Panduranga
-
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
లక్ష్యమంటే లోతైన జ్ఞానానికి మెట్టు..
తత్వవేత్త, సామాజికవేత్త పాండురంగ శాస్త్రి ఆథావలే జీవితం, శాస్త్రీజీ అని, దాదాజీ అని ప్రేమగా పిలుచుకునే ఆథావలే దృష్టిలో లక్ష్యమంటే ఒక ప్రాజెక్టునో లేదా బడ్జెట్‌నో పూర్తి చేయడానికి నిర్దేశించుకునేలాంటిది కాదు. సువిశాలమైన, లోతైన జ్ఞానానికి మెట్టు. సరైన లక్ష్యం మానవ జీవితాన్ని మార్చేస్తుంది. వందేళ్ల క్రితం ఆనాటి బొంబాయి నగరంలో ఒక సనాతన కుటుంబంలో పుట్టిన దాదాజీ వేదాలను అధ్యయనం చేశారు. మార్క్స్‌ను చదివారు. తత్త్వవేత్తలైన సోక్రటీస్ నుంచి రస్సెల్ వరకు లోతుగా అధ్యయనం చేశారు. వేదాలను నేటి ఆధునిక జీవన విధానానికి అన్వయించుకునే విధంగా సరళమైన భాషలో రచనలు చేశారు. సామాన్యులకు కూడా వేద విజ్ఞానాన్ని అందించాలని తపన పడ్డారు. విశ్వాసం, కులం, వయసు, సమర్థత, రాజకీయ అనుబంధాలకు అతీతంగా సర్వమానవాళికీ వర్తించేలా కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. దేనినైనా నమ్మడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకోవడానికీ, తెలిసిన దానిని అమలు పరచడానికి ఎంతో వ్యత్యాసం ఉందని, ఆచరణ అన్నింటికన్నా ముఖ్యమైనదని చెప్పిన దాదాజీని, ఆయన శిష్యులను స్వాధ్యాయులు అని పిలిచేవారు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న పర్యావరణ పరిరక్షణ, జీవ సమతుల్యతల ఆవశ్యకత గురించి దాదాజీ ఏనాడో చెప్పారు. దాదాపు 20 గ్రామాలలో వృక్షాలు నాటించి, అవి పెరిగి పర్యావరణాన్ని పచ్చగా మార్చడం, తద్వారా మానవ జీవితాలు ఏ విధంగా ఫలప్రదం అవుతాయో గ్రామస్థులు స్వయంగా తెలుసుకునేలా చేశారు. ఆయన బోధలన్నీ విశ్వమానవుల ఆత్మగౌరవానికి తోడ్పడేవే. అక్టోబర్ 19 ఈ గౌరవనీయ తాత్వికుడి శతజయంతి. ఆరోజును ఆయన అనుయాయులు మానవాళి ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకున్నారు. -
మంచి అణువంతైనా పుణ్యం అనంతం
-ఇదే ‘పాండురంగ మాహాత్మ్యం’ సారాంశం –భువన విజయ ప్రసంగాల్లో కార్తికేయశర్మ రాజమహేంద్రవరం కల్చరల్ : మంచి అన్నది స్వల్పంగా చేసినా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందన్నదే తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యం’ సందేశమని ప్రముఖ సాహితీవేత్త కర్రా కార్తికేయశర్మ అన్నారు. ఆయన గడసరి పోకడల కవి అని కొనియాడా.నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరుగుతున్న భువన విజయ సాహితీప్రసంగ పరంపరలో భాగంగా గురువారం శర్మ ‘పాండురంగ మాహాత్మ్యం– రంగానుగ్రహం' అనే అంశంపై ప్రసంగించారు. శైవమతస్తుడయిన రామలింగడు రాయల కొలువులోకి వచ్చాక, వైష్ణవుడై 'రామకృష్ణుడు’ అయ్యాడని వివరించారు. తెనాలి అగ్రహారం స్వీకరించాక, తెనాలి ఇంటి పేరుగా వాడుకలోకి వచ్చిందన్నారు. పార్వతీదేవి తన పెంపుడు చిలుకకు విష్ణుసహస్ర నామాలు నేర్పినట్టు రామకృష్ణుడు తన ప్రబంధంలోని ఆరంభపద్యాలలో పేర్కొన్నాడన్నారు. ఇందులో అసమంజసం ఏమీ లేదని, స్త్రీకి పుట్టింటిమీద మమకారం సహజమని, పార్వతి 'పద్మనాభ సహోదరి', విష్ణువుకు చెల్లెలని చెప్పారు. ‘పాండురంగ మాహాత్మ్యం’లో అపమార్గం పట్టిన నిగమ శర్మను సంస్కరించడానికి ప్రయత్నించే అతడి సోదరిని అక్కగానే రామకృష్ణుడు వ్యవహరించారని, అగస్త్యుని సోదరుని అగస్త్యభ్రాతగానే ప్రాచీనకావ్యాలలో చెప్పారని అన్నారు. నిగమశర్మ ఎలా విష్ణు సాయుజ్యం పొందాడో కవి తనప్రబంధంలో వివరించారన్నారు. జోరాశర్మ (జోస్యుల రామచంద్ర శర్మ) అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ముత్యా వెంకటేశ్వరరావు ప్రసంగించారు.రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతలపాటి శర్మ స్వాగతం పలకగా, దేవీసుదర్శన్ వందన సమర్పణ చేశారు. నేడు మనుచరిత్రపై సందీప్ ప్రసంగం భువన విజయసాహితీప్రసంగాలలో భాగంగా శుక్రవారం ‘మనుచరిత్ర–జీవన విధులు’ అనే అంశంపై తాతా రమా సత్యసందీప శర్మ ప్రసంగిస్తారు. -
యువతుల్లారా జాగ్రత్త!
పాండురంగారావుపై ఏ కేసు నమోదు చేస్తారు? మూడేళ్ల పాటు తనను ప్రేమ పేరుతో వంచించి చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ యువతిని అన్ని విధాలా మోసం చేసిన ఆ యువకుడిపై ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు నమోదు చేస్తారు? ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన పైదా కరుణ(23) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో చర్ల మండలం వెంకటాపురం ఉప్పిడి వీరాపురంనకు చెందిన చల్లూరి పాండురంగారావు(23) కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పాండురంగ పెళ్లి చేసుకొంటానని కరుణను నమ్మించి లోబర్చుకున్నాడు. ఖమ్మంలో ఓ సంవత్సరం పాటు ఇద్దరూ కలిసి ఒకే గదిలో సహజీవనం చేశారు. పాండురంగారావు గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ప్రాజెక్ట్ వర్క్‌పై ఖమ్మం వచ్చిన పాండురంగారావుని కరుణ నిలదీయగా తాను వివాహం చేసుకున్నది నిజమేనని చెప్పాడు. సింపుల్‌గా తనను మర్చిపోమ్మన్నాడు. తన పరిస్థితి ఏమిటని అడిగిన కరుణకు, తనకేమీ సంబంధం లేదని చెప్పాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కరుణ అతనిని నమ్మింది. మోసపోయానని తెలుసుకొని, అతని మాటలకు కడుపు మండి కోపంతో బ్లేడుతో అతడి గొంతుపై గాయం చేసింది. స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. అతని మోసం వల్ల కరుణ జీవితాన్ని నష్టపోయింది. ఇప్పడు పోలీసులు ఆ విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమెదు చేశారు. అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పోయిన తరువాత ఆ పాండురంగ కొత్తపెళ్లాంతో హాయిగా జీవితం గడుపుతాడు. కరుణ పరిస్థితి ఏమిటి? పాండురంగపై ఏ కేసు నమోదు చేస్తారు? ఇటు వంటి విషయాలలో అన్నివిధాల యువతులే నష్టపోతున్నారు. ఈ విధంగా మోసపోయిన ఎంతో మంది యువతులు విషయం బయటకు తెలిస్తే, తమ జీవితాలకే ముప్పు అని గుట్టుగా బతుకుతున్నారు. ధైర్యం చేసి మోసగాడిని నిలదీసి, ఎదురుతిరిగిన యువతల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అందువల్ల యువతుల్లారా జాగ్రత్త!