panchati raj
-
పంచాయతీ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లే.. !
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నిక లు నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌శాఖ సన్నాహాలు చేస్తోంది! కొత్తగా గ్రామ పంచాయతీలు ఆవిర్భవించడంతో పాత రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని సూత్రప్రాయంగా నిర్దేశించింది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి పోవడంతో ప్రత్యే కాధికారులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. అయితే, వచ్చే జనవరి రెండో వారంలోగా పంచాయతీలకు ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టిం ది. పంచాయతీల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటే మొదట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇటీవలే ధ్రువీకరించింది. దీంతో పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇం దులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా కులాల గణనను నిర్వహిం చి, కులాల వారీగా ఓటర్లను గుర్తించాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సా మాజిక వర్గాల వారీగా ఓటర్ల గణన పూర్తి చేస్తే వాటి లెక్క ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. 50 శాతం మహిళలకే.. జిల్లాలో ఉన్న పంచాయతీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అందులో 50 శాతం పంచాయతీలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. ఆ తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా పంచాయతీలను రిజర్వు చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. అయితే, కొత్తగా ఆవిర్భవించిన పంచాయతీల్లో ఎక్కువ శాతం గిరిజన తండాలు ఉండటంతో ఆ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వు చేస్తారా లేక జనరల్ స్థానాలుగా పరిగణిస్తారో తేలాల్సి ఉంది. ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలను జనరల్ స్థానాల కింద పరిగణిస్తే ఓసీ, బీసీలు ఎక్కువ మంది ఉన్న చోట నష్టం కలిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసే మార్గదర్శకాలతోనే రిజర్వేషన్లను ఏ విధంగా కేటాయిస్తారో వెల్లడవుతుంది. పాత రిజర్వేషన్లు పోయినట్లే! కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించడంతో గతంలో ఏ విధమైన రిజర్వేషన్లు ఉన్నా వాటిని ఇప్పటి ఎన్నికల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. అంటే మునుపటి ఎన్నికల్లో ఒక పంచాయతీని బీసీ మహిళకు కేటాయిస్తే, ఈ సారి కూడా బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే, బీసీ మహిళలకు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలోని రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో లెక్కలోకి తీసుకోకుండానే కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి, అలాగే మహిళలకా లేక జనరల్ అనేది నిర్ణయించాల్సి ఉంది. అందువల్ల ఆశావహుల్లో కొంత మందికి సంతోషం కలుగుతుండగా, మరి కొందరికి నిరాశ కలిగిస్తోంది. సర్పంచ్ల స్థానాలే కాకుండా వార్డు సభ్యుల స్థానాలు సైతం రిజర్వేషన్ల ప్రకారం మార్పు చెందనున్నాయి. గతంలో కేటాయించిన రిజర్వేషన్‌ను మళ్లీ కేటాయించడమా లేక కొత్త విధానం ప్రకారం మరో విధంగా రిజర్వేషన్ కేటాయించడమా అనేది పంచాయతీ రాజ్ శాఖ జారీ చేయనున్న మార్గదర్శకాల ప్రకారం సాగనుంది. ఆశావహుల్లో ఉత్కంఠ.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గతంలోని రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందనే విషయం అంచనా వేయవచ్చు. అయితే, పంచాయతీల సంఖ్య పెరిగిన దృష్ట్యా కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహించాల్సి రావడంతో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో అంతు చిక్కకుండా ఉంది. తమకు పోటీ చేయడానికి అవకాశం వస్తుందా.. లేదా? అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, కులాల వారీగా ఓటర్ల గణనకు ఎక్కువ సమ యం లేనందున పంచాయతీరాజ్ శాఖ త్వరగా రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశముంది. -
‘పంచాయతీ’కి సన్నద్ధం
మెదక్ అర్బన్: హైకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 11ను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలనే హైకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో తెలియపర్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని తక్షణమే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయాలపై గడువును నిర్దేశిస్తూ షెడ్యూల్‌ను జారీ చేసింది. అలాగే గ్రామపంచాయతీ పాలకమండళ్ల ఐదేళ్ల పదవీ కాల పరిమితి ఈ సంవత్సరం ఆగస్టు 2తో ముగిసింది. వీళ్ల కాలపరిమితి ముగిసేలోగా పంచా యతీ ఎన్నికలు జరగకపోవడంతో ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారులకు గ్రామపంచాయతీల పరిపాలన బాధ్యతలను అప్పగించారు. అయితే నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారుల పాలన మూడు నెలలకు మించి కొనసాగేందుకు వీలులేదు. ఈనెల 11న హైకోర్టు వెలువరించిన ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో గతంలో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితా తయారీ, బ్యాలెట్ బాక్సుల ఏర్పాట్లు, బ్యాలెట్ పేపర్లు, సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తిరిగి ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉంది. నూతన జాబితా ప్రకారం సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, పేపర్లను తిరిగి కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఇదీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్.. సెప్టెంబరు 25 నాటి అసెంబ్లీ ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించాలి. నవంబరు మొదటి వారం నుంచి మూడో వారం వరకు ఓటరు జాబితా తయారీ ప్రక్రియ పూర్తి చేయాలి. జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు చేపట్టాలి. ఓటరు సంఖ్య ఆధారంగా పోలింగ్ స్టేషన్లను గుర్తించి పోలింగ్స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. నవంబరు నాలుగోవారం నుంచి డిసెంబరు మొదటివారం లోగా ప్రక్రియ పూర్తి కావాలి. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాను సరి చూసుకోవడంతో పాటు స్టేజ్–1, స్టేజ్–2 అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. నవంబరు నాలుగో వారంలో స్టేజ్–1, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, డిసెంబరు మొదటి వారంలో స్టేజ్–2 , రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణనివ్వాలి. సంబంధిత ఆర్డీఓలు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.పోలింగ్ సిబ్బంది జాబితా సవరించి నవంబరు రెండో వారంలో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు డిసెంబరు రెండో వారంలో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. గతంలోనే ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలోనే జిల్లాలో పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. కొత్తగా వచ్చిన ఓటరు జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన సౌకర్యాలు రూపొందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి వాటిపై కసరత్తు పూర్తయింది. పంచాయతీల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకు తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –హనోక్, జిల్లా పంచాయతీ అధికారి -
పదోన్నతుల జాతర..
ఆదిలాబాద్‌అర్బన్: పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల ఇరవై నాలుగేళ్ల నిరీక్షణకు ప్రస్తుత సర్కారు తెర వేసింది. మండల అభివృద్ధి అధికారులకు పదోన్నతులు కల్పించాలని పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలించాయి. పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతుల ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేయడంతో పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులకు లైన్ క్లియరైంది. అప్పటి ప్రభుత్వం 1994లో పీఆర్ శాఖలో పదోన్నతులు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జూన్, జూలైలో సాధారణ బదిలీలు చేపట్టినా.. పంచాయతీ రాజ్ శాఖలో ఎలాంటి బదిలీలు చేపట్టని విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది ఎంపీడీవోలు సీనియార్టీ ప్రకారం పదోన్నతులకు అర్హులుగా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏడుగురికి పదోన్నతుల్లో అవకాశం లభించనుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవో, డీఆర్డీవోలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ హోదా స్టేట్ క్యాడర్ కావడంతో ప్రభుత్వం నుంచి పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంటుందని సంబందిత అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతులతో ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేయడానికి మరికొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. ఆ ఏడుగురు అధికారులు వీరే.. సీనియార్టీ జాబితా ప్రకారం పదోన్నతులు పొందునున్న ఆయా ఎంపీడీవోలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ రెగ్యులర్ ఎంపీడీవో జితేందర్‌రెడ్డి(ప్రస్తుతం ఇన్చార్జి జెడ్పీ సీఈవోగా కొనసాగుతున్నారు), మంచిర్యాల రెగ్యులర్ ఎంపీడీవో కే.నరేందర్(ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్నారు), ఇచ్చోడ రెగ్యులర్ ఎంపీడీవో వెంకట సూర్యరావు(డిప్యూటేషన్‌పై ప్రస్తుతం పీఆర్ కమిషనరేట్‌లో పని చేస్తున్నారు), జన్నారం ఎంపీడీవో శేషాద్రి(ప్రస్తుతం టీసీ ఫాడ్లో పని చేస్తున్నారు), సిర్పూర్(యు) ఎంపీడీవో రవీందర్(ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీడీవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు), జైనూర్ ఎంపీడీవో దత్తరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి(డీఆర్డీవో)గా ఆదిలాబాద్‌లో పని చేస్తున్న రాజేశ్వర్ రాథోడ్‌లు పదోన్నతులు పొందనున్న వారి జాబితాలో మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పునర్విభజనతో నాలుగు జిల్లాలుగా ఏర్పాటైంది. ప్రస్తుతం నాలుగింటికి ఒకే జిల్లా పరిషత్ ఉంది. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పని చేస్తున్నారు. జిల్లా పరిషత్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో రెండు పోస్టులే అవసరం. వీరిద్దరే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వీరితోపాటు డీఆర్డీవో కూడా ఇక్కడే ఉండనున్నారు. అంటే పదోన్నతులు పొందిన ఏడుగురిలో ముగ్గురు ఇక్కడ ఉండగా, మిగతా నలుగురు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పంచాయతీ రాజ్ శాఖ విభజన అయ్యి నాలుగు జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు ఉంటే పదోన్నతులు పొందిన ఎంపీడీవోలందరూ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉండేవారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ విభజన కాకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందనే కొంత బాధ ఎంపీడీవోల్లో లేకపోలేదు. మరో 35 మంది అధికారులకు కూడా.. ఉమ్మడి జిల్లాలో త్వరలో జరుగనున్న ఎంపీడీవోల పదోన్నతుల వల్ల ఖాళీ కానున్న వారి స్థానా లను భర్తీ చేసేందుకు సైతం రంగం సిద్ధమైంది. ఇందుకు ఉద్యోగుల సీనియార్టీ జాబి తాను పంచా యతీ రాజ్ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం 312 మంది అధికారులతో కూడిన సీనియార్టీ జాబితాను తయారు చేసి ప్రస్తుతం సిద్ధంగా ఉంచారు. ఆ జాబితాలోంచి ఎంపీడీవోలతోపాటు పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సుమారు మరో 35 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత పన్నేం డేళ్ల క్రితం 2006లో సీఈవో, డిప్యూటీ సీఈవోగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించినా ఇంతా పెద్ద మొత్తంలో పదోన్నతులు లభించలేదు. కేవలం ఎంపీడీవోలకే పదోన్నతులు కల్పించి మిగతా వారికి చేపట్టకపోవడంతో కింది స్థాయి అధికారుల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని సమాచారం. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన నియామకాలకు అవకాశం.. ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేసేందుకు సూపరింటెండెంట్ల(పర్యవేక్షకులు)కు, ఈవోఆర్డీలకు అవకాశం ఉండగా, సూపరింటెండెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియర్ అసిస్టెంట్లకు, సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు జూనియర్ అసిస్టెంట్లకు, టైపిస్టులకు అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు టైపిస్ట్‌లకు, రికార్డు అసిస్టెంట్లకు, రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు అటెండర్లకు అవకాశం కలుగనుంది. ఇలా పంచాయతీ రాజ్ శాఖలో సుమారు 35 నుంచి 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు వరించనున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–1 అధికారిగా కొనసాగుతున్న వారికి ఈవోపీఆర్డీగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–2 అధికారికి గ్రేడ్–1గా, గ్రేడ్–3 అధికారికి గ్రేడ్–2గా కూడా పదోన్నతులు లభించనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, పదోన్నతులు కల్పించడంపై పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజానన్‌రావు, సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కృష్ణారావులకు ధన్యవాదాలు తెలిపారు. -
పంచాయతీకో కార్యదర్శి
ఖమ్మం సహకారనగర్: పంచాయతీల పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించేందుకు మరింత పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. జిల్లాలో ప్రస్తుతం కార్యదర్శులు తక్కువగా ఉండడం.. వారికి ఇతర పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బాధ్యతలు నిర్వర్తించే కార్యదర్శులు కూడా విధి నిర్వహణకు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించనున్నారు. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాత పంచాయతీలు 427 కాగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 167 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అదే సమయంలో 10 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో విలీనమయ్యాయి. మొత్తం పంచాయతీలకు కలిపి కేవలం 102 మంది కార్యదర్శులున్నారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా కార్యదర్శులను నియమించి.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్యదర్శులు అందుబాటులో లేక.. 584 గ్రామ పంచాయతీలలో 102 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అర్థంకాని పరిస్థితి. ఒకవైపు పని ఎక్కువగా ఉందని కార్యదర్శులు వాపోతుండగా.. మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. అత్యవసరంగా గ్రామ కార్యదర్శి సంతకం కావాలన్నా రోజుల తరబడి కార్యదర్శుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి ఏ గ్రామంలో ఉన్నాడో అర్థం కాకపోవడం, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా కార్యదర్శుల జాడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యదర్శుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. 485 పోస్టుల భర్తీ.. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలుండగా.. 102 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 485 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు భర్తీ అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇదే అవకాశం.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా నూతన కార్యదర్శులను నియమించనున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పనిభారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. – చెరుకూరి పవన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గురువారం నిరవధిక వాయిదా పడింది. పదమూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తం 11 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో పంచాయతీ రాజ్ బిల్లు కూడా ఆమోదం ఉంది. మొత్తం 60 గంటల 58 నిమిషాల పాటు సభ కొనసాగింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో 82 మంది టీఆర్ఎస్ సభ్యులు, 17 మంది కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ఐదు మంది బీజేపీ, ముగ్గురు టీడీపీ, వామపక్షపార్టీల సభ్యులు ఇద్దరు, ఓ ఇండిపెండెంట్, ఓ నామినేటేడ్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై సస్పెన్షన్ వేటు పడటంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ఆమోదించింది. బుధవారం విద్యార్థి సంఘాలు ప్రైవేటు యూనివర్శిటీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. -
జెడ్పీ సీటు..చిచు
పరిపాలనా విభాగంలో కొత్త వివాదం రాజుకుంది. ఇటీవల జిల్లా పరిషత్ సీఈవోగా నియుమితులైన అనితాగ్రేస్ను జారుున్ చేసుకోకుండా కలెక్టర్ వెనక్కి పంపించటం చర్చనీయూంశంగా వూరింది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అనితాగ్రేస్ను సీఈవోగా నియుమిస్తూ ఈనెల 18న రాష్ట్ర పంచాయుతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తన బాధ్యతలు చేపట్టేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్‌ను కలిశారు. ఆయున వివుుఖత చూపటంతో వెనుదిరిగి వెళ్లారు. గతంలో ఎన్నికల పని చేసిన అనుభవం లేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా పని చేయుటం కష్టవువుతుందని చెప్పి ఆమెను తిప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. అదే సవుయుంలో ఈ వుూడు నెలలపాటు ఎన్నికల విధుల నిర్వహణకు వీలుగా రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈవోగా నియుమించాలని రాష్ట్ర పంచాయుతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కలెక్టర్ ఫాక్స్‌లో లేఖ పంపించినట్లు తెలిసింది. అప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం అధికారులందరిలో హాట్ టాపిక్‌గా వూరింది. తావుు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతో పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు సైతం కలెక్టర్ చర్యకు విస్తుపోరుునట్లు ప్రచారం జరిగింది