p.Anil kumar yadav
-
వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా అనిల్
నెల్లూరు (సెంట్రల్): వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ను నియమించారు. ఈ కమిటీకి అసెంబ్లీ స్పీకర్ చైర్మన్‌గా ఉంటారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కూడా హాజరయ్యారు. -
నగరం కదిలింది
నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ శనివారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. తొలుత అనిల్ గాంధీబొమ్మ సెంటర్ నుంచి నామినేషన్ వేయనున్న మున్సిపల్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కనకమహల్ సెంటర్, ములుముడి బస్టాండ్, చిన్నబజారు, పెద్దబజారు, అలంకార్‌సెంటర్ మీదుగా సాగింది. ర్యాలీకి ముందు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. అనిల్ నామినేషన్ కార్యక్రమానికి సిటీ నియోజకవర్గం నుంచి జనం వేలసంఖ్యలో తండోప తండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు మండే ఎండను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో హాజరుకావడం విశేషం. ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, బొమ్మ హెలికాప్టర్లు ఆకట్టుకున్నాయి. బాణసంచాతో నగరం మార్మోగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌తో పాటు జియాఉద్దీన్, పులిమి శైలజ, ముక్కాల ద్వారకానాథ్, దువ్వూరు శరశ్చంద్ర, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పడవల సుధాకర్, పుట్టా రామకృష్ణారెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్ జలీల్, ఎ.బాలకోటేశ్వరరరావు, రాజశేఖర్, ఎండీ ఖలీల్ అహ్మద్, ముప్పసాని శ్రీనివాసులు, మునీర్‌సిద్దిక్, లెక్కల వెంకారెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్కే సుభాన్, అతహర్, షఫీ, సుధీర్‌బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం వైఎస్సార్సీపీదే: ఎంపీ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో జనం వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారన్నారు. తిరిగి వైఎస్సార్ పాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని జనం భావిస్తున్నారని మేకపాటి చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల సంగతి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అన్నీ చేస్తానంటూ కపట నాటకాలు ఆడుతున్నారని మేకపాటి విమర్శించారు. అనిల్‌తో పాటు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశమివ్వండి: అనిల్ ‘కుట్రలు, కుతంత్రాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 90 ఓట్ల తేడాతో ఓటమి చెందాను. కష్ట నష్టాల కోర్చి ఐదేళ్లుగా మిమ్మల్నే నమ్ముకుని పనిచేస్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం సాగిస్తున్నా.. వైఎస్సార్ దీవెనలు, జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో పాటు మీరందరూ ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి’ అని శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా నామినేషన్ వేసిన డాక్టర్ పి.అనీల్‌కుమార్ యాదవ్ నెల్లూరు సీటీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ అనంతరం అనిల్ మాట్లాడారు. వైఎస్సార్ మరణించిన తర్వాత చీకటి పాలనతో విసిగిపోయారన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందన్నారు. అందుకే వైఎస్సార్సీపీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భా రీ మెజార్టీతో తనను గెలిపించాలని అనిల్ కోరారు. ప్రజల రుణం ఉంచుకోనని, జగన్ నాయకత్వంలో మంచిపరిపాలన కోసం శ్రమిస్తామన్నారు. -
ఉద్యమం ఉధృతం
నెల్లూరు(సెంట్రల్), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండువద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి, నెల్లూరురూరల్, వెంకటగిరి నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్ష టయోటా షోరూంను విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి, ధర్నా నిర్వహించారు. నెల్లూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండులో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపక బృందం, విద్యార్థులు వీఆర్ కళాశాల నుంచి గాంధీబొమ్మ వరకు కేంద్ర మంత్రుల వేషధారణలు వేయించి ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రుల వేషధారణలోని వారిని మహిళలు చీపుర్లు, చెప్పులతో కొట్టారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు వీఆర్ కళాశాల నుంచి గాంధీబొమ్మ వరకు భిక్షాటన చేశారు. అనంతరం మోకాళ్లపై నిలబడి మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని విధులను బహిష్కరింపజేశారు. వెంకటగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సోనియా, కేసీఆర్, పనబాక లక్ష్మి, దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, చింతా మోహన్, పురందరేశ్వరి బొమ్మలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి అడ్డ రోడ్డు సెంటర్ వరకు ఎన్ఎంయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సీమాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో కాశీపేట సెంటర్లో ప్రజలు క్రికెట్ ఆడుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తుండగా, వరికుంటపాడు మండలం రామాపురం, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వారు పామూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆత్మకూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ముత్తుకూరులో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బ్రహ్మదేవిలో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తోటపల్లిగూడూరు, పేడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాఠశాలలు, బ్యాంకులను మూతవేయించారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు న్యాయవాదులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాశం సునీల్ కుమార్, సీహెచ్.బాలచెన్నయ్య మద్దతు ప్రకటించారు. గూడూరు క్లాక్ టవర్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద ఎంప్లాయీస్ యూనియన్ రిలే నిరాహార దీక్ష ద్వారా నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం రేబాల వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. కడనూతలలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బృందావనం కాలనీ నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి వైఎస్సార్సీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలిపారు. కావలిలో ఎస్టీయూఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.