సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గురువారం నిరవధిక వాయిదా పడింది. పదమూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తం 11 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో పంచాయతీ రాజ్ బిల్లు కూడా ఆమోదం ఉంది. మొత్తం 60 గంటల 58 నిమిషాల పాటు సభ కొనసాగింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో 82 మంది టీఆర్‌ఎస్ సభ్యులు, 17 మంది కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ఐదు మంది బీజేపీ, ముగ్గురు టీడీపీ, వామపక్షపార్టీల సభ్యులు ఇద్దరు, ఓ ఇండిపెండెంట్, ఓ నామినేటేడ్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లపై సస్పెన్షన్ వేటు పడటంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి.
అయితే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ఆమోదించింది. బుధవారం విద్యార్థి సంఘాలు ప్రైవేటు యూనివర్శిటీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment