panel speaker
-
లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి తాజాగా లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. -
అనూహ్యంగా తెరపైకి వచ్చిన రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సభలో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్యానల్ చైర్మన్ హొదాలో అనూహ్యంగా రేణుకా చౌదరి సభ నిర్వహించారు. లోక్‌సభలో బిల్లును పెట్టిన రీతిలోనే కాంగ్రెస్ పథక రచన చేసింది. రాజ్యసభలో షిండేకు రక్షణగా మార్షల్స్తోపాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా నిలబడ్డారు. బిల్లును అడ్డుకునేందుకు శివసేన, సీపీఎం, జేడీయూ, తృణమూల్, సీపీఎం ఎంపీల ప్రయత్నిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ సభ్యులు తోపులాటకు దిగారు.