగించింది. దొంగలేమోనన్న అనుమానంతో వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది మైనర్లతో కనీసం 133 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసు కోసం జనం పోరాటం!
ముంబై: సాధారణంగా పోలీసులకు, ప్రజలకు మధ్య అంత సత్సబంధాలు ఉండవు. సినిమాలో మాత్రమే నిజాయితీ గల పోలీసు ఆఫీసర్‌కు ఏదైన జరిగితే జనం పోరాడటం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... నిజాయితీగా పనిచేస్తున్న పాల్ఘర్ జిల్లా ఎస్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయనను వెనక్కి తీసుకురావాలంటూ పాల్ఘర్ గ్రామస్థులు ఆన్లైన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ సంతకాలు స్వీకరిస్తోన్నారు. పాల్ఘర్ మూక దాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్ సింగ్‌ని 5 రోజుల క్రితం అత్యవసర సెలవు తీసుకొని వెళ్లాల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే గౌరవ్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫీయా, గుట్కా, లిక్కర్ మాఫియాని అన్నింటిని అరికట్టారని పాల్ఘర్ ప్రజలు తెలిపారు. ఆయన వచ్చినప్పటి నుంచే ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. గౌరవ్ వారందరి ఆస్తి అని, ఆయన సూపర్ కాప్ అని పేర్కొన్నారు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే పాల్ఘర్లో మూకదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అయనను వెంటనే మే 8 తేదీన సెలవు మీద పంపించేసింది. ఆయనను మళ్లీ వెనక్కి రప్పించడానికి సుజిత్‌సింగ్, సామాజిక కార్యకర్త కరణ్ చౌదరి ఆధ్వర్యలో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్‌ను నడిపిస్తూ సంతకాలు కూడా స్వీకరిస్తోన్నారు. ఇప్పటి వరకు 350 మంది దీని మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాఖ్రేకి గౌరవ్‌సింగ్‌ని వెనక్కి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తోన్నారు. పాల్ఘర్ మూకదాడులలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కేసుకు సంబంధించి రాష్ట్ర క్రిమినల్ ఇన్వేస్టిమెంట్ డిపార్ట్మెంట్ 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ఒక మైనర్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య 146 కి చేరింది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు) -
ప్రేమిస్తున్నాను.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి
ముంబై : ఉద్యోగాల పేరుతో.. ప్రేమ పేరుతో దాదాపు 500 మంది అమ్మాయిలను, మైనర్ యువతులను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని, అతని ఏజేంట్లను పాల్ఘార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సైదుల్ షేఖ్(38) 2010 నుంచి థానే జిల్లా దొంబివాలి మన్‌పడాలో నివాసం ఉంటున్నాడు. ఇండియాలో నివాసం ఉంటున్న షేఖ్ తన ఏజెంట్ల ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన యువతలను అక్రమంగా ఇక్కడికి తీసుకువచ్చి వారిని అసాంఘీక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులకు అమ్మేవాడు. ఈ క్రమంలో షేఖ్ ఏజెంట్లు సదరు యువతులను ప్రేమ పేరుతో.. ఉద్యోగాల పేరుతో మాయ మాటాలు చెప్పి ముంబై తీసుకు వచ్చేవారు. ఇలా తీసుకువచ్చిన అమ్మాయిలను షేఖ్‌కు అప్పగించేవారు. వీరిని షేఖ్ ఒక్కోక్కరిని లక్ష రూపాయలకు సదరు ముఠాలకు విక్రయించేవాడు. ఈ అక్రమ రవాణా దందా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఈ విషయం గత ఏడాది పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు సంవత్సరం నుంచి షేఖ్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షేఖ్ అనుచరుడు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలిసులు షేఖ్‌తో పాటు మరో ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే షేఖ్ మీద పలు కేసులు నమోదయ్యాయని.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
రైల్వేపోలీసులు ఈవ్ టీజర్మ మధ్య ఘర్షణ
-
శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం
పాల్గార్: శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్నారు. పాల్గార్ జిల్లాలో ఓ పెళ్లికి హాజరయి తిరిగి వస్తుండగా చరోటి చెక్ పోస్టుకు సమీపంలో తెల్లావారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే వాపి ప్రాంతంలోని హరియా ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కృశాన్ ఘోడా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రణషీత్ లో నిర్వహించనున్నారు. -
‘పాల్ఘర్’ పాలన షురూ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో 36వ జిల్లా అవతరించింది. ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారికంగా ప్రారంభించారు. దీంతో స్థానికుల 29 యేళ్ల కల నిజమైనట్లయ్యింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు (పాల్ఘర్, వసాయి, డహాణూ, జవ్హార్, మోఖాడా, విక్రమ్‌గఢ్, తలాసరీ, వాడా) తాలూకాలున్నాయి. దీంతో ఠాణే జిల్లాలో ప్రస్తుతం ఏడు (ఠాణే, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్, అంబర్నాథ్, ముర్బాడ్, భివండీ, షాపూర్) తాలూకాలే మిగిలాయి. పాల్ఘర్ జిల్లా ఏర్పాటును జవార్, విక్రమ్‌ఘడ్, తలాసరి, మోఖాడా తదితర తాలూకాలోన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి సంబంధించి నల్లజెండాలను కూడా ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. ఇది మినహా జిల్లా అవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్ఘర్ సెషన్‌కోర్టు సమీపంలోని సేల్స్‌టాక్స్ నూతన భవనంలో జిల్లా కార్యాలయాన్ని పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. వర్షం కారణంగా పాల్ఘర్కు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్ జిల్లా అవిర్భావోత్సవ కార్యక్రమం జాప్యం కాకుండా ఉండేందుకు రైలుమార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆయన బాంద్రా-వాపి షటిల్ రైల్లో పాల్ఘర్కు చేరుకున్నారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మళ్లీ పాల్ఘర్ రైల్వేస్టేషన్ నుంచి గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్, వసంత్ డావ్కరే, జిల్లా ఇంచార్జీ మంత్రి గణేష్ నాయిక్లతోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాల కిందటే ఠాణేను విభజించి, పాల్ఘర్ లేదా జవార్ జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ అధికారికంగా 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న శరద్‌పవార్ జిల్లా విభజన అవసరమని చెప్పారు. రాజకీయంగా... ఠాణే జిల్లా విభజన అనంతరం కూడా ఠాణే జిల్లానే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జిల్లా విభజన అనంతరం జిల్లా విస్తరణ, క్షేత్ర విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఠాణే జిల్లా కంటే పాల్ఘర్ పెద్ద జిల్లాగా అవతరించింది. రాజకీయపరంగా పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఠాణేకే పెద్దపీట వేశారు. పాత జిల్లాలో నాలుగు లోకసభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. కాని విభజన అనంతరం పాల్ఘర్ జిల్లాలో కేవలం ఒక లోకసభ (పాల్ఘర్) మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే ఠాణేలో మాత్రం మూడు లోక్‌సభ (ఠాణే, భివండీ, కళ్యాణ్), 18 అసెంబ్లీ నియోజకవర్గాలుండనున్నాయి.