Palla Venkat Reddy
-
పోరాటాలకు సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగ, ప్రజాస్వా మ్య పరిరక్షణకు వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాలు, రాష్ట్ర చరిత్ర వక్రీకరణకు మతోన్మాదశక్తులు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి హాల్లో తెలంగాణ అమరవీరుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన సాయుధపోరాట వార్షికో త్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా గార్లపాటి రఘుపతిరెడ్డి రచించిన ‘ఉరికంబం ఎక్కుతూ తిరిగొచి్చన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో పెరుగుతున్న ధరలు, ఇతర సమస్యలపై నేడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు లు సాయుధ పోరాటం నిర్వహించిన ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందే తప్ప సర్దార్‌పటేల్ వల్ల కాదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. సాయుధపోరులో నాలుగున్నర వేల మంది అమరులైన చరిత్ర నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం కోసం తెలంగాణ సమాజం పోరాడుతూనే ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో జైని మల్లయ్యగుప్తా, కందిమళ్ల ప్రతాపరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకటరెడ్డి్డ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి చాడ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్‌రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆయనతోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా పల్లా వెంకట్ రెడ్డి, కునంనేని సాంబశివరావును ఎన్నుకోగా, కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్.బాలమల్లేశ్, పి.పద్మ, ఇ.నరసింహ, ఎం.ఆది రెడ్డి, టి.శ్రీనివాసరావు, జి.మల్లేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మరో 33 మందిని కలుపుకొని మొత్తం 133 మందితో రాష్ట్ర కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఫ్రంట్ ముగిసిన సీపీఐ రాష్ట్ర మహాసభలు ఎన్నికల హామీలను నెరవేర్చలేక, మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో చూపలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి, ఈ సమావేశంలోని తీర్మానాలను, వివరాలను కూనంనేనితోపాటు పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ఎన్.బాలమల్లేశ్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి, వాటిపై కేంద్రీకరించి పనిచేస్తామన్నారు. ఆ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా బలం పెంచుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో కోదండరాం, వామపక్ష, ప్రజాస్వామిక, లౌకికశక్తులతో కలసి పెద్దఎత్తున ప్రజాపోరాటాలు నిర్వహిస్తామన్నారు. -
సీపీఐ మాజీ ఎమ్మెల్యే బద్దు చౌహాన్ కన్నుమూత
హైదరాబాద్, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత ముడావత్ బద్దు చౌహాన్(62) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఎల్బీనగర్ పరిధి కొత్తపేట లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, రవీందర్ నాయక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, పల్లా నర్సింహారెడ్డి సహా పలువురు సందర్శించి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గిరిజన సమస్యల పరిష్కారానికి గొంతెత్తిన నేత చౌహాన్ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కొరివి మండలం కంచర్లగూడేనికి చెందిన తుపియా చౌహాన్, చోమ్లీ దంపతులకు రెండో కుమారుడైన బద్దుచౌహాన్ తొలుత అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)లో పనిచేశారు. ఎంఏ, బీఈడీ చదివారు. ఆయన కుమారుడు గౌతమ్ చౌహాన్, కుమార్తె ఝాన్సీ లక్ష్మీ ఇద్దరూ వైద్యులే. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో సీపీఐ అభ్యర్థిగా 1985 ఎన్నికలలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్యానాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ సంఘం నాయకుడిగా సేవలందించారు. కొన్ని రోజుల క్రితం రైలు దిగుతూ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో వెన్నుపూసకు గాయమవ్వడంతో పక్షవాతం బారినపడ్డారు. బద్దు చౌహాన్ అంత్యక్రియలు సోమవారం చైతన్యపురి వీవీనగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.